తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Detox Your Body After Festival : పండుగ తర్వాత శరీరాన్ని ఇలా డిటాక్స్ చేసుకోండి..

Detox Your Body After Festival : పండుగ తర్వాత శరీరాన్ని ఇలా డిటాక్స్ చేసుకోండి..

06 October 2022, 11:45 IST

google News
    • Detox Your Body After Festival : అప్పటివరకు ఫిట్​నెస్, జిమ్స్ అంటూ నోటికి కళ్లెం వేసుకున్న వాళ్లు కూడా పండుగ సమయంలో స్వీట్స్, పండుగ స్పెషల్స్ తింటారు. కొందరు దసరా సందర్భంగా నాన్ వెజ్ ఫుడ్ బాగా లాగించేస్తారు. బాడీ మొత్తం ప్యాక్ అయిపోతుంది. అయితే పండుగల తర్వాత శరీరాన్ని ఎలా డిటాక్స్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
శరీరాన్ని ఇలా డిటాక్స్ చేసుకోండి
శరీరాన్ని ఇలా డిటాక్స్ చేసుకోండి

శరీరాన్ని ఇలా డిటాక్స్ చేసుకోండి

Detox Your Body After Festival : నవరాత్రి, దుర్గాపూజ, దసరా పండుగల సమయంలో ఎన్ని వంటకాలు నోరూరిస్తాయో చెప్పలేము. వాటిని చూసి కంట్రోల్​లో ఉండటం కూడా కష్టమే. తెలియకుండానే ఆ వంటలను మనం ఎక్కువగా తీసుకుంటాము. శరీరం సహజంగా నిర్విషీకరణ చేయడానికి ఒక మార్గాన్ని కలిగి ఉంటుంది. అయితే నిర్విషీకరణ కాకపోతే.. శరీరం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమయంలో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. శరీరాన్ని ఎలా డిటాక్స్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్నితీసుకోండి..

ప్రాసెస్ చేసిన చక్కెరను తీసుకోవడం మానేయండి. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా బెల్లం లేదా తేనెను ఎంచుకోవచ్చు. చక్కెరకు బదులుగా ఈ పదార్థాలను జోడించడం వల్ల శరీరానికి హాని కలిగించకుండా తీపిని ఆస్వాదించవచ్చు.

ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోండి..

మీ రోజువారీ ఆహారంలో ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఎందుకంటే వాటిలో ఉండే సూక్ష్మపోషకాలు మీ శరీరాన్ని శుభ్రపరచడానికి.. మీ కాలేయం, మూత్రపిండాలకు మద్దతు ఇస్తాయి. ఇది శరీరంలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.

హైడ్రేటెడ్​గా ఉండండి

తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు తాగడం వల్ల చెమట, మూత్రం ద్వారా మీ శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్‌లను బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి ఇది జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుంది.

తేలికపాటి వ్యాయామాలు

అతిగా తిన్న తర్వాత.. మీరు కొవ్వును తగ్గించుకోవడానికి, వ్యర్థాలను వదిలించుకోవడానికి యోగా లేదా నడక వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం చాలా మంచిది.

పులియబెట్టిన ఆహారాలు తీసుకోండి

పెరుగు, ఊరగాయ వంటి పులియబెట్టిన ఆహారాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. నిర్విషీకరణకు తోడ్పడతాయి. పులియబెట్టిన ఆహారం గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

తదుపరి వ్యాసం