తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ravva Uthappam Recipe For Breakfast Here's Making Process

Ravva Uthappam : రవ్వ ఊతప్పం.. తింటే సూపర్ అంటారు

HT Telugu Desk HT Telugu

06 March 2023, 6:30 IST

    • Ravva Uthappam Recipe : రోజూ ఒకేలా తింటూ.. ఉండటం కొంతమందికి బోర్ కొడుతుంది. మరికొంతమందికి ఇడ్లీ, దోశ పిండి తయారుచేసేంత టైమ్ ఉండదు. అలాంటి వారు రవ్వ ఊతప్పం తయారు చేసుకోవచ్చు.
రవ్వ ఊతప్పం
రవ్వ ఊతప్పం

రవ్వ ఊతప్పం

రోజు ఉదయం అల్పాహారం తినాలి. ఏదో ఒక కారణంతో అల్పాహారం స్కిప్ చేస్తే.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈజీగా తయారు చేసుకునే రెసిపీలతో బ్రేక్ ఫాస్ట్ చేసేయాలి. హెల్తీగా కూడా ఉండాలి. ఇడ్లీ, దోశ ప్రతిరోజూ తింటే.. కొంతమందికి నచ్చకపోవచ్చు. అందుకే.. కొత్తగా ట్రై చేయాలి. అందులో భాగంగా రవ్వ ఊతప్పం చేసుకోండి. టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా సులభం.

ట్రెండింగ్ వార్తలు

Covishield vaccine: కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల వస్తున్న అరుదైన ప్రాణాంతక సమస్య టిటిఎస్, ఇది రాకుండా ఎలా జాగ్రత్త పడాలి?

World Tuna Day 2024: టూనా చేప రోజూ తింటే బరువు తగ్గడంతో పాటూ గుండెపోటునూ అడ్డుకోవచ్చు

Korrala laddu: కొర్రల లడ్డు ఇలా చేసి దాచుకోండి, రోజుకి ఒక్కటి తిన్నా చాలు ఎంతో ఆరోగ్యం

Vampire Facial: వాంపైర్ ఫేషియల్ చేయించుకుంటే HIV సోకింది జాగ్రత్త, అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం

కావాల్సినవి..

బొంబాయి ర‌వ్వ-ఒక క‌ప్పు, ఉప్పు త‌గినంత‌, జీల‌క‌ర్ర-ఒక టీ స్పూన్, వంట‌సోడా-పావు టీ స్పూన్, క‌రివేపాకు, పెరుగు-అర క‌ప్పు, నీళ్లు-త‌గిన‌న్ని, త‌రిగిన ఉల్లిపాయ‌లు-త‌గిన‌న్ని, త‌రిగిన ట‌మాట ముక్కలు-త‌గిన‌న్ని, క్యారెట్ తురుము, త‌రిగిన క్యాప్సికం ముక్కలు, త‌రిగిన కొత్తిమీర, అల్లం ముక్కలు, చిన్నగా త‌రిగిన ప‌చ్చిమిర్చి.

తయారీ విధానం..

మెుదలు ఒక గిన్నెలో బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఆ తర్వాత దానిలో ఉప్పు, జీలకర్ర, వంట సోడా, కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత పెరుగు కలపాలి. దానిపై మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత.. ఊతప్పం చేసేందుకు వీలుగా ఉండే విధంగా సరిపోయేంత నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. తర్వాత స్టౌవ్ మీద పెనం పెట్టి వేడి చేయాలి.

పెనం వేడి అయ్యాక.. కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇక పిండిని తీసుకుని.. ఊతప్పంలాగా వేసుకోవాల్సి ఉంటుంది. దీనిమీద ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చల్లుకోవాలి.

ఇప్పుడు దీని మీద కొంచెం నూనె పోయాల్సి ఉంటుంది. మూత పెట్టి ఊతప్పాన్ని కాల్చుకోవాలి. ఒకవైపు ఊతప్పం కాలుతుంది. తర్వాత మరోవైపు తిప్పాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని తర్వాత తిసేయాలి. ఇలా చేస్తే.. టేస్టీ రవ్వ ఊతప్పం తయారవుతుంది. ఇందులోకి పల్చి చట్నీ, టమాట చట్నీ కలిపి తింటే సూపర్ గా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి తింటే బాగుంటుంది.

టాపిక్