Scalp Massager: జుట్టు ఆరోగ్యం కోసం స్కాల్ప్ మసాజర్ వాడటం మంచిదేనా?-know benefits of scalp massager and know how to choose it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Scalp Massager: జుట్టు ఆరోగ్యం కోసం స్కాల్ప్ మసాజర్ వాడటం మంచిదేనా?

Scalp Massager: జుట్టు ఆరోగ్యం కోసం స్కాల్ప్ మసాజర్ వాడటం మంచిదేనా?

Koutik Pranaya Sree HT Telugu
Oct 09, 2023 11:04 AM IST

Scalp Massager: జుట్టు ఆరోగ్యం కోసం స్కాల్ప్ మసాజర్ వాడాలా వద్దా అనే సందేహం ఉందా? అయితే దాని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోండి.

మసాజర్ లాభాలు
మసాజర్ లాభాలు (freepik)

జుట్టును కాపాడుకోవడానికి అంతా ఎంతగానో తాపత్రయ పడుతుంటారు. మంచి మంచి నూనెల్ని వాడటం, ఖరీదైన షాంపూలు, కండిషనర్లను వాడటం చేస్తుంటారు. అయినా సరే జుట్టు ఊడిపోవడం, బలహీనంగా ఉండటం లాంటి కేశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. సమతుల ఆహారం తీసుకోవడం, స్కాల్ప్‌ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల చాలా వరకు కేశ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంకా అవసరం అనుకుంటే ఇప్పుడు మార్కెట్లోకి రకరకాల స్కాల్ప్‌ మసాజర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనే దాని గురించి ఇప్పుడు చూసేద్దాం

ఏంటీ స్కాల్ప్‌ మసాజర్‌, ఎందుకు?

  • స్కాల్ప్‌ మసాజర్లు అనేవి మృదువైన బ్రజిల్స్‌తో ఉండే హెయిర్‌ కేర్‌ ఉత్పత్తుతుల. ఇవి స్కాల్ప్‌కి చక్కగా మసాజ్‌ చేస్తాయి. ఫలితంగా అక్కడ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా, పొడవు పెరుగుతుంది.
  • జుట్టుకు షాంపూ చేసుకునేప్పుడు స్కాల్ప్‌ మసాజర్‌ని ఉపయోగించడం వల్ల షాంపూ కుదుళ్ల వరకు బాగా చేరి అక్కడున్న మురికి, జిడ్డుని పట్టి లాగేస్తుంది. దీంతో తల మరింత ప్రభావవంతంగా శుభ్ర పడుతుంది.
  • తలలో చుండ్రు, దురదలు ఉన్న వారు షాంపూ చేసుకునేప్పుడు దీన్ని ఉపయోగించడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. తలకు పట్టేసి ఉన్న చుండ్రు లాంటివి మరింత బాగా శుభ్రపడతాయి.
  • అలాగే నూనె పెట్టుకునేప్పుడు చాలా మంది తమ ముని వేళ్లతో తలలో మసాజ్‌ చేసుకుంటారు. బదులుగా ఈ మసాజర్లను వాడటం వల్ల నూనె చక్కగా స్కాల్ప్‌లోకి ఇంకుతుంది. కుదుళ్లు మరింత బలోపేతం అవుతాయి.
  • ఈ హెయిర్‌ మసాజర్లకు ఉండే బ్రష్‌లను సాధారణంగా సిలికాన్‌ పదార్థంతో తయారు చేస్తారు. ఇది మెత్తగా ఉంటుంది. కాబట్టి జుట్టు, కుదుళ్లకు ఎలాంటి హానీ కలిగించదు. చక్కగా మసాజ్‌ అయిన భావన వస్తుంది. తలలో మసాజ్‌ కావడం వల్ల మెదడుకు ఎంతో రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. దీంతో శరీరంలో హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా మనం ఆనందంగా ఉంటామన్నమాట.
  • దీన్ని ఉపయోగించడం వల్ల స్కాల్ప్‌ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుదుళ్లు బలంగా అవుతాయి. అయితే మన తలకు, వెంట్రుకల తీరుకు అనువైన స్కాల్ప్‌ మసాజర్‌ని ఎంచుకుని కొనుక్కోవడం అనేది ముఖ్యం. అది మన నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఒత్తిడి కలిగించకూడదు. బాధ కలిగించకూడదు. ఒక్కొక్కరి స్కాల్ప్‌ సున్నితంగా ఉంటుంది. అలాంటి వారు చాలా మెత్తటి బ్రజిల్స్‌ఉన్న వాటిని ఎంచుకోవాలి. అలాగే కొందరికి గట్టి స్కాల్ప్‌ ఉంటుంది. వారు మధ్యస్తంగా ఉన్న హార్డ్ బ్రజిల్స్‌ ఉన్న వాటిని తీసుకోవాలి.

Whats_app_banner