తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : ఓర్పు చేదుగానే ఉంటుంది.. కానీ దాని ఫలితం ఎంతో మధురం..

Monday Motivation : ఓర్పు చేదుగానే ఉంటుంది.. కానీ దాని ఫలితం ఎంతో మధురం..

HT Telugu Desk HT Telugu

06 March 2023, 4:30 IST

    • Monday Vibes : ఏం చేసినా.. ఫలితం లేదు.. ఇదే కొంతమంది చెప్పేమాట. కానీ ఓపికతో ఉంటే.. కొన్ని రోజులకైనా అనుకున్నది వస్తుందని ఆలోచన చేయరు. దీనితోనే అసలు సమస్య. ఓర్పు చేదుగానే ఉంటుంది.. కానీ దాని ఫలితం మాత్రం ఎంతో తియ్యగా ఉంటుంది.
ఓర్పు ముఖ్యం
ఓర్పు ముఖ్యం

ఓర్పు ముఖ్యం

ఓర్పు అనేది మనిషికి చాలా ముఖ్యం. ఓర్పు లేనిది ఏది సాధించలేం. ఒక్కోసారి ఓపికతో లేకుంటేనే.. సమస్యలు వస్తాయి. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటాం. అవే మిమ్మల్ని ఓటమివైపు తీసుకెళ్తాయి. అందుకే.. ఓర్పు అనేది కచ్చితంగా ఉండాలి. సుఖంగా గమ్యానికి చేరుతున్నామంటే.. ఓర్పు, నేర్పు బండి చక్రాల్లాంటివే. అందుకే ఓర్పుతో నేర్పుగా ముందుకు సాగాలి. ఓపిక లేకుంటే.. కోపం కూడా పెరిగిపోతుంది. అందుకో ఓర్పునే నేర్చుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Tips Telugu : ఈ 8 లోపాలు మీలో ఉంటే జీవితంలో విజయం సాధించలేరు

West Nile Fever: వ్యాపిస్తున్న వెస్ట్ నైల్ ఫీవర్, ఈ జ్వరం లక్షణాలు ఇవే

Chettinad Idli Podi: ఇడ్లీ దోశెల్లోకి చెట్టినాడ్ ఇడ్లీ పొడి, ఒక్కసారి చేసుకుంటే నెలరోజులు నిల్వ ఉంటుంది

Friday Motivation: ఆనందంగా జీవించడానికి కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ, కరుణ, స్నేహాలు, అనుబంధాలు

ఒక పక్షి గూడు కట్టుకోడానికి.. ఒకేసారి పుల్లలు తీసుకురాదు. పక్షికి తెలుసు.. ఒక్కో పుల్లను నోటితో పట్టుకుని.. తీసుకుని వస్తేనే.. గూడు ఏర్పడుతుందని. అందుకోసం చాలా రోజులు కష్టపడుతుంది. అలా కష్టపడితేనే.. అందమైన పక్షి గూడు తయారవుతుంది. ఎండా, వాన నుంచి రక్షణగా ఉంటుంది. పక్షికి ఓర్పుతోనే అంత చక్కటి గూడు కట్టుకుంటుంది. అందులోనే గుడ్లు పెడుతుంది. పిల్లలను చూసుకుంటుంది. పక్షి ఓర్పు ఫలితమే ఓ అందమైన గూడు. అలా ఓపిక తెచ్చే ఫలితం తియ్యగా ఉంటుంది.

అందుకే ఏదైనా పని చేసినా.. లేదంటే.. ఏదైనా విషయం తెలిసినా.. ముందు ఓపికతో ఉండాలి. లేదంటే కోపం, చిరాకు పెరిగిపోతుంది. పరీక్ష రాసిన వెంటనే ఫలితాలు రావు కదా. మీరు ఏదైనా పని చేసిన వెంటనే.. ఫలితం రావాలని లేదు కదా. సమయం పడుతుంది. సమయం అన్నింటికి సమాధానం చెబుతుంది. మీ ఓర్పుకు కూడా అదే సమాధానం ఇస్తుంది. అందుకే ఓర్పుతో ఉండటం చాలా ముఖ్యం. ఓ విత్తనం మెులకెత్తాలంటే.. భూమిలో ఎంతో ఓర్పుతో ఉండాలి. ఓటమిని ఓడించేందుకు కావాల్సింది.. ధైర్యం కాదు.. ఓర్పు.

చీమను చూసి క్రమ శిక్షణ నేర్చుకో..

భూమిని చూసి ఓర్పు నేర్చుకో..

చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో..

నీ చుట్టూ ఉన్నవాళ్లను చూసి వారి సుగుణాలను నేర్చుకో..

టాపిక్