తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ppf :నెలకు రూ. 1,000 పెట్టుబడి పెట్టండి.. రూ. 18 లక్షలకు పైగా రిటర్న్స్ పొందండి!

PPF :నెలకు రూ. 1,000 పెట్టుబడి పెట్టండి.. రూ. 18 లక్షలకు పైగా రిటర్న్స్ పొందండి!

29 April 2022, 17:07 IST

    • అస్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతున్న వేళ సరియైన నిర్ణయలే భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి లాంటి మహా విపత్తు కొనసాగుతున్న సమయంలో భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం చాలా ముఖ్యం.
PPF
PPF

PPF

భవిష్యత్ అవసరాల కోసం వీలైనంత ఎక్కువ డబ్బు ఆదా చేయడం వివేకవంతమైన ఆర్థిక వ్యాయామం.  దీర్ఘకాలిక పొదుపుతో అధిక రాబడిని ఇవ్వగల పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడం సరైన ఆర్థిక ప్రణాళిక. అలా భవిష్యత్‌లో స్థిరమైన, అధిక రాబడిని ఇచ్చే పథకాలలో PPF  ఒకటి. ఈ పథకంలో నామమాత్రపు నెలవారీ రూ. 1,000 పెట్టుబడిపై రూ. 18 లక్షల కంటే ఎక్కువ రాబడిని  పొందవచ్చు. 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

PPF అనేది పెట్టుబడిపై ఖచ్చితమైన రాబడికి హామీ ఇచ్చే పథకం. 1968లో, నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్ చిన్న పొదుపు పోత్సాహిచడంలో భాగంగా ఈ లాభదాయకమైన పెట్టుబడి ఎంపికను సూచించింది. PPFలో పెట్టుబడి ద్వారా పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో చాలా మంచి రాబడిని ఆశించవచ్చు. ప్రస్తుతం PPF 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రతి సంవత్సరం కనిష్టంగా రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశాన్ని అందిస్తుంది. PPF ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు.  వ్యక్తి ఖాతా మెచ్యూర్ అయిన తర్వాత డబ్బును ఉపసంహరించుకోవచ్చు లేదా 5 సంవత్సరాల బ్లాక్‌లలో ఖాతాను పొడిగించే అవకాశం ఉంది.

15 సంవత్సరాల కాలానికి ప్రతి నెలా రూ. 1,000 పెట్టుబడి పెడితే రూ. 1.80 లక్షల అసలుతో పాటు 7.1 శాతం చొప్పున వడ్డీ మొత్తం రూ.1.45 లక్షలు కలిపి 15 ఏళ్ల తర్వాత రూ.3.25 లక్షల రిటర్న్ పొందవచ్చు. నెలవారీ రూ. 1,000 డిపాజిట్‌ను మరో 5 సంవత్సరాల పాటు పొడిగిస్తే, ఈ మొత్తం  3.25 లక్షల నుండి రూ. 5.32 లక్షలకు పెరుగుతుంది. రెండో సారి కూడా 5 సంవత్సరాల పొడిగిస్తే మొత్తం రూ. 8.24 లక్షలకు చేరుతుంది. ఇలా 35 ఏళ్ల పాటు కొనసాగిస్తే వచ్చే రిటర్న్ రూ.18.15 లక్షలు ఉంటుంది. పొడిగిస్తున్న కొద్ది వచ్చే రాబడి పెరుగుతుంది.  

మీ కెరీర్ ప్రారంభంలోనే PPFలో రూ. 1,000 పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మీ రిటైర్‌మెంట్‌ సమయానికి భారీ మెుత్తంలో రిటర్న్స్ పొందవచ్చు.

(గమనిక: ఇది ఏ విధమైన ఆర్థిక సలహాగా ఉద్దేశించబడలేదు. తదుపరి సమాచారం కోసం, దయచేసి మీ పెట్టుబడి సలహాదారు లేదా పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని సంప్రదించండి)

టాపిక్