Ice Cream Day |వర్షంలో మిర్చిబజ్జీ ఎవరైనా తింటారు, ఐస్ క్రీమ్ తినేవారే రొమాంటిక్-national ice cream day 2022 have a scoop of ice cream in rain be romantic ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ice Cream Day |వర్షంలో మిర్చిబజ్జీ ఎవరైనా తింటారు, ఐస్ క్రీమ్ తినేవారే రొమాంటిక్

Ice Cream Day |వర్షంలో మిర్చిబజ్జీ ఎవరైనా తింటారు, ఐస్ క్రీమ్ తినేవారే రొమాంటిక్

Manda Vikas HT Telugu
Jul 17, 2022 04:17 PM IST

వర్షాకాలంలో వేడివేడి స్నాక్స్ కాకుండా చల్లచల్లగా ఐస్ క్రీమ్ తినేవారు ఎవరైనా ఉన్నారా? అయితే మీకు ఐస్ క్రీమ్ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ స్టోరీ చదవండి.

<p>Ice Cream Day 2022</p>
Ice Cream Day 2022 (iStock)

వర్షాకాలం వచ్చిందంటే మనకు వర్షంలో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు, పకోడీలు, చెగోడీలు తినాలనిపిస్తుంది. గరమ్ చాయ్ తాగాలనిపిస్తుంది. కానీ వర్షంలో మిరపకాయ బజ్జీలు ఎవరైనా తింటారు. ఐస్ క్రీమ్ తినే వాడే రొమాంటిక్ ఫెల్లో అని ఓ సినిమా కవి అన్నాడు. ఆయన ఏ ఉద్దేశ్యంలో అన్నాడో పక్కనపెడితే మనకు ఈ వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తినడానికి ఈరోజు ఒక సందర్భం అనేది వచ్చింది. అదేంటంటే ప్రతీ ఏడాది జూలై 17న ఐస్ క్రీమ్ డేగా జరుపుకుంటారు. అఫ్ కోర్స్ ఇది యునైటెడ్ స్టేట్స్‌లో జరుపుకునే వేడుకే అయినప్పటికీ ఇతర దేశాలలో కూడా ఇది ట్రెండింగ్ లో ఉంది. మరి మండే ఎండల్లో చల్లచల్లగా లాగించిన ఆ హిమ క్రీములను ఈ చల్లని వర్షాకాలంలో తింటూ మీరూ రొమాంటిక్ ఫెల్లో అనిపించుకోండి.

ఈరోజు ఈ సన్ డే ఇంకా ఐస్ క్రీమ్ డే సందర్భంగా మీకు జస్ట్ 5 నిమిషాల్లో తయారు చేసుకొనే రుచికరమైన సండే (sundae) రెసిపీని అందిస్తున్నాం.

కావాల్సినవి

  • 12 స్ట్రాబెర్రీస్
  • 1/2 కప్పు పిస్తా
  • 700 ml వెనిలా ఐస్ క్రీమ్
  • చాక్లెట్

తయారీ విధానం

1. ఒక జార్‌లో స్ట్రాబెర్రీలు, నీరు వేసి బాగా బ్లెండ్ చేయండి. మందపాటి స్ట్రాబెర్రీ ప్యూరీని తయారు చేయండి.

2. ఒక పారదర్శక గ్లాసులో స్ట్రాబెర్రీ ప్యూరీ వేయండి, ఆ తర్వాత ఐస్ క్రీం దానిపైన చాక్లెట్ వేయండి. ఇది ఇప్పుడు మూడు లేయర్లుగా కనిపిస్తుంది.

3. పైనుంచి కొన్ని పిస్తా పప్పులు చల్లి, ఆపైన కొంచెం ఎక్స్‌ప్రెసో కాఫీని పోయాలి.

అంతే.. చల్ల చల్లగా సర్వ్ చేసుకోండి.

ఐస్ క్రీమ్ తింటే పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి దూరమై మానసికంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇందులోని మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇతర పోషకాలు పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తాయని పోషకాహార నిపుణులు పేర్కొన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం