తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mushroom Pepper Fry । మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెసిపీని.. కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి!

Mushroom Pepper Fry । మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెసిపీని.. కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి!

HT Telugu Desk HT Telugu

10 June 2023, 12:48 IST

google News
    • Mushroom Pepper Fry Recipe: మష్రూమ్ పెప్పర్ ఫ్రైని అన్నం, చపాతీలతో సర్వ్ చేయవచ్చు లేదా శాండ్‌విచ్‌లలో స్టఫ్ చేయడానికి, రోల్స్‌ను తయారు చేయవచ్చు. రెసిపీని ఈ కింద చూడండి.
Mushroom Pepper Fry Recipe
Mushroom Pepper Fry Recipe (istock)

Mushroom Pepper Fry Recipe

Healthy Lunch Recipes: మష్రూమ్ పెప్పర్ ఫ్రై అనేది ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన సైడ్ డిష్ లేదా స్టార్టర్. పుట్టగొడుగులు, క్యాప్సికమ్ కలిపి వివిధ రకాలుగా వండటానికి మంచి కాంబినేషన్ అవుతుంది. మృదువుగా, మెత్తగా ఉండే పుట్టగొడుగులకు క్యాప్సికమ్ మంచి క్రంచ్ ఇస్తుంది. ఇందులో వాడే మిరియాల పొడి, ఇతర పదార్థాలు ఈ వంటకానికి ప్రత్యేక రుచిని అందిస్తాయి. మష్రూమ్ పెప్పర్ ఫ్రై తయారు చేయడం కూడా చాలా సులభం, త్వరగా కేవలం 15- 20 నిమిషాల్లోనే వండేయవచ్చు.

మష్రూమ్ పెప్పర్ ఫ్రైని మీరు వివిధ రకాలుగా ఆస్వాదించవచ్చు. దీనిని అన్నం, చపాతీ, పరాటాలతో సైడ్ డిష్‌గా సర్వ్ చేయవచ్చు లేదా మీరు ఇదే మష్రూమ్ పెప్పర్ ఫ్రైని శాండ్‌విచ్‌లలో స్టఫ్ చేయడానికి, రోల్స్‌ను తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెసిపీని ఈ కింద చూడండి.

Mushroom Pepper Fry Recipe కోసం కావలసినవి

  • 2 కప్పుల బటన్ మష్రూమ్‌లు
  • 1 ఉల్లిపాయ
  • 1/2 కప్పు క్యాప్సికం ముక్కలు
  • 1 టమోటా (ఐచ్ఛికం)
  • 1 పచ్చిమిర్చి
  • 1 టీస్పూన్ నల్ల మిరియాల పొడి
  • 1/4 టీస్పూన్ సోంపు
  • 1/2 టీస్పూన్ జీలకర్ర
  • 1/4 టీస్పూన్ పసుపు
  • 2 వెల్లుల్లి రెబ్బలు
  • 1 రెమ్మ కరివేపాకు
  • 1 టేబుల్ స్పూన్ నూనె
  • ఉప్పు - రుచికి సర్దుబాటు చేయండి

మష్రూమ్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం

  1. ముందుగా గ్రైండర్ జార్‌లో సోపు, మిరియాలు వేసి, వాటిని మసాలా పొడిగా పౌడర్ చేయండి.
  2. ఇప్పుడు స్కిల్లెట్లో నూనె వేసి, వేడయ్యాక జీలకర్ర, తరిగిన వెల్లుల్లి వేయండి. వెల్లుల్లి మంచి వాసన వచ్చే వరకు ఒక నిమిషం పాటు వేయించాలి.
  3. ఇప్పుడు టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. టొమాటోలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
  4. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, పచ్చి మిర్చి, ఉల్లిపాయల ముక్కలు వేసి, పచ్చి వాసన పోయే వరకు ఎక్కువ మంట మీద వేయించాలి.
  5. ఆపైన పుట్టగొడుగు ముక్కలను వేసి 2-3 నిమిషాలు ఎక్కువ వేడి మీద వేయించాలి, నీరు బయటకు వచ్చి మృదువుగా మారే వరకు వేయించాలి. అతిగా ఉడికించవద్దు.
  6. తర్వాత మిరియాలు- సోపు పొడి వేసి కలపాలి. కరివేపాకు కూడా వేసి మంచి వాసన వచ్చే వరకు 2 నుండి 3 నిమిషాలు వేయించాలి.
  7. అంతే మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ. దీనిని వెడల్పాటి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని, తేమ పెరగకుండా ఉండటానికి కాసేపు మూత పెట్టకుండా ఉంచండి.

లంచ్ లోకి అన్నం లేదా రోటీతో మష్రూమ్ పెప్పర్ ఫ్రైని సర్వ్ చేయండి, అలాగే సాయంత్రం స్నాక్స్ గా శాండ్‌విచ్‌లు చేసుకొని తినండి.

తదుపరి వ్యాసం