Under Eye wrinkles । కళ్ల కింద ముడతలు వస్తున్నాయా? ఇదిగో పరిష్కారం!
02 November 2022, 20:47 IST
- Under Eye wrinkles: కళ్ల కింద ముడతలు తయారయితే అది మొత్తం అందాన్ని పాడు చేస్తుంది, వయసు ఎక్కువ ఉన్నవారిలా కనిపిస్తారు. ఈ సమస్యకు సహజ మార్గాల్లో పరిష్కారం చూపవచ్చు.
eye wrinkles
కళ్ళు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. కంటిపై నిరంతరం భారం పడుతూ ఉంటే అవి అలిసిపోయి, చూపు మందగిస్తుంది. శరీరంలో బలహీనత కారణంగా ఇలా జరుగుతుంది. అలాగే తగినంత నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, ఒత్తిడి, గంటల తరబడి ఫోన్ ఉపయోగించడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం, డీహైడ్రేషన్‌కు గురికావడం, ఆఫీసులో కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఎక్కువసేపు ఉపయోగించడం, కొన్ని రకాల మందులు వాడడం కళ్లను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఫలితంగా కళ్ల కింద ముడతలు కనిపించడం ప్రారంభం అవుతుంది.
ఈ ముడతలు మీ అందాన్ని తగ్గించడమే కాకుండా, మీకు వయసు ఎక్కువ ఉన్నట్లు కనిపించేలా చేస్తాయి. ఆ తర్వాత ఖరీదైన క్రీములు, లోషన్లు వాడినా ఫలితం ఉండదు. కానీ ఇంట్లోనే సహజంగా కంటి కింద ముడతలను తగ్గించుకోవచ్చు. ఎలాగో ఇక్కడ కొన్ని మార్గాలు అందిస్తున్నాం, ఇలా ప్రయత్నించి చూడండి.
ఎక్కువ నీరు త్రాగాలి
కంటి ఆరోగ్యానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల కళ్లు పొడిబారిపోతాయి. అలాగే కళ్లలో వాపు వల్ల కళ్లు పొడిబారడం సమస్య పెరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో పుష్కలంగా నీరు త్రాగటం చాలా ముఖ్యం.
ఆకుపచ్చ కూరగాయలు
ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఆకుకూరలు తినాలని సిఫారసు చేస్తారు. ఇందులో కంటికి అవసరమైన అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిలోని విటమిన్లు చర్మానికి మెరుపును కూడా ఇస్తాయి. కాబట్టి ఆకుపచ్చని కూరగాయలు తినడం వల్ల కళ్ల కింద ముడతలు తగ్గుతాయి.
జేష్టమధు కంటి సీరం
ఉదయం, అర టీస్పూన్ తేనె, అర టీస్పూన్ ఉసిరి పొడిలో కొద్దిగా నీరు వేసి రాత్రంతా నాననివ్వాలి. ఈ నీటిలో కొన్ని అలోవెరా జెల్, రెండు చుక్కల విటమిన్ ఇ జెల్ వేసి కలపాలి. ఈ మిశ్రమం ఒక గుడ్డలో వడకట్టి అందులో నుండి కొద్దిగా పేస్ట్ తీసుకుని కళ్ల కింద అప్లై చేసి చాలా సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడిగేయాలి. మిగిలిపోయిన పేస్ట్‌ను 5-6 రోజులు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఇలా రోజూ దాదాపు 15 రోజుల పాటు చేస్తే కళ్ల కింద ముడతలు క్రమంగా తగ్గుతాయి.
క్యారెట్లు తినడం
క్యారెట్లు చాలా పోషకమైన ఆహారం, వాటిలో బీటా కెరోటిన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి ఈ విటమిన్లు చాలా మంచి ఔషధం. ఇవి తినడం వల్ల కంటికి మేలు కలుగుతుంది. ఇందులోని పోషకాలు కళ్లకే కాదు మొత్తం శరీరానికీ మేలు చేస్తాయి.
ఇవే కాకుండా కొన్ని హెర్బల్ ఫేషియల్, కంటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. కనీసం 6-7 గంటలు నిద్రపోవాలి. అలాగే యోగా వంటివి చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే కళ్లకింద మడతలు పోయి, మంచి గ్లో కూడా వస్తుంది.