తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Vibes : స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు చెప్పకపోవచ్చు.. మీరే తెలుసుకోవాలి

Sunday Vibes : స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు చెప్పకపోవచ్చు.. మీరే తెలుసుకోవాలి

HT Telugu Desk HT Telugu

12 March 2023, 4:30 IST

    • Sunday Motivation : కష్టకాలంలో స్నేహితుడిని రక్షించడం స్నేహం ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. స్నేహం అవకాశవాదం కాదు, బాధ్యత. మన స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు దాని గురించి చెప్పకపోవచ్చు. మనం నిజమైన స్నేహితులమైతే, ఎప్పుడు కష్టాల్లో ఉన్నాడో వెంటనే తెలుసుకోవాలి.
స్నేహం
స్నేహం

స్నేహం

కుటుంబంతో పంచుకోలేని విషయాలను కూడా ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో పంచుకుంటాడు. స్నేహానికి ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. కాబట్టి మన మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించడం స్నేహ కర్తవ్యం. బాధలో ఉన్న స్నేహితుడి పక్కన ఉండాలి. అప్పుడు మనం చేయగలిగిన సహాయం అతనికి అందించాలి.

ట్రెండింగ్ వార్తలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

అమ్మ, నాన్న, తమ్ముడు, అత్త, మామ, ఇలా మన జీవితంలోని ఎన్నో అనుబంధాలను ఉంటాయి. కానీ స్నేహితులను మాత్రం ఎంచుకునే హక్కు మనకే ఉంది. మీ బాగోగులు చూసి మిమ్మల్ని ఎల్లప్పుడు వెన్నుతట్టి నడిపే స్నేహితుడిని నువ్వే వెతికి పట్టుకోవాలి. చాలా వరకు బంధాలు, బంధుత్వాలు ఏదో ఒక కారణం, ప్రతిఫలం లేకుండా కొనసాగదు. ఆ బంధం ఎల్లకాలం కొనసాగుతుంది అని చెప్పలేం. కానీ ఇద్దరు స్నేహితులు మధ్య ఎలాంటి ప్రతిఫలం లేకుండా బంధం ఉంటుంది.

జీవితంలోకి చాలామంది వస్తారు.. వెళ్తారు.. కానీ అందరినీ నా స్నేహితుడు అని చెప్పలేం. దగ్గరి వ్యక్తిని మాత్రమే.. నా స్నేహితుడు అంటాం. నిజమైన స్నేహితులు అంటే మనలోని బాధను మనం చెప్పకుండానే గుర్తుపడతారు. దాని నుంచి బయటపడేందుకు సాయం చేస్తారు. మన స్నేహితుడు మనకు తెలియకుండా.. మనలోని ప్రతిభను గుర్తిస్తారు. కొంతమంది అవసరానికి స్నేహిం చేసి.. తర్వాత అవలీలగా దాన్ని తుంచేస్తారు. అలా చేస్తే.. స్నేహం బంధం అవ్వదు. అవసరానికి వాడుకునేది వ్యాపారం లాంటిది.. దానిని స్నేహం అనలేం.

జీవిత ప్రయాణంలో లక్షలు, కోట్ల కన్నా ఆత్మీయతానురాగాలతో కూడిన స్నేహాన్ని పొందడం ముఖ్యం. దాన్ని పదిలంగా భద్రపరుచుకోవడం తెలివైనపని. స్నేహం అనేది తెలీని వ్యక్తుల మధ్యే కాదు.. కుటుంబ సభ్యులు కూడా స్నేహితుల్లాగే ఉండాలి. స్నేహం ఒక బంధం. ఒక నమ్మకం. దానికి వయసు తేడా గానీ, ఆడామగా తేడాగానీ లేదు. నిజమైనా స్నేహితులు ఉండడం మన అదృష్టం.

తదుపరి వ్యాసం