తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Remedies For Dry & Oil Skin : పొడి అయినా ఆయిల్ చర్మమైనా.. ఇలా కాపాడుకోండి..

Home Remedies for Dry & Oil Skin : పొడి అయినా ఆయిల్ చర్మమైనా.. ఇలా కాపాడుకోండి..

30 September 2022, 12:59 IST

    • Home Remedies for Dry & Oil Skin : పొడి చర్మానికి మంచిగుండేవి.. ఆయిల్ స్కిన్​కి సెట్ కావు. ఆయిల్ స్కిన్​కి సెట్ అయ్యేవి పొడి చర్మానికి సెట్ కావు. అయితే సహాజమైన ఉత్పత్తులతో.. మీ చర్మాన్ని రక్షించుకోవాలనుకుంటే.. ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి. మీరు ట్రై చేసి.. పండుగకు సిద్ధమైపోండి.
సహజమైన సౌందర్య రక్షణ
సహజమైన సౌందర్య రక్షణ

సహజమైన సౌందర్య రక్షణ

Home Remedies for Dry & Oil Skin : భారతదేశంలో పండుగలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందో మనకు బాగా తెలుసు. అయితే ఈ సమయంలో మహిళలు అందంగా తయారవుతారు. పట్టు వస్త్రాలు ధరించి పూజకు సిద్ధమవుతారు. అయితే ఎంత అందంగా రెడీ అయినా.. ముఖం నిస్తేజంగా ఉంటే చూడటానికి అంత బాగోదు. కాబట్టి రెడీ అయినా లేక పోయినా ఫ్రెష్​గా, సహజంగా అందంగా కనిపించాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి.

మెరిసే, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి ఉత్తమ మార్గం ఇంటి చిట్కాలతో కూడా సాధ్యమవుతుంది. వేలకి వేలు ఖర్చు పెట్టి కెమికల్స్ మొహానికి పూసుకునే బదులు.. సహజసిద్ధమైన చిట్కాలను ఫాలో అయిపోండి. వీటితో జిడ్డు చర్మం, పొడి చర్మం ఉన్నవారు కూడా.. ఇంట్లోనే మీ మెరుపును సొంతం చేసుకోగలుగుతారు. ఆరోగ్యంగా కనిపించే చర్మం కోసం ప్రతిరోజూ శుభ్రపరచడం, టోనింగ్ చేయడం, మాయిశ్చరైజింగ్ చేయడం చాలా ముఖ్యం. ఇవి వృద్ధాప్య సంకేతాలను మందగించేలా చేసి.. మీ చర్మాన్ని రక్షిస్తాయి.

జిడ్డు చర్మం కోసం క్లెన్సర్

ముల్తానీ మట్టి, శనగ పిండిని ఒక గిన్నెలో తీసుకొని సమాన నిష్పత్తిలో కలపండి. నీటితో పేస్ట్​లా చేసి.. దాని ముఖానికి అప్లై చేయండి. ఒక నిమిషం పాటు మసాజ్ చేసి కడిగేయండి. ముల్తానీ మట్టి మీ ముఖం నుంచి అదనపు నూనెను తొలగిస్తుంది. శనగ పిండి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. నూనెను దూరంగా ఉంచి.. మృదువైన చర్మాన్ని ఇస్తుంది.

పొడి చర్మం కోసం క్లెన్సర్

డ్రై స్కిన్ సున్నితంగా ఉంటుంది కాబట్టి.. చాలా సున్నితమైన, పోషకమైన క్లెన్సర్ అవసరం. కొన్ని చుక్కల పాలలో కొంత తేనె కలపండి. దీనిని మీ ముఖానికి అప్లై చేసి 30-50 సెకన్ల పాటు మసాజ్ చేసి.. ఆపై శుభ్రం చేసుకోండి. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ మీ రంధ్రాలను లోతుగా శుభ్రపరుస్తుంది. తేనె మీ పొడి చర్మానికి మంచి పోషణ, తేమను అందిస్తుంది.

జిడ్డు చర్మం కోసం టోనర్

జిడ్డు చర్మం ఉన్న ఎవరికైనా గ్రీన్ టీ ఒక హీరో అని చెప్పవచ్చు. గ్రీన్ టీని తీసుకుని అందులో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపండి. మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసి.. మీ టోనర్​గా ఉపయోగించండి. లేదంటే దీన్ని కాటన్ ప్యాడ్‌పై స్ప్రే చేసి ముఖానికి అప్లై చేయండి. గ్రీన్ టీ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. టీ ట్రీ ఆయిల్ మొటిమలతో పోరాడుతూ.. మీకు ఆరోగ్యంగా కనిపించే చర్మాన్ని ఇస్తుంది.

పొడి చర్మం కోసం టోనర్

10-12 చుక్కల చమోమిలే ఎసెన్షియల్ ఆయిల్‌తో కొద్దిగా రోజ్ వాటర్ కలపండి. దీన్ని స్ప్రే బాటిల్‌లో పోసి.. మీ ముఖం కాటన్ ప్యాడ్‌తో ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. రోజ్ వాటర్ మీ చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. చమోమిలే దానిని ఉపశమనాన్ని, పోషణను అందిస్తుంది.

జిడ్డుగల చర్మం కోసం మాయిశ్చరైజర్

ఒక చెంచా అలోవెరా జెల్‌ను కొద్దిగా రోజ్ వాటర్‌తో కలపండి. మీ టోనర్ ఉపయోగించిన తర్వాత రోజుకు రెండుసార్లు దీనిని అప్లై చేయండి. మీ ముఖాన్ని 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. రక్త ప్రసరణను కూడా ఇది మెరుగుపరుస్తుంది. అలోవెరా మీ జిడ్డుగల చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలోవెరా మీ జిడ్డుగల చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అయితే గులాబీ మీ చర్మానికి ఉపశమనం అందించి.. అధిక నూనె ఉత్పత్తిని నివారిస్తుంది.

పొడి చర్మం కోసం మాయిశ్చరైజర్

8 చుక్కల జోజోబా నూనెతో 1 చెంచా షియా బటర్‌ను కలపండి. షియా బటర్ ఒక బలమైన మాయిశ్చరైజర్. జోజోబా ఆయిల్ కమిలిపోయిన, చికాకు కలిగించే చర్మానికి ఉపశమనం అందిస్తుంది.

టాపిక్