Improving Eye Sight Food : ఇవి తింటే కంటిచూపు మెరుగుపడుతుంది..
21 October 2022, 13:48 IST
- Improving Eye Sight Food : దృష్టి నష్టం ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. కంప్యూటర్లు, మొబైల్స్ వాడకం ఎక్కువ అవ్వడమే దీనికి ఓ కారణంగా చెప్పవచ్చు. అయితే మీ కంటిచూపును మెరుగుపరచుకోవాలంటే.. కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Improving Eye Sight Food
Improving Eye Sight Food : ప్రస్తుతం చాలామంది కళ్లజోడు లేకుండా పని చేయలేకపోతున్నారు. స్క్రీనింగ్ టైమ్ ఎక్కువ ఉండడం, ఇతర కారణాల వల్ల చాలామందికి కంటిచూపు తగ్గిపోతుంది. అయితే కంటి చూపును మెరుగుపరచడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలను అనుసరిస్తే చాలు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. సులభమైన, సహజమైన మార్గంలో కంటిచూపును మెరుగుపరచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంతో..
బాదం మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీని కోసం మీరు నానబెట్టిన బాదంపప్పును పేస్ట్ లా చేసి, పాలతో కలిపి తాగవచ్చు.
ఫెన్నెల్‌తో..
ఫెన్నెల్‌లో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందుకోసం ఒక కప్పు బాదంపప్పు, ఫెన్నెల్, పంచదార వేసి గ్రైండర్‌లో వేసి పౌడర్‌లా చేసుకోవాలి. ఈ పొడిని రెండు చెంచాల చొప్పున ఒక గ్లాసు పాలలో కలిపి రోజూ తాగాలి.
ఉసిరితో..
దృష్టిని మెరుగుపరచడానికి ఉసిరి ఒక మంచి ఆయుర్వేద నివారణగా ప్రసిద్ధి చెందింది. విటమిన్ సి ఉత్తమ వనరులలో ఉసిరి ఒకటి. దీని కోసం ఉసిరి రసాన్ని అరకప్పు నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం రెండుసార్లు తాగాలి.
కంటి వ్యాయామాలు
కంటి వ్యాయామాలు మీ కళ్లను ఫ్లెక్సిబుల్‌గా మార్చడంలో సహాయపడతాయి. అవి కళ్లలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. మీ దృష్టిని పెంచుతాయి.