తెలుగు న్యూస్ / ఫోటో /
Home Tips : వాడేసిన టీ బ్యాగ్స్‌ని పడేస్తున్నారా? అయితే ఆగండి..
- ఉపయోగించిన టీ బ్యాగ్స్లను మనం పడేస్తాం. కానీ వాటిని పడేయొద్దు అంటున్నారు నిపుణులు. వాటితో ఇంట్లో చాలా ఉపయోగాలు ఉంటాయంటున్నారు. ఇంతకీ వాటితో ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఉపయోగించిన టీ బ్యాగ్స్లను మనం పడేస్తాం. కానీ వాటిని పడేయొద్దు అంటున్నారు నిపుణులు. వాటితో ఇంట్లో చాలా ఉపయోగాలు ఉంటాయంటున్నారు. ఇంతకీ వాటితో ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 5)
చాలామంది ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా టీని తాగేస్తారు. టీ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుందని టీ బ్యాగ్స్ ఉపయోగిస్తారు. వాడిన వెంటనే టీ బ్యాగ్స్‌ను డస్ట్‌బిన్‌లో పడేస్తారు. అయితే వీటిని డస్ట్‌బిన్‌లో వేసేముందు ఓ సారి ఆగండి అంటున్నారు నిపుణులు. వీటితో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు.
(2 / 5)
ఈ టీ బ్యాగ్స్‌ను చెట్లు, మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు అంటున్నారు. చక్కెరతో చేసిన టీ బ్యాగ్స్ అయితే.. వాటిని నీటితో శుభ్రం చేసి.. ఎరువుగా వేయాలి. ముఖ్యంగా పుష్పించే మొక్కలకు టీ ఆకులు ఉపయోగపడతాయి.
(3 / 5)
వాడేసిన టీ బ్యాగ్‌ను ఫ్రిజ్‌లో ఉంచండి. మీరు నిద్రపోయే ముందు వాటిని కళ్లపై పెట్టుకోవాలి. దీంతో కళ్ల వాపు తగ్గుతుంది, కళ్ల కింద నల్లటి మచ్చలు పోతాయి.
(4 / 5)
ఒక్కోసారి బూట్ల నుంచి దుర్వాసన వస్తుంది. పైగా వర్షాకాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఈ టీ బ్యాగ్స్‌ను చిన్న గుడ్డలో వేసి.. బూట్లలో ఉంచండి. వాసన తొలగిపోతుంది.
ఇతర గ్యాలరీలు