తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sesame For Children । నువ్వులతో ఆరోగ్యానికి చాలా మేలు.. పిల్లలకు అలాంటి స్నాక్స్ తినిపించాలి!

Sesame for Children । నువ్వులతో ఆరోగ్యానికి చాలా మేలు.. పిల్లలకు అలాంటి స్నాక్స్ తినిపించాలి!

HT Telugu Desk HT Telugu

25 December 2022, 13:09 IST

    • Sesame Seeds Benefits for Children:  ఈ శీతాకాలంలో పిల్లల లంచ్ బాక్సులో నువ్వులతో చేసిన ఆహారాన్ని ఉంచండి. పిల్లలు నువ్వులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
Sesame Seeds Benefits for Children
Sesame Seeds Benefits for Children (Unsplash)

Sesame Seeds Benefits for Children

నువ్వులు మన భారతీయ వంటకాలలో ఎంతో కాలం నుంచే ఉపయోగిస్తున్నాం. సాంప్రదాయ వంటలైన ముర్కులు, చకినాలలో వీటిని కచ్చితంగా ఉపయోగిస్తారు. బేకరీ ఉత్పత్తులలోనూ నువ్వుల వినియోగం ఉంటుంది. పుష్కల పోషక విలువలు కలిగిన నువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. నువ్వులను కేవలం స్నాక్స్‌లో మాత్రమే కాకుండా కూరలు వండటానికి కూడా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెతో వంటలు చేస్తారు, నువ్వుల పొడిని వంటల్లో వేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Fatty liver in diabetics: ఫ్యాటీ లివర్.. డయాబెటిస్, ఊబకాయం ఉన్న వారిలో ఇది కామన్

Mutton Curry: పచ్చిమామిడి మటన్ కర్రీ స్పైసీగా వండుకుంటే అదిరిపోతుంది

Ayurvedam Tips: నానబెట్టిన కిస్‌మిస్‌లు, కుంకుమ పువ్వును కలిపి తినమని చెబుతున్న ఆయుర్వేదం, అలా తింటే ఏం జరుగుతుందంటే

Avoid Tea and Coffee: టీ కాఫీలు ఎప్పుడు తాగాలో, ఎంత తాగాలో చెబుతున్న ICMR వైద్యులు, వాటి వల్ల ప్రమాదాలు ఇవే

భారతదేశ పురాతనమైన వైద్య విధానమైన ఆయుర్వేదంలో నువ్వులతో చేసిన ఆహారానికి ప్రాధాన్యత ఉంటుంది. రుతువులను బట్టి ఆహారంలో మార్పులు చేసుకోవాలని ఆయుర్వేదం సిఫారసు చేస్తుంది. అలాగే ఈ చలికాలంలో నువ్వుల తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు వారి లంచ్ బాక్స్‌లో నువ్వుల ఉండలు, నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను అందివ్వాలని న్యూట్రిషనిస్టులు చెబుతారు. వీటిని తినడం ద్వారా పిల్లలకు మంచి శక్తి లభిస్తుంది. జీవక్రియ సమస్యలు, అంటు వ్యాధులను నివారించే ఇమ్యూనిటీ లభిస్తుంది.

Sesame Seeds Benefits for Children- పిల్లలు నువ్వులతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు

ఈ శీతాకాలంలో పిల్లల ఆహారంలో నువ్వులను చేర్చడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.

కాల్షియం సమృద్ధిగా ఉంటుంది

మిల్లింగ్ చేయని లేదా పొట్టు లేని నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ గింజల్లో 100 గ్రాములకు 60 మి.గ్రా కాల్షియం ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఎదగడంలో కాల్షియం కీలకం. కాబట్టి మీ పిల్లల రెగ్యులర్ డైట్‌లో నువ్వులను చేర్చడం వల్ల వారి ఎముకల ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది.

దంత సంరక్షణ

నువ్వులు దంత సంరక్షణ కోసం కూడా కీలకం. ఎందుకంటే ఇదివరకే చెప్పినట్లుగా నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దంత ఆరోగ్యానికి కాల్షియం మూలకం చాలా అవసరం. పిల్లలు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అంటూ రకరకాల అనారోగ్యకరమైన ఆహారాలు తింటారు. దీంతో వారి దంతాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దానిని నివారించడానికి వారికి నువ్వులు కలిగిన ఆహారం తినిపించడం వలన మేలు జరుగుతుంది.

గాయాలను నయం చేయడానికి

నువ్వులలో సెసామోల్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది గాయాలను నయం చేసే ఒక యాంటీఆక్సిడేటివ్ డ్రగ్ లాగా సహాయపడుతుంది. పిల్లలు ఆటలు ఆడేటపుడు తరచుగా గాయాలు చేసుకోవడం మామూలే. అలాంటపుడు వారి గాయం వేగంగా నయం కావాలంటే వారికి నువ్వులను తినిపించండి.

కావలసినత శక్తి కోసం

నువ్వులు పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ, వాటిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల నువ్వులలో సుమారు 573 కేలరీలు ఉంటాయి. మీరు మీ పిల్లల లంచ్ బాక్స్‌లో నువ్వుల విత్తనాలతో కూడిన చిన్న చిరుతిండిని కూడా చేర్చండి. అవి తినడం ద్వారా వారికి రోజులో కావలసిన శక్తి లభిస్తుంది.

అసంతృప్త కొవ్వులకు మూలం

నువ్వులలో నూనె అధికంగా ఉంటుంది, అయినప్పటికీ అది శరీరానికి మేలు చేసే కొవ్వు. నువ్వులు అసంతృప్త కొవ్వులకు మంచి మూలం. నువ్వులలో దాదాపు 61% కొవ్వులు ఉంటాయి. ఇది మీ పిల్లలకే కాదు, కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి, పిల్లలే కాదు ఎవరైనా సరే నువ్వులు తింటే ఆరోగ్యకరమే. ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు.

నువ్వులు తినడం మీ పిల్లల ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొందరికీ వేరుశనగ, బాదం, జీడిపప్పు వంటివి తింటే అలర్జీ కలుగుతుంది. నువ్వులతో కూడా ఇలాంటి అలర్జీ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లలకు నువ్వులు తినిపించేటపుడు వారికి గానీ, కుటుంబంలో మరెవరికైనా గానీ ఎలాంటి ఫుడ్ అలర్జీలు లేవని నిర్ధారించుకోండి. అలాగే సూపర్ మార్కెట్లలో లభించే బాగా శుద్ధి చేసిన నువ్వులకు బదులుగా, సేంద్రియ నువ్వులను ఎంచుకోవడం శ్రేయస్కరం.

తదుపరి వ్యాసం