తెలుగు న్యూస్  /  Lifestyle  /  Habits To Incorporate In Daily Routine For Healthy And Happy Life

daily habits: బాగుపడే లక్షణాలు ఇవే గురూ!

09 May 2023, 14:40 IST

  • daily habits: ప్రతి రోజూ ఆసక్తితో, ఆనందంగా గడపాలంటే.. మీ రోజు మొత్తం ఎలా గడవాలో, ఏమేం మార్పులు చేసుకోవాలో చూడండి. 

     

Simple daily habits for staying motivated and happy
Simple daily habits for staying motivated and happy (Photo by Anna Fothergill on Unsplash)

Simple daily habits for staying motivated and happy

ఆఫీసుకెళ్లామా, తిన్నామా, తెల్లారిందా అనేట్లు ఉండకూడదు జీవితం. ప్రతి రోజూ మొదలవబోతుందంటే ఉత్సాహం, ఆనందం ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటూ ప్రతి పనిని సక్రమంగా నిర్వర్తిస్తుంటే తెలియని ఆనందం, ఉత్సాహం మీకుంటాయి. కానీ అదంత సులువు కాదు. కొన్ని మార్పులు చేసుకోవాలి. మీకు నచ్చని పనులైనా మంచివైతే చేయాలి. ఎందుకంటే ఏదో గడిచిపోతే చాలు అన్నట్లు మీ రోజు మొదలవ్వకూడదు. దానికోసం మీ రోజూవారీ దినచర్యలో ఏమేం ఉండాలో చూద్దాం.

ఉదయం రొటీన్:

మీరు నిద్రలేవగానే మీరు చేసే పనులకు ఒక పద్ధతి ఉండాలి. శారీరక వ్యాయమం చేయడం, జిమ్ కి వెళ్లడం, తప్పకుండా స్నానం చేయడం, ఆరోగ్య కరమైన అల్పాహారం తీసుకోవడం, ముఖ్యంగా అల్పాహారం తినకుండా ఉండకూడదు. ఇవన్నీ పాటిస్తే మీ ఉదయపు వేళలు హాయిగా గడిచిపోతాయి. రోజు మొత్తానికి సరిపడా ఉత్సాహం ఇస్తాయి.

ఆహారం:

ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనలేదని మన ఆరోగ్యం పాడైనపుడే తెలుస్తుంది. ఏం లేకున్నా ఆరోగ్యం బాగుండాలి. మీరు తినే తిండే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అందుకే ఒమేగా 3 యాసిడ్లు ఉండే ఆహారం, తాజా పండ్లు, కూరగాయలు తినాలి. ముఖ్యంగా ఆకుకూరలు తినడం నచ్చక పోయినా అలవాటు చేసుకోవాలి. వీటన్నింటి వల్ల ఆనందాన్ని పెంచే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.

ధ్యానం:

రోజుకు కనీసం 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేయాలి. ఇది మీ ఏకాగ్రత శక్తిని పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన ను తగ్గిస్తుంది. మీకోసం మీరు కేటాయించే ప్రశాంతమైన సమయం ఇది.

కొత్త లక్ష్యాలు:

పెద్ద లక్ష్యాలను సాధించాలంటే నేరుగా వాటిని చేరుకోలేరు. మీ రోజూ వారి దినచర్యలో దానికోసం చేసే కృషి కనిపించాలి. దీనివల్ల మీకు కొత్త రోజు మొదలవబోతుంటే కొత్త ఉత్సాహం వస్తుంది.

నిత్య విద్యార్థి:

మీరెంత ఎదిగినా మీకు అన్ని విషయాలు తెలిసే అవకాశం అస్సలే లేదు. అన్నీ తెలుసున్న అహంకారం ఉండకూడదు. ఎవరేం చెప్పినా అందులో కొత్త విషయాన్ని గ్రహించాలి. ప్రతి రోజూ ఇంకేం నేర్చుకోవాలో ఆలోచించాలి.

మీ దినచర్యలో ఇవి తప్పకుండా ఉండాలి:

  1. ఫోన్లు పట్టుకుని కూర్చోకుండా కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి
  2. గదిలో తలుపులేసుకుని ఉండకుండా ప్రకృతికి దగ్గరగా పచ్చదనంలో కాసేపు గడపడం
  3. మీకున్న లక్ష్యాల కోసం ప్రతి రోజూ ప్రయత్నించడం, వాటిని సాధించడం.
  4. మీరు సాధించిన విజయాలకు మీకు మీరే అభినందించుకోవడం, బహుమతులిచ్చుకోవడం.
  5. మీ చుట్టూ సానుకూలంగా ఆలోచించే మనుషులు ఉండేలా చూసుకోండి. మీ చుట్టూ ఉన్న మనుషులు మీకు స్ఫూర్తినివ్వాలి. వాళ్లను చూసి ఏదైనా నేర్చుకోవాలి అనిపించాలి.
  6. ప్రతి విషయం గురించి, మనుషుల గురించి పాజిటివ్ గా ఆలోచించాలి.
  7. దయ, జాలి ఉండాలి. మీ చుట్టూ మీ అవసరమున్న వ్యక్తులుంటే వాళ్లకు సాయం చేయండి. మీరు చేయగలిగే సాయమైతే పట్టించుకోకుండా ఉండకండి.

ఈ లక్షణాలన్నీ మీ జీవితం మీద మీకు ఆసక్తి కలిగేలా, ఉత్సాహంగా , ఆనందంగా ప్రతి రోజూ మొదలు పెట్టేలా చేస్తాయి. మీరు చేసుకోవాల్సిన మార్పులేంటో చూసుకోండి. ఇవే కాదు.. మీలో మీకు నచ్చని, మంచిది కాని ఏ అలవాటు మీకు ఎక్కువ రోజులుండకూడదు. తొందరగా మారడానికి ప్రయత్నం మొదలెట్టండి.

టాపిక్