తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips For Sleeping : వెంటనే నిద్రపోవాలా? అయితే ఈ 5 అలవాట్లు చేసుకోండి

Tips For Sleeping : వెంటనే నిద్రపోవాలా? అయితే ఈ 5 అలవాట్లు చేసుకోండి

Anand Sai HT Telugu

03 February 2023, 20:20 IST

    • Tips For Good Sleep : కొంతమందికి ఎంత ప్రయత్నించినా నిద్రరాదు. అటు ఇటు తిరిగి.. టైమ్ చూస్తూ ఉంటారు. అస్సలు నిద్ర పట్టక.. ఇక ఫొన్ పట్టుకుంటారు. అది కాస్త ఇంకా నిద్రను దూరం చేస్తుంది. అయితే కొన్ని అలవాట్లను నేర్చుకుంటే.. ఈజీగా నిద్రపట్టేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వృత్తిపరమైన జీవితంలో ఒత్తిడి, రోజంతా ఆందోళనలు మనిషిని నిద్రలేకుండా చేస్తున్నాయి. ఆరోగ్యవంతమైన జీవితానికి తగినంత నిద్ర చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల మీకు కూడా తగినంత నిద్ర ఉండదు. సరిగా నిద్ర రాకుంటే.. రాత్రి పడుకునే ముందు ఐదు ముఖ్యమైన పనులను చేయండి. నిత్యజీవితంలో ఈ తప్పనిసరి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మంచి నిద్రను పొందగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.

పడుకునే ముందు తప్పనిసరిగా ఒక గ్లాసు పాలు తాగాలని వైద్యులు చెబుతున్నారు. ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ పాలలో ఉంటుంది. ఇది రోజు అలసటను పోగొట్టి బాగా నిద్రించడానికి సహాయపడుతుంది.

రాత్రి పడుకునే ముందు అరికాలిపై 2 నుంచి 5 నిమిషాల పాటు లైట్ గా మసాజ్ చేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరికాళ్ల ఆక్యుప్రెషర్ పాయింట్లపై ఆయిల్ మసాజ్ చేయడం వల్ల చాలా రిలీఫ్ లభిస్తుంది. మంచి నిద్ర వస్తుంది.

నైట్ డిన్నర్‌లో హెవీ కార్బోహైడ్రేట్లను తీసుకోవడం మానుకోండి. భారీ ఆహారం జీర్ణక్రియకు భంగం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా ఉండాలంటే.. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకున్న తర్వాతే నిద్రపోవాలి.

రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది. దీంతో రోజంతా అలసట తొలగిపోయి మైండ్‌ ఫ్రెష్‌గా మారుతుంది. మీరు స్నానం చేసి నిద్రిస్తే.. ప్రశాంతంగా ఉంటుంది.

మీరు రాత్రి పడుకున్న వెంటనే మీ ఫోన్, ల్యాప్‌టాప్, టీవీని ఆఫ్ చేయండి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకునేందుకు అవకాశం ఇవ్వండి. మెదడులోని ఆలోచనలతోనే నిద్రకు భంగం కలుగుతుంది. అందుకే ఏం ఆలోచనలు పెట్టుకోకుండా నిద్రపోతే.. మరుసటి రోజు ఉత్సహాంగా ప్రారంభిస్తారు.

తదుపరి వ్యాసం