తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Malai Cream Toast । సాయంత్రం వేళ క్రీమ్ టోస్ట్ తినండి.. తియ్యని వేడుక చేసుకోండి!

Malai Cream Toast । సాయంత్రం వేళ క్రీమ్ టోస్ట్ తినండి.. తియ్యని వేడుక చేసుకోండి!

HT Telugu Desk HT Telugu

11 October 2022, 18:33 IST

google News
    • స్వీట్ తినాలనిపించినపుడు సింపుల్‌గా ఒకసారి Malai Cream Toast చేసుకోండి. దీని రుచి మీరు ఎప్పటికీ మరిచిపోరు. రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Cream Toast
Cream Toast (Pixabay)

Cream Toast

సాయంత్రం వేళ స్నాక్స్ తినాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. మిర్చి బజ్జీలు, పునుగులు లాంటి కరుడుగట్టిన కారం పదార్థాలు కాకుండా ఈ చల్లని సాయంత్రం వేళ తియ్యని వేడుక చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించారా? ఎప్పుడూ హాట్ మాత్రమే కాకుండా అప్పడప్పుడు స్వీట్ కూడా తింటుంటే జీవితం చౌచౌ బాత్ లాగా తీపికారాలతో హాయిగా సాగిపోతుంది.

మరి ఇప్పటికిప్పుడు, తక్షణమే చేసుకొనగలిగే స్వీట్ రెసిపీ ఏదైనా ఉందంటే మలయితో మధురంగా క్రీమ్ టోస్ట్ చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా ఈ క్రీమ్ టోస్ట్ చేసుకోవచ్చు. రెండు డబల్ రోటీల మధ్యలో మీగడ వేసి, క్రీమ్ మసాజ్ చేసి అలాఅలా చక్కెర చల్లుకొని తింటుంటే.. నోట్లోని రుచి మీ గుండెను పరవశింపజేస్తుంది.

ఇంకా, ఆలస్యం ఎందుకు? మలయి క్రీమ్ టోస్ట్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలేమి? ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ స్వీట్ అండ్ సింపుల్ రెసిపీని అందిస్తున్నాం. పండగ చేసుకోండి.

Malai Cream Toast Recipe కోసం కావలసినవి

4 బ్రెడ్ ముక్కలు

2 టేబుల్ స్పూన్లు వెన్న

4 టేబుల్ స్పూన్లు మలయి (పాల మీగడ క్రీమ్)

4 స్పూన్లు చక్కెర

మలయి క్రీమ్ టోస్ట్ తయారీ విధానం

  1. ముందుగా పాన్‌లో వెన్న వేడి చేయండి. ఆపై కరిగిన వెన్నను పాన్‌పై అన్ని వైపులా విస్తరించండి.
  2. ఇప్పుడు దానిపై బ్రెడ్ స్లైస్‌లను ఉంచి, అవి క్రిస్పీగా బంగారు రంగులోకి మారే వరకు కాల్చండి.
  3. ఇప్పుడు స్టఫ్ ఆఫ్ చేసి బ్రెడ్ ముక్కలపై క్రీమ్ పూయండి, ఆపై కొద్దిగా చక్కెర చిలకరించుకోండి. మీరు కావాలనుకుంటే డ్రైఫ్రూట్స్ కూడా మధ్యలో చల్లుకోవచ్చు.

అంతే ఘుమఘుమలాడే మలయి క్రీమ్ టోస్ట్ రెడీ.. ఆరగిస్తూ వీటి రుచిని ఆస్వాదించండి.

టాపిక్

తదుపరి వ్యాసం