తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nutmeg Health Benefits | జాజికాయను కూరల్లో వేస్తారు, కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు!

Nutmeg Health Benefits | జాజికాయను కూరల్లో వేస్తారు, కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు!

HT Telugu Desk HT Telugu

08 January 2024, 21:46 IST

google News
    • Nutmeg Health Benefits: మాంసాహార వంటకాలలో మంచి రుచి, ఫ్లేవర్ కోసం జాజికాయ వేస్తారు. ఈ సుగంధద్రవ్యం వివిధ వ్యాధులను నివారించే దివ్యౌషధం కూడా.
Nutmeg Health Benefits
Nutmeg Health Benefits (Freepik)

Nutmeg Health Benefits

జాజికాయను సాధారణంగా మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. మాంసాహార వంటకాలలో జాజికాయ ఉపయోగించడం ద్వారా, ఆ వంటకం మంచి సువాసనతో పాటు, రుచిని పొందుతుంది. కేవలం రుచి, వాసనలే కాదు, జాజికాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జాజికాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మన శరీరానికి తగినన్ని పోషకాలను అందిస్తుంది. జాజికాయలో ఫైబర్, థయమిన్, విటమిన్ బి6, కాల్షియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఆయుర్వేద వైద్యంలో జాజికాయను అనేక వ్యాధుల చికిత్సలలో ఉపయోగిస్తారు. జాజికాయ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, పాంక్రియాటిక్ పనితీరును ఉత్తేజ పరుస్తుందని నివేదికలు తెలిపాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

జాజికాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో, క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి వంటి తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. జాజికాయ నూనెను అనేక దంత ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు.

Nutmeg Health Benefits- జాజికాయతో ఆరోగ్య ప్రయోజనాలు

జాజికాయను ఉపయోగించడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అధిక కొలెస్ట్రాల్ నియంత్రణ

జాజికాయలో అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించే సామర్థ్యం ఉందని వివిధ అధ్యయనాలు రుజువు చేశాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు రెండూ శరీరానికి అవసరమయ్యే కొవ్వులు. అయితే శరీరంలో ఈ కొవ్వులు పెరిగితే మాత్రం అవి రక్తనాళాల్లో పేరుకుపోతాయి. ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వంటల్లో జాజికాయను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

సంతానోత్పత్తి సామర్థ్యం కొరకు

బలహీనమైన లైంగిక శక్తి, వంధ్యత్వ సమస్యలతో బాధపడుతున్న పురుషులకు జాజికాయ చాలా మంచిది. ఇది లైంగిక ప్రేరేపణను మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాల ద్వారా నిరూపితమైంది. జాజికాయలోని మూలకాలు లైంగిక శక్తిని పెంచడమే కాకుండా స్పెర్మ్ కణాల అభివృద్ధికి కూడా సహాయపడతాయి. పురుషులలో నపుంసకత్వము, స్కలనంలో ఇబ్బందులు మొదలైన లైంగిక సమస్యలను ఇది దూరం చేస్తుంది.

మనస్సుకు రిఫ్రెష్‌మెంట్

జాజికాయ మన మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. కొంతమందికి చలికాలంలో నీరసంగా అనిపిస్తుంది. దీన్నే సీజనల్ డిజార్డర్ అంటారు. జాజికాయ తీసుకోవడం వల్ల నీరసం పోయి, మనసుకు ఉల్లాసం కలుగుతుంది. ఇది యాంటీ డిప్రెసెంట్‌గా పని చేయడంతోపాటు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. జాజికాయలో ఉండే 'మిరిస్టిసిన్' అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. జాజికాయ అల్జీమర్స్ వంటి వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.

నొప్పుల నివారిణి

ఆర్థరైటిస్ నొప్పులు, కీళ్ల నొప్పులు మొదలైన దీర్ఘకాలిక నొప్పులు ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తాయి. అయితే జాజికాయ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది తరచుగా ఆహారంలో తీసుకోవడం వలన శరీరంలోని నొప్పులు, మంట, వాపులను తొలగిస్తుంది.

ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ

జాజికాయ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరంలో చొరబడిన హానికర బ్యాక్టీరియా వల్ల ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు సోకుతాయి. జాజికాయను మనం ఆహారంలో చేర్చుకోవడం ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.

తదుపరి వ్యాసం