తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curd Upma | పెరుగు ఉప్మాతో బ్రేక్‌ఫాస్ట్.. ఉంచుతుంది మిమ్మల్ని సూపర్ ఫిట్!

Curd Upma | పెరుగు ఉప్మాతో బ్రేక్‌ఫాస్ట్.. ఉంచుతుంది మిమ్మల్ని సూపర్ ఫిట్!

HT Telugu Desk HT Telugu

05 July 2022, 8:51 IST

    • మన ఇళ్లల్లో తర వంచుగా వండుకునే ఒక అద్భుతమైన అల్పాహారం ఉప్మా. దీనిని ఎంతో సులభంగా చేసుకోవచ్చు. తేలికైన, ఆరోగ్యకరమైన ఆహారం కూడా. అయితే ఈ ఉప్మాకు పెరుగు ట్విస్ట్ ఇస్తే ఇంకా రుచికరంగా ఉంటుంది. ఆ రెసిపీ ఇక్కడ ఉంది చూడండి..
Curd Upma Recipe
Curd Upma Recipe (Pexels)

Curd Upma Recipe

మనం ఎప్పుడూ చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ గురించి ఆలోచిస్తుంటే సులభంగా చేసుకునే ఒక అల్పాహారం ఉప్మా. రవ్వలోని మెత్తదనం, అక్కడక్కడ మన పంటి కింద క్రంచీగా అనిపించే శనగపప్పు, కొన్ని వెజిటెబుల్స్ కలుపుకొని వేడివేడిగా తింటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఉదయం పూట ఒక కప్పు కాఫీ, ఒక గిన్నెడు ఉప్మా ప్రిపేర్ చేసుకుంటే మళ్లీ మధ్యాహ్నం వరకు మీ తిరుగే ఉండదు.

ట్రెండింగ్ వార్తలు

Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది

Banana Milk Shake: బనానా మిల్క్ షేక్ ఇలా తాగితే వేసవి తాపం నుంచి బయటపడవచ్చు

Coconut water: కొబ్బరి బోండా నుండి నేరుగా కొబ్బరినీళ్లు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

మీకు ఉదయం సమయం అంతగా లేనప్పుడు త్వరగా ఉప్మాను చేసేసుకోవచ్చు, జర్నీ చేస్తూ కూడా తినేయచ్చు, ఆఫీసులో డెస్క్ మీద పెట్టుకొని తినేయవచ్చు. అయితే ఎప్పుడూ తినే క్లాసిక్ రెగ్యులర్ ఉప్మా కాకుండా ఈ అల్పాహారాన్ని కూడా అనేక ఫ్లేవర్లలో, వైవిధ్యమైన వేరియేషన్స్‌లో చేసుకోవచ్చు. మీకోసమే ఇప్పుడు మరొక ఫ్లేవర్ అయిన పెరుగు ఉప్మా రెసిపీని పరిచయం చేస్తున్నాం. ఉప్మాకు పెరుగు జోడిస్తే దాని టెక్చర్, ఇంకా టేస్ట్ మారిపోతాయి. నోట్లో వేయగానే కరిగిపోతుంది. కడుపులో కూడా తేలికగా ఉంటుంది. ఆకలిని తీర్చుతుంది. మరి పెరుగు ఉప్మా కోసం ఏమేం కావాలి? ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు

  • 2 కప్పుల రవ్వ
  • 1 కప్పు పెరుగు
  • 1/2 కప్పు వెజిటెబుల్స్ (క్యారెట్, కాలీఫ్లవర్, ఆలూ)
  • 1 టీస్పూన్ ఆవాలు
  • 10-12 కరివేపాకు ఆకులు
  • 1 టీస్పూన్ మినప పప్పు
  • 1 టీస్పూన్ శనగ పప్పు
  • 1 ఉల్లిపాయ, తరిగిన
  • 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్
  • 2 పచ్చిమిర్చి
  • 1/2 కారం
  • రుచికి తగినంత ఉప్పు
  • తాజా కొత్తిమీర
  • 2-3 టీస్పూన్ల నెయ్యి

తయారీ విధానం

1. ముందుగా రవ్వను ఒక గిన్నెలో తీసుకొని సువాసన వచ్చే డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టండి

2. ఒక పాన్ లో నెయ్యి వేసి వేడి చేయండి. ఆ తర్వాత ఆవాలు, కరివేపాకు, మినప పప్పు , శెనగ పప్పు వేసి, అవి చిటపటలాడేలా దోరగా వేయించండి.

3. అనంతరం చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి.

4. ఉల్లిపాయ గోధుమ రంగులోకి మారాక, వెజిటెబుల్ ముక్కలు వేసి పాన్ మూతపెట్టి కూరగాయలను ఉడికించాలి.

5. వెజిటెబుల్స్ ఉడికిన తర్వాత పలుచని పెరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

6. చివరగా వేయించిన రవ్వ వేసి, 4 కప్పుల నీరు పోసి అన్నీ కలిపి ఉప్మాగా మారేంతవరకు ఉడికించాలి.

ఘుమఘుమలాడే పెరుగు ఉప్మా సిద్ధం అయినట్లే.. పై నుంచి తాజా కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి.

టాపిక్