తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation : మెుదట మిమ్మల్ని మీరు గెలవండి..

Sunday Motivation : మెుదట మిమ్మల్ని మీరు గెలవండి..

HT Telugu Desk HT Telugu

19 March 2023, 4:30 IST

    • Sunday Motivation : జీవితంలో చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి. అలాంటి సందర్భంలో సానుకూలంగా ఉండాలి. అప్పుడే విజయం సాధిస్తారు. మీ లైఫ్ మీద మీకు కంట్రోల్ ఉంటాలి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జీవితంలో మనం ఎక్కువసార్లు పోరాడేది ఎవరితో తెలుసా? శత్రువులతో కాదు.. మనం ఎక్కువసార్లు పోరాడేది మనతోనే. మన మనసును, మన అవసరాన్ని అధిగమించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఎదుటివారినైనా సులభంగా జయిస్తామేమో కానీ.. మనల్ని మనం జయించడం చాలా కష్టం.

ఎవరి జీవితం సజావుగా సాగదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్లకేంటి బాగుంటారు అనుకోవడం చాలా సులభం. కానీ వాళ్ల జీవితంలోకి వెళ్లి చూస్తేనే తప్పా తెలియదు.. వాళ్లకి ఏమి సమస్యలున్నాయో. మనకి మాత్రమే కష్టాలు ఉన్నాయనుకుని కుంగిపోకండి. మనం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మనం ఎంత ధైర్యంగా, సానుకూలంగా ఉంటున్నామన్నదే అసలు విషయం.

ఒక్కోసారి మన పరిస్థితి ఘోరంగా తయారవ్వచ్చు. కాస్త ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటే జీవితంలో వెలుగు కచ్చితంగా వస్తుంది. చీకటి తర్వాత వెలుగు వస్తేనే రోజు అనేది కంప్లీట్ అవుతుంది. అలాంటి మన కష్టం తర్వాత మనకి మంచి జరుగుతుందనుకోవాలి. దానిని నమ్మాలి. ఈ చెడు ఎక్కువసేపు మనతో ఉండదు అనుకోవావి. ఇలా మీరు సానుకూలంగా ఉంటే.. కష్టం మీ దరిదాపుల్లో కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా.. దానికి ఎక్కువసేపు మీతో ఉండాలని అనిపించదు. మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్​గా ఉంటే.. మనం, మన పరిస్థితులు అంత త్వరగా చక్కబడతాయి. శారీరక బలం కన్నా.. మానసికంగా బలంగా ఉండడమే చాలా ముఖ్యం.

కష్టం వచ్చినప్పుడు మీరు ఏడుస్తూ.. మిమ్మల్ని లేదా ఎదుటివారిని తిట్టుకుంటూ.. తిండి తిప్పలు మానేసి బాధపడుతూ ఉంటే.. మీ కష్టానికి బలం ఎక్కువవుతుంది. మీరు చేసే ఈ పనులు మీ కష్టానికి బూస్టప్ ఇస్తాయి. అయితే మీరు పీకల్లోతూ కష్టాల్లో ఉన్నా.. సానుకూలంగా ఉంటూ.. జరిగేదానిని ఎవరూ ఆపలేము అనుకుంటూ.. మీ పని మీరు మంచిగా చేసుకుంటూ పోతే.. ఆ కష్టానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.

టాపిక్