Orange and Carrot Detox Drink : ఈ ఆరెంజ్, క్యారెట్ డిటాక్స్ డ్రింక్ మీకు చాలా మంచిది. ఇది మీ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడమే కాకుండా.. మీకు మంచి స్కిన్, మీ హెయిర్ లాస్‌ను కంట్రోల్ చేస్తుంది. మీ ఎముకలకు కూడా మంచిది. బోన్ సమస్యలతో బాధపడేవారు కూడా దీనిని తరచూ తీసుకోవచ్చు. బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది ఓ చక్కని ఔషదం అని చెప్పవచ్చు. డైలీ ఈ డ్రింక్ తీసుకుంటే ఫలితాలను మీరే స్వయంగా చూస్తారు. అయితే ఈ డిటాక్స్ డ్రింక్ ఎలా తయారు చేయాలో తెలియకపోతే.. ఇది చదివేయండి.
* క్యారెట్ - 1 పెద్దది
* నారింజ - 2
* పసుపు - అర టీస్పూన్
* అల్లం - అర అంగుళం
ఆరెంజ్ జ్యూస్ తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు క్యారెట్‌ను ముక్కలు చేసి బ్లెండర్లో వేయండి. జ్యూస్ అయిందని నిర్ధారించుకున్న తర్వాత.. దానిలో పసుపు, అల్లం వేసి మరోసారి బ్లెండ్ చేయండి. ఇప్పుడు నారింజరసం, నిమ్మకాయ రసం వేసి.. ఫైనల్ జర్క్ ఇవ్వండి. అంతే దీనిని వడకట్టి సర్వ్ చేసుకుని తాగేయండి.
సంబంధిత కథనం