తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ssc Recruitment 2022: Apply For Jht, Jt, And Sht Posts

SSC Recruitment 2022: SSCలో ట్రాన్స్‌లేటర్ పోస్టులు.. పూర్తి వివరాలివే!

HT Telugu Desk HT Telugu

21 July 2022, 15:00 IST

    • SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ జూలై 20 నుంచి ప్రారంభమైంది. 
SSC Recruitment 2022
SSC Recruitment 2022

SSC Recruitment 2022

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ రిక్రూట్ చేస్తుంది. దరఖాస్తు ప్రక్రియ జూలై 20 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 4. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ssc.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ దిద్దుబాటు విండో జూలై 6న యాక్టీవ్ అవుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అక్టోబర్ 2022లో జరుగనుంది.

SSC Recruitment 2022 దరఖాస్తు రుసుము: ఆప్లీకేషన్ ఫీజు రూ.100 ఉంటుంది. మహిళా అభ్యర్థులు, రిజర్వేషన్‌కు అర్హత ఉన్న /SC/ST/ESM/PwDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.

వయోపరిమితి: అభ్యర్థులు జనవరి 1, 2022 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

SSC Recruitment 2022: ఎలా దరఖాస్తు చేయాలి

అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

టాపిక్