Home Remedies of Eye Puffiness : మీ కళ్లను స్ట్రెస్ నుంచి ఇలా కాపాడుకోండి..
04 November 2022, 20:00 IST
- Home Remedies of Eye Puffiness : బాగా పడుకున్నా.. అస్సలు పడుకోకపోయినా.. ఏడ్చినా.. బయట తిరిగినా.. స్క్రీన్ ఎక్కువ సేపు చూసినా.. ఇలా చాలా వాటికి కళ్లు ఉబ్బిపోతాయి, కంటి చుట్టు బ్లాక్ సర్కిల్స్ వచ్చేస్తాయి. అలాంటి సమయంలో వాటిని సహజంగా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కంటిని కింద నల్లని వలయాలు, ఉబ్బితే ఇలా తగ్గించుకోండి..
Home Remedies of Eye Puffiness : ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని వివిధ భాగాలలో నీరు చేరుతుందని అంటారు. అతిగా ధూమపానం, మద్యపానం చేయడం వల్ల కళ్ల కింద వాపు వస్తుంది. కొన్నిసార్లు ఈ సమస్య హార్మోన్ల అవాంతరాల వల్ల కూడా రావచ్చు. అయితే కళ్లు బాగా వాచిపోయినా, కళ్లు ఎర్రబడినా వైద్యులను సంప్రదించాలి.
అవేకాకుండా తరచుగా ఏడవడం వల్ల కళ్లు ఎర్రగా మారి ఉబ్బుతాయి. అనేక ఇతర కారణాల వల్ల కళ్ల కింద ప్రాంతం ఉబ్బుతుంది. అనేక సందర్భాల్లో జన్యుపరమైన కారకాల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అనేక సందర్భాల్లో అదనపు ఒత్తిడి లేదా ఆందోళన కూడా కారణం అవుతుంది. అయితే ఉబ్బిన కళ్లను, బ్లాక్ సర్కిల్స్ ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చుద్దాం.
చెంచాతో..
మీరు కంటి కింద ఉబ్బరంతో మేల్కొంటే.. ఫ్రీజర్‌లో స్టీల్ చెంచా ఉంచండి. కాసేపు దానిని కళ్లపై పెట్టుకోండి. దీనివల్ల వాపు తగ్గుతుంది. ఒకవేళ జలుబు చేస్తే మాత్రం.. ఈ పద్ధతికి దూరంగా ఉండండి.
బంగాళాదుంప రసం
పచ్చి బంగాళాదుంపను మెత్తగా చేసి.. దాని రసాన్ని కళ్లకు రాయండి. 15 నిమిషాలు కళ్లు మూసుకోండి. ఇది బ్లాక్ సర్కిల్స్ పోగొట్టడమే కాకుండా.. వాపును కూడా తగ్గిస్తుంది.
అలోవెరా జెల్
అలోవెరా జెల్ కంటి కింద ఉబ్బడం, నల్ల మచ్చలను కూడా తగ్గిస్తుంది. కలబంద ఆకు లోపల జెల్‌ను ఫ్రిజ్‌లో ఉంచి అప్లై చేయండి. కొంచెం సేపు ఉంచి కడిగేయండి. మీకు దురద లాంటిది వస్తే వెంటనే క్లీన్ చేసేయండి. ఎందుకంటే కొందరికి అలోవెరా జెల్ అంతగా పడదు.
కీరా దోస
నల్లటి వలయాలు లేదా కళ్లు ఉబ్బినట్లు అనిపిస్తే.. కీరా దోసకాయను కట్ చేసి కళ్ల మీద అప్లై చేయండి. కళ్లు చాలా రిలాక్స్ అవుతాయి. సమస్య కూడా తీరిపోతుంది.
టీ బ్యాగ్‌లతో
మీరు టీ బ్యాగ్స్ ఉపయోగిస్తుంటే.. వాడిన తర్వాత వాటిని పడేయకుండా ఉంచండి. వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. చల్లటి టీ బ్యాగ్ కళ్లపై పెట్టుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
(వీటిని ప్రయత్నించే ముందు.. మీ డాక్టర్ సలహా తీసుకోండి.)