Dreams and Meanings : జుట్టు కత్తిరించినట్టుగా కల వచ్చిందా? అర్థం ఇదే
Meaning Of Dream : మనం చూసే ప్రతి కలకి ఒక అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. కలలు భవిష్యత్తుకు సూచికలు అని అంటారు. ప్రతి కలకు భిన్నమైన అర్థం ఉంటుంది. నేటి కలల వివరణలో హెయిర్ కట్ గురించి అర్థాన్ని తెలుసుకుందాం.
జుట్టు మానవ శరీరంలో ఒక భాగం, ఇది అందానికి చిహ్నం. తలపై వెంట్రుకలు లేకుంటే రూపురేఖలు మారిపోతాయి. సౌందర్య సాధనాల్లో కూడా జుట్టు సంరక్షణ ప్రస్తావన ఉంది. కానీ వెంట్రుకలను కాపాడుకోవడం చాలా కష్టమైన పని. జుట్టు అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం పదే పదే సెలూన్ తలుపు తడుతుంటాం. అది సరే కానీ.. జుట్టు గురించి ఇంత చర్చ ఎందుకు అని మీరు ఆశ్చర్యపోతున్నారా? నేటి కలల వివరణలో జుట్టు కత్తిరింపు గురించి తెలుసుకుందాం. జుట్టు కత్తిరించుకోవాలని కలలు కనడం అంటే ఏంటో నేటి డ్రీమ్ సైన్స్ లో చూద్దాం.
కలలో జుట్టు కత్తిరించడం శుభం, అశుభం రెండూ కావచ్చు. ఈ కల పురుషులు, స్త్రీలకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే స్వప్న శాస్త్రం ప్రకారం, పురుషుడు కలలో జుట్టు కత్తిరించుకోవడం శుభసూచకంగా పరిగణిస్తారు. కానీ స్త్రీ తన జుట్టును కత్తిరించుకోవాలని కలలుకంటే మాత్రం చాలా అశుభ సంకేతంగా చెబుతారు.
మీరు కలలో పొడవాటి జుట్టును చూసినట్లయితే, భవిష్యత్తులో మీకు మంచి రోజులు వస్తాయని అర్థం. స్వప్న శాస్త్రం ప్రకారం, అలాంటి కల అంటే వ్యక్తి తక్కువ ప్రయత్నంతో చాలా ప్రయోజనాలను పొందుతాడు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు చాలా త్వరగా ఉన్నత స్థానాలను పొందుతారు.
కలలో జుట్టు కత్తిరించే స్త్రీని చూడటం అశుభం. ఈ కల ఆర్థిక నష్టం లేదా ఇంట్లో ఉన్న స్త్రీ ఆరోగ్యం క్షీణిస్తుంది అనే భయానికి సంకేతం. అంతే కాకుండా కుటుంబంలో కలహాలు కూడా వచ్చే సూచనలు ఉంటాయి. మహిళలు జుట్టు కత్తిరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గురువారం జుట్టు కత్తిరించకూడదు.
డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలు కనడంలో అర్థం ఉంది. ప్రతి కలకి దాని స్వంత అర్థం దాగి ఉంటుంది. కలలు కనడం సహజమైన ప్రక్రియ. మనం అందరం రాత్రి పడుకున్నప్పుడు కలలు కంటాం. కొన్నిసార్లు కలలో కనిపించే భయంకరమైన సంఘటనలు మనల్ని వెంటాడతాయి. ఈ కల ఎందుకు వచ్చింది, దాని అర్థం ఏమిటి, ఇది చెడ్డదా లేదా మంచిదా అని ఆలోచించడం సహజం. అయితే మనం చూసే ప్రతి కలకి ఒక అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.
గమనిక : పైన ఇచ్చిన కథనం విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.. ఇందులోని అంశాలను ఆమోదించదు. మీ విచక్షణ ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. సమాచారం అందించేందుకు మాత్రమే కథనం ఇచ్చాం.