తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Value Of Money: పిల్లలకు డబ్బు విలువ తెలియాలంటే ఇలా చేయండి

Value of money: పిల్లలకు డబ్బు విలువ తెలియాలంటే ఇలా చేయండి

HT Telugu Desk HT Telugu

21 February 2023, 12:39 IST

    • Value of money: పిల్లలకు డబ్బు విలువ తెలిసేందుకు పాటించాల్సిన జాగ్రత్తలను నిపుణులు చేసిన సూచనలు ఇక్కడ చూడండి.
పిల్లలకు డబ్బు విలువను బోధించడంలో చిట్కాలు
పిల్లలకు డబ్బు విలువను బోధించడంలో చిట్కాలు (Photo by Sasun Bughdaryan on Unsplash)

పిల్లలకు డబ్బు విలువను బోధించడంలో చిట్కాలు

పిల్లలు డబ్బు విలువను గుర్తించడంలో తల్లిదండ్రులది కీలకపాత్ర. పిల్లలు డబ్బు విలువను గుర్తించి సరైన నిర్ణయం తీసుకునేలా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. నేటి నిర్ణయాలు వారిని సరైన తోవలో పెట్టేలా చేస్తాయి. వారు సమాధానాలు వెతికేలా, తర్కించే సామర్థ్యం కలిగి ఉండడం వల్ల వారికి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఐఎంఎస్ నోయిడా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ కులనీత్ సూరి హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలను వివరించారు.

‘పిల్లల్లో ఆసక్తి పెరిగేలా వారి గ్రహణ శక్తి మెరుగుపడాలి. ఈ దిశగా పెద్దల సంభాషణలు ఉండాలి. పిల్లలు వారు చేసే ఖర్చుపై సత్ఫలితాలు ఉండేలా వ్యూహాలను వారికి నేర్పాలి. లేనిపక్షంలో డబ్బు విలువ వారికి తెలియకుండా పోతుంది. అంతేకాకుండా వారు ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది..’ అని వివరించారు.

‘తమ చర్యలను నియంత్రించుకునేలా వారు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. అలాగే వారి ప్రవర్తన, ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండాలి. కంప్యూటర్ గేమ్స్, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఖరీదైన బొమ్మల వంటి వాటి పట్ల ఆకర్షితులు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలి. విలువలను పెంచే సాధనాలకు వారిని ఆకర్షితులను చేయాలి. క్రియేటివిటీకి ఉన్న విలువను చెప్పాలి. కుటుంబం, స్నేహితులతో ఉండే బంధాలకు గల విలువను చెప్పాలి. అలాగే స్వతంత్రంగా జీవించడం, దయ కలిగి ఉండడం, కృతజ్ఞత కలిగి ఉండడం, వైవిధ్యతను గౌరవించడం నేర్పాలి. ఇవన్నీ వారికి జీవితంలో ముఖ్యమైన విషయాలను నేర్పిస్తాయి..’ అని ఆమె వివరించారు.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ అకడమిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉషా పటేల్ ఈ అంశాలను చర్చించారు. ‘డబ్బు విలువను బోధించడం అత్యంత ముఖ్యమైన పాఠం. జీవితంలో మనీ మేనేజ్‌మెంట్ స్కిల్స్ చాలా అవసరం. ఆర్థిక అంశాలను అర్థం చేయించడం వల్ల వారు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వారు చేసే ఖర్చు, పొదుపుపై బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు..’ అని వివరించారు.

పిల్లలు డబ్బు విలువను గుర్తించేందుకు చిట్కాలు

  1. ప్రతి వారం ఒక బడ్జెట్ రూపొందించండి. అందులో ఖర్చులను, పొదుపు లక్ష్యాలను రాయండి. దానిని కచ్చితంగా పాటించేలా చూడండి. ఇది మన ఖర్చులను ట్రాక్ చేసేందుకు పనికొస్తుంది. అలాగే అనవసరపు కొనుగోళ్లను తగ్గించేలా ప్రేరణ కల్పిస్తుంది. వారం వారం బడ్జెట్ మన దీర్గకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకునేలా కాపాడుతుంది. ఇలా బడ్జెట్ రూపొందించడం, మనీ మేనేజ్‌మెంట్ సంభాషనలు వారికి అవసరాలు, కోరికల మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది.
  2. డబ్బు దేనికి ఖర్చు చేస్తున్నాం, భవిష్యత్తు అవసరాలు ఏం ఉండబోతున్నాయి? ఎంత పొదుపు చేయగలమో ఈ బడ్జెటింగ్ మనకు తెలియపరుస్తుంది. తద్వారా కొత్త వ్యాపార ఆలోచనలు, మార్కెటింగ్ కోసం సృజనాత్మక ఆలోచనలు మదిలోకి వస్తాయి. డిజిటల్ ప్లాట్‌ఫారాలపై ప్రొఫైల్ క్రియేట్ చేసి మన నైపుణ్యాలను ప్రదర్శించడం వల్ల కొత్త క్లైంట్స్‌ను చేరుకోవచ్చు. తద్వారా బలమైన నెట్ వర్క్ ఏర్పరచుకోవచ్చు.

భాయ్ పరమనాంద విద్యా మందిర్ డైరెక్టర్ ఏకే శర్మ ఈ అంశాలను వివరిస్తూ ‘ప్రతి పిల్లవాడు డబ్బుకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు తెలుసుకోవాలి. చిన్న వయస్సులోనే పర్సనల్ ఎకనామిక్స్ ఒంటబట్టించుకునేలా చూడాలి. డబ్బు విషయంలో జవాబుదారీతనం అలవరుచుకునేలా చూడాలి. ఖర్చులను ట్రాక్ చేయడం వల్ల వాటిని తగ్గించుకోవచ్చన్న సంగతి వారు గుర్తెరగాలి. పిల్లలు తమ వద్ద ఉన్న డబ్బును ఒక ప్రణాళికబద్ధంగా ఖర్చు చేయగలగాలి. భవిష్యత్తు కొనుగోళ్ల కోసం బడ్జెట్ రూపొందించుకోవడం వల్ల పిల్లలు డబ్బు పొదుపు చేయడం నేర్చుకుంటారు..’ అని వివరించారు.

‘పొదుపు అనే అంశం పిల్లల మైండ్‌సెట్‌లోకి రావాలి. దీర్ఘకాలంలో ఇది చేసే ఖర్చుకు గానీ, పెట్టుబడికి గానీ విలువ ఇవ్వడం నేర్పుతుంది. అలాగే పొదుపు చేసిన డబ్బు దీర్ఘకాలంలో ఎలాంటి విలువ గలదో వారికి నేర్పుతుంది. ప్రస్తుత ఆర్థిక నిర్ణయాలు వారి భవిష్యత్తు సంపదకు దోహదపడుతుందని చెప్పాలి..’ అని వివరించారు.