తెలుగు న్యూస్  /  Lifestyle  /  Rheumatoid Arthritis Can Occur In Middle Age People; Early Signs To Watch Out For

రుమటాయిడ్ ఆర్థరైటిస్ బాధపడుతున్నారా?.. పరిష్కార మార్గాలివిగో

HT Telugu Desk HT Telugu

01 August 2022, 23:09 IST

    • రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) అనేది ఆటో ఇమ్యూన్ డిసీస్, ఇది ఒకరి స్వంత రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన కణజాలాలపై దాడి చేసి, కీళ్లను, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది.
Rheumatoid arthritis
Rheumatoid arthritis

Rheumatoid arthritis

ఆర్థరైటిస్, ఇది కేవలం వృద్ధాప్యంలో వచ్చే సమస్య కాదు. యువకుల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. 18 - 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 100,000 మంది యువకులలో 8 మంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) తో బాధపడుతున్నారని ఒక అధ్యయనంలో తెలింది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) అంటే ఏమిటి?

రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) అనేది ఆటో ఇమ్యూన్ డిసీస్, ఇది ఒకరి స్వంత రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన కణజాలాలపై దాడి చేసి, కీళ్లను, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. అందుకే ఇది దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ డిజార్డర్‌గా కూడా గుర్తించబడింది, ఇది చర్మం, కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె మరియు రక్తనాళాలతో సహా వివిధ అవయవాలను దెబ్బతీస్తుంది.

కీళ్ల వాపు, నొప్పి

రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ల లైనింగ్‌పై దాడి చేస్తుంది. ఇది నొప్పి, వాపును కలిగిస్తుంది, ఇది క్రమంగా ఎముక కోతకు, కీళ్ల వైకల్యానికి దారితీస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) ప్రారంభ దశలలో, ఎరుపు లేదా వాపును సమస్యను అనుభవించకపోవచ్చు, అలాగే నొప్పి. సున్నితత్వంతో బాధపడవచ్చు.

ఆర్థరైటిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:

- కీళ్ల నొప్పి, సున్నితత్వం, వాపు లేదా దృఢత్వం ఆరు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటుంది.

ఉదయం గట్టిదనం 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటుంది.

- ఒకటి కంటే ఎక్కువ కీళ్ళు ప్రభావితమవుతాయి.

- చిన్న కీళ్ళు (మణికట్టు, చేతులు, కాళ్ళలోని కొన్ని కీళ్ళు)లో మొదట ఈ సమస్య ప్రభావితమవుతుంది.

- ఒకే కీళ్ళుల్లో రెండు వైపులా ప్రభావితమవుతాయి.

నివారణ మార్గాలు

కీళ్ల వాపు ఉన్న వాళ్ళు ప్రతి రోజు నడక చాలా ముఖ్యం.

చుట్టూ నడవడం, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం, సున్నితంగా మసాజ్ చేయడం వంటివి నొప్పిని నివారించంలో సహాయపడతాయి.

ఇంకా, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తినడం, జిడ్డుగల, ప్రాసెస్ చేయబడిన, అనారోగ్యకరమైన ఆహారాన్ని పరిమితం చేయడం వల్ల లక్షణాలతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడే వారిలో మానసిక సమస్యలు ఉంటాయి. అందుకు యోగ, ద్యానం చేయడం ముఖ్యం

నొప్పి తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించండి.

కొన్ని ఆదునిక చికిత్సలు శారీరకంగానే కాకుండా మానసిక నొప్పిని కూడా నిర్వహించడంలో సహాయపడతాయి.