తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Care Tips : దిండుతోనూ మీ అందంపై ఎఫెక్ట్.. తప్పదు మార్చాల్సిందే

Skin Care Tips : దిండుతోనూ మీ అందంపై ఎఫెక్ట్.. తప్పదు మార్చాల్సిందే

Anand Sai HT Telugu

06 February 2023, 13:53 IST

    • Pillowcase Effect On Skin : వారానికోసారి మీ దిండు కవర్‌ని మార్చుకోవడం వల్ల చర్మానికి మంచిదని స్కిన్‌కేర్ నిపుణులు అంటున్నారు. చర్మం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మనం ఏం కాదులే అనుకునే విషయాలే చర్మానికి ఇబ్బంది కలిగిస్తాయి. చర్మ వ్యాధుల నుంచి రక్షించుకునేందుకు డైలీ లైఫ్ లో కొన్ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. చర్మం అందంగా ఉండాలని చాలా మంది రకరకాల ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. పేస్ట్‌లు, ఫేస్ మాస్క్‌లు వాడుతారు. అయినా చర్మ సమస్యలు కొంతమందికి తగ్గవు. చర్మ సమస్యలకు(Skin Problems) కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. కాస్మోటాలజిస్ట్, చర్మ సంరక్షణ నిపుణులు డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.

చర్మ సంరక్షణ దిండు మీద కూడా ఆధారపడి ఉంటోందని.. ఆమె చెబుతోంది. చర్మ సంబంధిత సమస్యలకు దిండ్లు కూడా ఒక కారణమని అంటున్నారు. తలకింద పెట్టుకునే.. దిండ్లతో చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.

ప్రతి వారం దిండు కవర్లను మార్చుకోవాలని గీతికా మిట్టల్ చెబుతోంది. అలా దిండు కవర్‌(Pillow Cover)ను మార్చడం ప్రారంభిస్తే.. మీ చర్మంలో మార్పు కనిపిస్తుందని అంటున్నారు. ఈ విషయం తెలియకపోతే.. దిండు మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్, బ్యాక్టీరియాతోనే మీరు అలా నిద్రపోయే అవకాశం ఉంది. వారానికోసారి మీ దిండు కవర్‌ని మార్చుకోవడం వల్ల చర్మానికి మంచిదని స్కిన్‌కేర్ నిపుణులు అంటున్నారు.

గీతిక పోస్ట్‌లో ఒక రేఖాచిత్రాన్ని కూడా చూపించారు. ఈ రేఖాచిత్రంలో దిండు కవర్‌లో దుమ్ము కణాలు, ధూళి, నూనె, పెంపుడు జంతువుల జుట్టు, డెడ్ స్కిన్(Dead Skin), బ్యాక్టీరియా వంటి అనేకమైనవి చూపించారు. వీటి ద్వారా చర్మం దెబ్బతింటుందని గీతిక చెబుతున్నారు.

కాటన్ బెడ్‌షీట్‌లను ఉపయోగించే వారితో పోలిస్తే సిల్క్ బెడ్‌షీట్‌లను ఉపయోగించేవారిలో మొటిమల సమస్య తక్కువగా ఉందని యుఎస్‌లో నిర్వహించిన ఒక క్లినికల్ అధ్యయనం పేర్కొంది. ఇతర బట్టలతో పోలిస్తే మృదువుగా ఉండటమే దీనికి కారణమని కూడా అధ్యయనంలో తెలిపారు.