తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Anti-inflammatory Herbs । శరీరంలో మంట, వాపులను తగ్గించటానికి ఈ 5 తినాలి!

Anti-Inflammatory Herbs । శరీరంలో మంట, వాపులను తగ్గించటానికి ఈ 5 తినాలి!

HT Telugu Desk HT Telugu

20 July 2022, 22:24 IST

    • శరీరంలోపల గానీ, బయటగానీ మంటలు, వాపులతో బాధపడుతున్నారా? మీ వంట గదిలోనే అందుబాటులో ఉండే ఈ 5 సుగంధ ద్రవ్యాలు ఔషధాలుగా పనిచేస్తాయి. వాటిని ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవాలి.
anti-inflammatory herbs
anti-inflammatory herbs (Unsplash)

anti-inflammatory herbs

గాయాలైనపుడు, ఇన్‌ఫెక్షన్లు సోకినపుడు మనం శరీరం ప్రతిస్పందిస్తుంది. ఈ క్రమంలో ప్రభావం ఉన్న చోట మంట, వాపు, నొప్పి అనేది సాధారణంగా ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ అనేది గాయాలతో పోరాడటానికి శరీరం ఎంచుకున్న మార్గం. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ సరైన శ్రద్ద తీసుకోకపోతే కొన్నిసార్లు ఇది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. ఆర్థరైటిస్, సోరియాసిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల ప్రమాదానికి దారితీస్తుంది.

సరైన ఆహారం తీసుకోకపోవటం, ఎటూ కదలకుండా ఒకే చోట నిశ్చమైన జీవనశైలిని కలిగి ఉండటం దీర్ఘకాలికమైన నొప్పులు, వాపులను కలిగిస్తుంది. అదనంగా మద్యం సేవించడం, ధూమపానం అలవాట్లు ఉండటం. ఒత్తిడితో కూడిన జీవనవిధానం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. వాపును పెంచుతాయి. పొత్తికడుపు నొప్పి, ఆయాసం, ఛాతీ నొప్పి, కీళ్ల నొప్పులు, జ్వరం వంటి లక్షణాలు కలుగుతాయి. ఈ తరహా జీవనశైలి ఉబ్బరం, మలబద్ధకం, IBS, అజీర్ణం అలాగే PCOS, తామర, సోరియాసిస్, థైరాయిడ్, హార్మోన్ల రుగ్మతలకు కూడా పరోక్షంగా కూడా కారణమవుతుందని ఆయుర్వేద డాక్టర్ దీక్ష భావ్సర్ పేర్కొన్నారు.

డీప్ ఫ్రైడ్, ప్రాసెస్డ్ ఆహారం, చక్కెర ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా మంట వస్తుంది. అయితే ఇలాంటివి కాకుండా ఆరోగ్యకరమైన పోషకాహారం తినాలి, ఆహారంలో వంట గదిలోనే లభించే కొన్ని రకాల మసాల దినుసులను కలుపుకోవాలని డాక్టర్ దీక్ష సూచిస్తున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి.

పసుపు

సేంద్రియ పసుపులో కర్కుమిన్ సమ్మేళం పుష్కలంగా ఉంటుంది. ఇది ఉత్తమమైన సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ కాంపోనెంట్‌లలో ఒకటి. బయట తగిలిన గాయాలకైనా, అంతర్గతంగా ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కోసం పసుపును పలురకాలుగా తీసుకోవచ్చు, ఉపయోగించవచ్చు.

నల్ల మిరియాలు

గొంతు, ఊపిరితిత్తులు, పేగు, కండరాలు, కీళ్ళు ఇలా వివిధ శరీర భాగాలలో కలిగే మంట, వాపుల నుంచి ఉపశమనం పొందటానికి నల్ల మిరియాలు తీసుకోవాలి. దగ్గు, జలుబు, కీళ్ల నొప్పులు, అనోరెక్సియా మొదలైన వాటికి ఇది మంచి ఔషధం.

అల్లం

పొడి అల్లంను విశ్వభేషజా (యూనివర్సల్ మెడిసిన్) అంటారు. కడుపు ఉబ్బరం, కీళ్ల నొప్పులు, బహిష్టు నొప్పులు ఇలాంటి వాటికి మీకు కావలసిందల్లా అల్లం టీ.

లవంగం

లవంగం గురించి ఒక అందమైన వాస్తవం ఏమిటంటే, ఇది రుచికి కారంగా ఉన్నప్పటికీ, కడుపుకు చల్లదనాన్ని కలిగిస్తుంది. నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పంటి నొప్పి, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు ఏదైనా సరే- లవంగం ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది. బయట నొప్పులకు లవంగం నూనె రాయాలి, అంతర్గత నొప్పులకు లవంగాలతో చేసిన టీ తాగాలి.

మెంతులు

కీళ్ల నొప్పులు, మలబద్ధకం, ఉబ్బరం, బరువు తగ్గడం మొదలైనవాటికి శతాబ్దాల నుండి భారతీయులు మెంతులను ఉపయోగిస్తున్నారు. వేడినీటిలో మెంతులు వేసి, ఆ ఆవిరి పీల్చడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ శ్వాస మార్గంలో మంటను తగ్గిస్తుంది, మీ శ్వాసను మెరుగుపరుస్తుంది.

తదుపరి వ్యాసం