Piercing | పోగులు కుట్టించుకోవడంతో అయిన తాజా గాయాలను ఇలా నయం చేసుకోవచ్చు-different ways to heal your fresh piercings quickly ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Piercing | పోగులు కుట్టించుకోవడంతో అయిన తాజా గాయాలను ఇలా నయం చేసుకోవచ్చు

Piercing | పోగులు కుట్టించుకోవడంతో అయిన తాజా గాయాలను ఇలా నయం చేసుకోవచ్చు

Feb 24, 2022, 04:28 PM IST HT Telugu Desk
Feb 24, 2022, 04:28 PM , IST

  • సాధారణంగా చెవికి, ముక్కుకు పోగులు కుట్టించుకోవడం మనకు తెలిసిందే. ఈ మధ్య స్టైల్ కోసం కూడా శరీర భాగాల్లో ఎక్కడపడితే అక్కడ పోగులు కుట్టించుకుంటున్నారు. అయితే ఆ గాయాలు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కు దారితీయవచ్చు. వేగంగా నయం చేసుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

పోగులు కుట్టించుకున్న చోట రంధ్రం చేసినపుడు ఆ ప్రాంతంలోని కణజాలం దెబ్బతింటుంది. కాబట్టి తాజా కుట్లపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. కుట్లతో కలిగిన గాయం త్వరగా మానడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

(1 / 8)

పోగులు కుట్టించుకున్న చోట రంధ్రం చేసినపుడు ఆ ప్రాంతంలోని కణజాలం దెబ్బతింటుంది. కాబట్టి తాజా కుట్లపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. కుట్లతో కలిగిన గాయం త్వరగా మానడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.(Unsplash)

హైడ్రేటెడ్‌గా ఉండండి: సమృద్ధిగా నీరు త్రాగడం వల్ల శరీరం- ఎప్పటికప్పుడు శుభ్రమవుతుంది, దీంతో ఏ గాయమైన త్వరగా నయమయ్యే అవకాశం ఉంటుంది.

(2 / 8)

హైడ్రేటెడ్‌గా ఉండండి: సమృద్ధిగా నీరు త్రాగడం వల్ల శరీరం- ఎప్పటికప్పుడు శుభ్రమవుతుంది, దీంతో ఏ గాయమైన త్వరగా నయమయ్యే అవకాశం ఉంటుంది.(Unsplash)

 గాయం నయం కావడానికి పోషకాహారం అవసరం. కాబట్టి ఐరన్, విటమిన్ బి, విటమిన్ సి, జింక్ సప్లిమెంట్లను తీసుకుంటే గాయం మానే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

(3 / 8)

 గాయం నయం కావడానికి పోషకాహారం అవసరం. కాబట్టి ఐరన్, విటమిన్ బి, విటమిన్ సి, జింక్ సప్లిమెంట్లను తీసుకుంటే గాయం మానే ప్రక్రియ వేగవంతం అవుతుంది.(Unsplash)

పోగులు కుట్టించుకున్న భాగంలో చీము రావడం, రంగుమారడం గమనిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. ఇన్ఫెక్షన్ పెరగకముందే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. 

(4 / 8)

పోగులు కుట్టించుకున్న భాగంలో చీము రావడం, రంగుమారడం గమనిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. ఇన్ఫెక్షన్ పెరగకముందే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. (Unsplash)

పోగులు కుట్టించిన చోట మొదట్లో కొద్దిపాటి దురద, చికాకు ఉండవచ్చు. అలాంటపుడు దానిని మాటిమాటికి చేతితో కదిలించడం చేయకూడదు. ఆ చోటును తాకేముందు మీ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. పోగు కుట్టిన చోటు పొడిగా మారితే కొద్దిగా మాయిశ్చరైజర్ లాంటిది పూసి నెమ్మదిగా కదిలించాలి.

(5 / 8)

పోగులు కుట్టించిన చోట మొదట్లో కొద్దిపాటి దురద, చికాకు ఉండవచ్చు. అలాంటపుడు దానిని మాటిమాటికి చేతితో కదిలించడం చేయకూడదు. ఆ చోటును తాకేముందు మీ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. పోగు కుట్టిన చోటు పొడిగా మారితే కొద్దిగా మాయిశ్చరైజర్ లాంటిది పూసి నెమ్మదిగా కదిలించాలి.(Unsplash)

స్నానం చేసేటపుడు జాగ్రత్త వహించండి. పోగులు కుట్టించిన చోట సువాసనలు వెదజల్లే సబ్బును ఉపయోగించరాదు. ఇది ఇన్ఫెక్షన్లను మరింత తీవ్రతరం చేస్తుంది. శుద్ధమైన నీరు, లేదా యాంటిసెప్టిక్ సబ్బును ఉపయోగించి మాత్రమే గాయం ఉన్నచోటును శుభ్రం చేయండి.

(6 / 8)

స్నానం చేసేటపుడు జాగ్రత్త వహించండి. పోగులు కుట్టించిన చోట సువాసనలు వెదజల్లే సబ్బును ఉపయోగించరాదు. ఇది ఇన్ఫెక్షన్లను మరింత తీవ్రతరం చేస్తుంది. శుద్ధమైన నీరు, లేదా యాంటిసెప్టిక్ సబ్బును ఉపయోగించి మాత్రమే గాయం ఉన్నచోటును శుభ్రం చేయండి.(Unsplash)

కుట్లు శుభ్రపరిచేందుకు ఉప్పునీటి ద్రావణాన్ని ఉపయోగించండి: ఒక గిన్నెలో ఒక కప్పు గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నాన్-అయోడైజ్డ్ సముద్రపు ఉప్పు కలపండి. ఈ ద్రావణంతో కుట్లు వేసిన చోటును శుభ్రం చేయండి. బ్యాక్టీరియా చేరినట్లు అనిపిస్తే రోజులో తరచుగా ఈ ఉప్పునీటి ద్రావణంతో శుభ్రం చేసుకోండి.

(7 / 8)

కుట్లు శుభ్రపరిచేందుకు ఉప్పునీటి ద్రావణాన్ని ఉపయోగించండి: ఒక గిన్నెలో ఒక కప్పు గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నాన్-అయోడైజ్డ్ సముద్రపు ఉప్పు కలపండి. ఈ ద్రావణంతో కుట్లు వేసిన చోటును శుభ్రం చేయండి. బ్యాక్టీరియా చేరినట్లు అనిపిస్తే రోజులో తరచుగా ఈ ఉప్పునీటి ద్రావణంతో శుభ్రం చేసుకోండి.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు