తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jio 5g Phone : అదిరిపోయే ఫీచర్స్‌తో Jio 5g ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే!

Jio 5G Phone : అదిరిపోయే ఫీచర్స్‌తో Jio 5G ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే!

HT Telugu Desk HT Telugu

13 August 2022, 20:27 IST

    • టెలికాం దిగ్గజం జియో 5G ఫీచర్ ఫోన్‌ లాంచ్ చేయడానికి సిద్దమవుతుంది. ఈ ఫోన్ ఈ ఏడాది చివరి నాటికి లాంచ్ అవుతుందని  చెబుతున్నారు. Jio 5Gఫోన్  ధర రూ. 12,000కి దగ్గరగా ఉండవచ్చు
Jio 5G Phone
Jio 5G Phone

Jio 5G Phone

దేశంలోని అన్ని టెలికాం కంపెనీలు 5G ఫోన్స్‌కు లాంచ్‌కు సిద్ధమవుతున్నాయి. Jio, Airtel, Vodafone Idea మూడు కంపెనీలు ఇప్పటికే 5G ట్రయల్‌ను పూర్తి చేశాయి అధికారికంగా కొన్ని రోజుల్లో 5G నెట్‌వర్క్ విడుదల చేయనున్నాయి. ఈ విషయంలో కాస్త ముందున్న Jio.. 5 నెట్‌‌వర్క్‌తో పాటు Jio 5G ఫోన్‌కు సిద్ధమవుతుంది. గత సంవత్సరం, Google భాగస్వామ్యంతో, Jio 4G స్మార్ట్‌ఫోన్ Jio Phone Nextని పరిచయం చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు Jio 5G ఫోన్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజా నివేదిక ప్రకారం, Jio ఫోన్ 5G త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ఆగస్టు 15 సందర్భంగా 5Gని ప్రారంభించవచ్చని జియో అంతర్గత సమాచారం.

జియో ఫోన్ 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?

జియో ఫోన్ 5జీకి సంబంధించి, ఈ ఫోన్ ఈ ఏడాది చివరి నాటికి లాంచ్ అవుతుందని చెబుతున్నారు. Jio ఫోన్ 5G ధర రూ. 12,000కి దగ్గరగా ఉండవచ్చు. ఇది విడుదలైతే , ఇది దేశంలోనే అత్యుత్తమ 5G ఫోన్ కావచ్చు, Jio ఫోన్ 5Gని కేవలం రూ. 2,500 మాత్రమే సొంతం చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించనుంది. రూ.2,500 డౌన్‌పేమెంట్ ఉంటుందని, మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ ద్వారా చెల్లించే అవకాశాన్ని జీయో కల్పించనుంది. ఈ జియో ఫోన్ 5G ఫీచర్ ఫోన్‌గా ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఫోన్‌తో కాలింగ్, డేటా వంటి సౌకర్యాలు ఇవ్వవచ్చు.

జియో ఫోన్ 5G ఫీచర్స్ (అంచనా)

జియో ఫోన్ 5G ఫీచర్ల గురించి మాట్లాడితే, 6.5-అంగుళాల HD + IPS LCD డిస్‌ప్లేను ఇందులో చూడవచ్చు, ఇది 1600x720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 480 5G ప్రాసెసర్‌తో 32 GB స్టోరేజ్, 4 GB RAMని పొందుతుంది. ఇది చౌకైన 5G ప్రాసెసర్. కెమెరా విషయానికొస్తే, ఈ 5G జియో ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కనుగొనవచ్చు, దీనిలో ప్రాథమిక లెన్స్ 13 మెగాపిక్సెల్‌లు, సెంకడ్ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రోగా ఉంటుంది. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చూడవచ్చు. జియో ఫోన్ నెక్స్ట్‌ మాదిరిగానే జియో 5 జి ఫోన్‌లో కూడా ఓకే ఓఎస్‌ ఉండవచ్చు