Multani Mitti Benefits : జుట్టుకు ముల్తానీ మట్టితో ఎన్నో అద్భుతాలు
11 December 2023, 17:00 IST
- Multani Mitti For Hairs : ముల్తానీ మట్టితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందం చిట్కాల్లో దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. జుట్టుకు కూడా ముల్తానీ మట్టితో చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ముల్తానీ మట్టితో జుట్టుకు ప్రయోజనాలు
మహిళలు తరచుగా ముల్తానీ మట్టిని తమ చర్మ సంరక్షణలో చేర్చుకుంటారు. అయితే ఇది మీ జుట్టుకు కూడా అంతే మేలు చేస్తుందని మీకు తెలుసా? వాస్తవానికి ఇది శోషక లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా మీ తల చర్మం నుండి అదనపు నూనెను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది మీ శిరోజాలను కూడా కండిషన్ చేస్తుంది. అనేక రకాల ఖనిజాలను కలిగి ఉంటుంది. తలకు ప్రయోజనం చేకూరుస్తుంది. జుట్టు కోసం ముల్తానీ మట్టిని ఉపయోగించడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకోండి.
ముల్తానీ మట్టితో జుట్టును కడగడం వల్ల కలిగే ఉత్తమ ప్రయోజనాల్లో ఒకటి, ఇది మీ జుట్టు నుండి మురికిని తొలగించడమే కాకుండా దానిని కండిషన్ చేస్తుంది. ప్రత్యేకించి, మీకు రింగుల జుట్టు ఉంటే.. ముల్తానీ మట్టిలోని కండిషనింగ్ లక్షణాలు మీ జుట్టును సరిగా నిర్వహించేలా చేస్తాయి.
తరచుగా చాలా మంది వారి జుట్టుకు రసాయన చికిత్సలు చేస్తారు. కానీ కెమికల్ ప్రొడక్ట్స్ జుట్టుకు చాలా నష్టం కలిగిస్తాయి. అలాంటి సందర్భాలలో మీరు ముల్తానీ మట్టి వాడటం మంచిది. ఇది మీ జుట్టు సాఫ్ట్‌కు పోషణ, బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీని వల్ల మీ జుట్టు మృదువుగా మారుతుంది. అలాగే రసాయనాలతో దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.
ముల్తానీ మట్టిని ఉపయోగించడం వల్ల డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయడమే కాకుండా, స్కాల్ప్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ముల్తానీ మట్టిని హెయిర్ క్లెన్సర్‌గా ఉపయోగించడం వల్ల స్కాల్ప్ క్లీన్ అవుతుంది. ఇది తలపై ఉండే జెర్మ్స్, బ్యాక్టీరియాను తొలగించగలదు.
ముల్తానీ మట్టిలో అనేక రకాల ఖనిజాలు, పోషకాలు ఉన్నాయి. దీని కారణంగా ఇది చుండ్రు తొలగించడం ద్వారా మీ స్కాల్ప్‌ను బాగు చేస్తుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరచడానికి మీ జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు కోసం ముల్తానీ మట్టిని ఉపయోగించడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. జట్టు విరిగిపోవడం చాలా తక్కువగా ఉంటుంది.
ముల్తానీ మట్టిని నేరుగా అప్లై చేయోచ్చు. ఇతర పదార్థాలతోనూ కలిపి పెట్టుకోవచ్చు. ముల్తానీ మట్టి అరకప్పు తీసుకోండి. పెరుగు అరకప్పు, 2 చెంచాల తేనె, నిమ్మరసం చెంచా ఉపయోగించండి. మెుదట నిమ్మకాయను కట్ చేసి.. రసం పిండుకోవాలి. ముల్తానీ మట్టిలో పెరుగు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అనంతరం 2 చెంచాల నిమ్మరసం, తేనె బాగా కలుపుకోవాలి.
తయారైన మాస్క్ ను జుట్టుకు అప్లై చేసుకోవాలి. గంటసేపు అలానే పెట్టుకోవాలి. ఇప్పుడు షాంపూతో క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే.. జుట్టు సమస్యలు తగ్గుతాయి. తలపై ఉన్న జిడ్డు కూడా పోతుంది.