Fasting Health Benefits| ఉపవాసం ఆధ్యాత్మిక చింతన కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా!-know upavasam rules and how spiritual fasting help us our well being ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fasting Health Benefits| ఉపవాసం ఆధ్యాత్మిక చింతన కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా!

Fasting Health Benefits| ఉపవాసం ఆధ్యాత్మిక చింతన కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా!

HT Telugu Desk HT Telugu
Sep 22, 2022 07:28 PM IST

Navaratri 2022: ఉపవాసం కేవలం దైవ చింతన కలిగిన వారు మాత్రమే చేసేది కాదు. ఈ ఉపవాసంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

Navaratri 2022- Fasting Health Benefits (Representational Image)
Navaratri 2022- Fasting Health Benefits (Representational Image) (Unsplash)

ఆధ్యాత్మిక భావనలో ఉపవాసం మనిషిని మాధవుడితో అనుసంధానం చేసేదిగా చెప్తారు. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా నివాసం ఉండటం అనే అర్థం ఉంది. దైవ చింతన కలిగిన వారు ప్రత్యేక రోజులలో, పర్వదినాలలో ఉపవాసం ఉంటారు. భగవంతుణ్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తులు ఉంటారు. ఈ ఉపవాస దీక్ష ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు చేపట్టవచ్చు.

అయితే మీరు భక్తితో చేసే ఈ ఉపవాసం మీకు ఆధ్యాత్మికపరంగానే కాదూ, ఆరోగ్యపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. కొంత సమయం పాటు కడుపు ఖాళీగా ఉండటం వలన మీరు ఆహారాన్ని జీర్ణించుకునే శక్తి పెరుగుతుంది. ఆకలి వృద్ధి అవుతుంది. మలిన పదార్థాలు బయటకు విసర్జన అవుతాయి, మూత్రపిండాలలోని టాక్సిన్లు, రాళ్లు తొలగిపోతాయి. కాలేయానికి విశ్రాంతి దొరుకుతుంది. శరీరంలో కొవ్వు, నీరు తగ్గి హృదయ స్పందన మెరుగుపడుతుంది, ఉపవాసంతో మంకీపాక్స్‌ను నయం చేయవచ్చు.

ఇంకా, ఉపవాసంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కాస్త వివరంగా తెలుసుకుందాం.

శరీరం నిర్విషీకరణ చెందుతుంది

ఉపవాస సమయంలో ఆహారాలకు బదులుగా ద్రవాలను తీసుకుంటే, శరీరం నిర్విషీకరణకు గురవుతుంది. శరీరంలోని విషపదార్థాలు బయటకు తొలగిపోతాయి. అంతే కాదు, జీర్ణక్రియను మెరుగుపడి ఉదర సంబంధిత, చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

బరువు తగ్గడానికి ఉపవాసం మంచి మార్గం. అడపాదడపా ఉపవాసం ఉండటం వలన, అది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటంలో సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

ఉపవాసం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. ఒక రోజు ఆహరం తినకుండా విరామం ఇవ్వడం వలన కొలెస్ట్రాల్‌ తగ్గుతుందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉపవాసం ఉండట ద్వారా శరీరంలో ట్రైగ్లిజరైడ్ అంటే ఒక రకమైన చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు.

చర్మం మెరుపును కాపాడుకోండి

మనం తినే అన్నపానీయాల ప్రభావం మన చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. వేయించిన-మసాలాలతో కూడిన ఆహారాలు తింటే చర్మంలో మెరుపు తగ్గుతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు పెరుగుతాయి. అయితే ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని విషపూరితమైన కణాలు తొలగిపోయి చర్మం కోల్పోయిన మెరుపును తిరిగి పొందుతుంది.

మరి, ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మీరు ఉపవాసం ఎందుకు ఉండకూడదు. త్వరలో నవరాత్రి 2022 (Navaratri 2022) ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ 26 నుండి 9 రోజుల పాటు 9 రూపాలలో అమ్మవారిని కొలుస్తారు, ఈ 9 రోజుల పాటు 9 రంగుల వస్త్రాలు ధరిస్తారు, భక్తులు నియమనిష్టలతో ఉపవాస దీక్షలో ఉంటారు. వీలైతే మీరూ ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. పుణ్యం, ఆరోగ్యం రెండూ లభించినట్లు అవుతుంది.

ఉపవాసం ఉండేటపుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి:

  • ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్య ఉంటే, ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం మానుకోండి.
  • మొదటి సారి ఉపవాసం ఉండే వ్యక్తులు తక్కువ వ్యవధి కలిగిన ఉపవాసంతో ప్రారంభించాలి.
  • ఉపవాసానికి ముందు సరైన పోషకమైన ఆహారాన్ని తినండి.
  • ఒకేసారి ఎక్కువగా తినడం మానుకోండి.
  • మీకు అనారోగ్య సమస్య ఉంటే లేదా ఔషధాలు తీసుకునే వారైతే ఉపవాసం చేయకండి.
  • ఉపవాస సమయంలో టీ, కాఫీలు ఎక్కువగా తాగితే ఎలాంటి ప్రయోజనాలు లేకపోగా, హాని కలుగుతుంది. కాబట్టి ఈ అలవాటు మానుకోండి.
  • ఉపవాసం విరమించిన వెంటనే మళ్లీ పుష్టిగా విందు భోజనం తినడం చేయకూడదు.

పైన పేర్కొన్న అంశాల ఆధారంగా ఉపవాసం చేయాలో, చేయకూడదో నిర్ణయం మీదే.

WhatsApp channel

సంబంధిత కథనం