తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Cucumber Salad : బరువు తగ్గాలనుకునేవారు.. పనీర్ కీరా సలాడ్ రెసిపీ ట్రై చేయాల్సిందే

Paneer Cucumber Salad : బరువు తగ్గాలనుకునేవారు.. పనీర్ కీరా సలాడ్ రెసిపీ ట్రై చేయాల్సిందే

01 November 2022, 6:40 IST

    • Paneer Cucumber Salad Recipe : బరువు తగ్గాలి అనుకునే వారు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువగా తినకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది కాబట్టి. మీరు కూడా బరువు తగ్గాలి అనుకుంటే.. మీకోసం సింపుల్, హెల్తీ, ప్రోటీన్ రిచ్ సలాడ్ రెసిపీ ఇక్కడ ఉంది. 
పనీర్ కీరా సలాడ్
పనీర్ కీరా సలాడ్

పనీర్ కీరా సలాడ్

Paneer Cucumber Salad Recipe : జిమ్, వ్యాయామాలు చేసే వారు.. ఫిట్​గా ఉండాలి అనుకునేవాళ్లు తమ డైట్​లో ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకుంటారు. ప్రోటీన్ కలిగిన ఆహారం మీరు బరువు తగ్గడంలో కచ్చితంగా సహాయం చేస్తుంది. అయితే మీ ఉదయాన్ని మంచి ప్రోటీన్ ఫుల్​గా మార్చేయాలనుకుంటే.. మీరు పనీర్ కీరా సలాడ్​ ట్రై చేయవచ్చు. దీనిని బ్రేక్​ఫాస్ట్​లానే కాదండోయ్.. మీల్​కి మీల్​కి మధ్యలో స్నాక్​లాగా.. లేదంటే మీల్​గానే కూడా తీసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : పెళ్లయ్యాక మీ భార్యలో ఈ మార్పులు కనిపిస్తే మీ వైవాహిక జీవితం నరకమే

World Thalassemia day 2024: తలసేమియా వ్యాధి ప్రాణాలు తీస్తుందా? ఇది ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది?

Carrot Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ కోసం క్యారెట్ పరాటా రెసిపీ, అరగంటలో దీన్ని వండేయచ్చు

Wednesday Motivation: ఈ జపాన్ పద్ధతులను పాటిస్తే ప్రతి వ్యక్తి శాంతిగా, సహనంగా, ఆనందంగా జీవిస్తాడు

కావాల్సిన పదార్థాలు

* దోసకాయ - 1

* ఉల్లిపాయ -1

* టమోటా - 1

* పనీర్ - అర కప్పు (తురిమినది)

* నిమ్మకాయ రసం - సగభాగం

* వెనిగర్ - 1 స్పూన్

* తేనె - 1 టేబుల్ స్పూన్

* ఉప్పు - తగినంత

* మిరియాలు పొడి - తగినంత

తయారీ విధానం

ముందుగా దోసకాయ, ఉల్లిపాయలు, టొమాటోలను చిన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. దానిలో తురిమిన పనీర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఓ చిన్న గిన్నె తీసుకుని దానిలో నిమ్మరసం, వెనిగర్, తేనె వేసి బాగా కలపాలి. అది సిరప్​ వంటి స్థితికి వస్తుంది. దానితో సలాడ్​కి డ్రెస్సింగ్​ చేయవచ్చు. అంతే హెల్తీ, టేస్టీ, ప్రోటీన్ రిచ్, సింపుల్ సలాడ్ రెడీ అయిపోయినట్లే. ఇది మీ అదనపు కిలోల బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

టాపిక్