తెలుగు న్యూస్  /  Lifestyle  /  Follow These 6 Simple Tips To Control High Blood Pressure Amid Cold Wave

Tips to control blood pressure: వింటర్‌లో హైబీపీ పెరగకుండా ఉండేందుకు 6 టిప్స్

HT Telugu Desk HT Telugu

16 January 2023, 11:41 IST

  • Tips to control blood pressure: వింటర్‌లో హైబీపీ పెరగకుండా ఉండేందుకు ఈ టిప్స్ పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వింటర్ లో బ్లడ్ ప్రెజర్ పెరగకుండా ఉండేందుకు టిప్స్ తెలుసుకోండి
వింటర్ లో బ్లడ్ ప్రెజర్ పెరగకుండా ఉండేందుకు టిప్స్ తెలుసుకోండి (Freepik)

వింటర్ లో బ్లడ్ ప్రెజర్ పెరగకుండా ఉండేందుకు టిప్స్ తెలుసుకోండి

మీ బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ నార్మల్‌గా ఉండాలంటే వింటర్‌లో లైఫ్‌స్టైల్ మార్పులు తప్పనిసరి అని గుర్తించండి. కదలిక లేని జీవన శైలిని వదిలేయడం మరిచిపోవద్దు. అలాగే కొవ్వు పదార్థాలు పూర్తిగా తగ్గించాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. సూర్యరశ్మి తగిలేలా, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల వింటర్‌లో బ్లడ్ ప్రెజర్ నార్మల్‌గా ఉంటుంది. అలాగే సీజన్‌లో దొరికే పండ్లు, కూరగాయలు కూడా మీ బీపీ నార్మల్‌గా ఉండేలా చేస్తాయి. ఇప్పటికే బ్లడ్‌ప్రెజర్‌ కోసం మెడిసిన్ తీసుకునే వారు క్రమం తప్పకుండా తీసుకోవాలి. వింటర్ సీజన్‌లో వచ్చే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, వంటి అనేక ఉత్సవాల్లో మీ డైట్ దారి తప్పకుండా చూసుకోవాలి. వీటన్నింటికి తోడు మీ వైద్యుడిని వింటర్‌‌లో ఓసారి కన్సల్ట్ అవడం మంచిది.

‘హై బ్లడ్ ప్రెజర్ ఉన్న వారు వింటర్ సీజన్‌లో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో బ్లడ్ ప్రెజర్ సాధారణ సమయంలో కంటే ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి..’ అని రూబీ హాల్ క్లినిక్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అభిజిత్ ఎం దేశ్‌ముఖ్ సూచించారు.

వింటర్‌లో బీపీ పెరగకుండా ఉంటాలంటే ఏం చేయాలి?

వింటర్ సీజన్‌లో బీపీ పెరగకుండా ఉంటాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ అభిజిత్ ఎం దేశ్ ముఖ్ సూచిస్తున్నారు. అవేంటో ఒకసారి పరిశీలించి తప్పక పాటించండి.

1. ఆల్కహాల్, కెఫైన్ తగ్గించాలి

వింటర్ సీజన్‌లో శరీరం వెచ్చదనం కోసం కొందరు ఆల్కహాల్, కెఫైన్‌ను ఆశ్రయిస్తారు. నిజానికి ఈ రెండూ మీ శరీర సాధారణ ఉష్ణోగ్రతలను కోల్పోయేలా చేస్తాయి. ఈ కారణంగా బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. అందువల్ల వీటిని పరిమితం చేయడం అత్యవసరం. తగినంత నీరు తాగడం, పండ్లు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది.

2. జంక్ ఫుడ్‌ అస్సలే వద్దు

వింటర్ సీజన్‌లో ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లొద్దు. దీని కారణంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. కొలెస్ట్రాల్ హైబ్లడ్ ప్రెజర్‌కు దారితీస్తుంది.

3. తగిన దుస్తులు అవసరం

శరీరం వెచ్చదనం కోల్పోకుండా ఉండేలా తగిన దుస్తులు ధరించాలి. లేదంటే హై బ్లడ్ ప్రెజర్‌కు దారితీస్తుంది.

4. వ్యాయామం

క్రమం తప్పకుండా రోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. శారీరకంగా చురుగ్గా ఉంటే హై బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‌లో ఉంటుంది.

5. విటమిన్ డీ అవసరం

వింటర్ సీజన్‌లో సూర్యరశ్మి తగినంత సోకనందున శరీరంలో విటమిన్ డీ లోపం ఏర్పడుతుంది. ఇది కూడా హై బ్లడ్ ప్రెజర్‌కు దారితీస్తుంది.

6. వాతావరణ కాలుష్యం నుంచి రక్షించుకోండి.

తీవ్రమైన కాలుష్యం శరీరంలో ఎండోథీలియం హార్మోన్ విడుదల చేస్తుంది. దీని వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. అందవల్ల వాతావరణ కలుషితంగా ఉండే ప్రాంతాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి.

మరిన్ని వార్తలకు https://telugu.hindustantimes.com/ సందర్శించండి.

టాపిక్