తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Tips । నిద్రించటానికి సరైన సమయం ఏది..? ఎవరికి ఎన్ని గంటల నిద్ర అవసరం?

Sleeping Tips । నిద్రించటానికి సరైన సమయం ఏది..? ఎవరికి ఎన్ని గంటల నిద్ర అవసరం?

HT Telugu Desk HT Telugu

08 September 2022, 23:24 IST

    • సరైన సమయంలో నిద్రపోతే నిద్రలేమి సమస్యలు ఉండవు. తగినంత నిద్ర ఉంటే అనారోగ్య సమస్యలు ఉండవు. వయసు ప్రకారంగా ఎవరు ఎప్పుడు నిద్రపోవాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసుకోండి.
Sleeping Tips
Sleeping Tips (Unsplash)

Sleeping Tips

రాత్రివేళ సరైన నిద్రలేకపోతే అది పిల్లలకైనా, పెద్దలకైనా చాలా చికాకుగా ఉంటుంది. కాళ్లపై భారం పడినట్లుగా మంటగా అనిపిస్తోంది. ప్రశాంతంగా ఆలోచించలేకపోతారు, పనుల్లో ఏకాగ్రత ఉండదు. నిద్రలేమి సమస్య ఈరోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఇందుకు వారి అలవాట్లే కారణం. వరుసగా మూడు రోజుల పాటు నిద్రలేకపోతే అది అనేక దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. అందుకే తగినంత నిద్ర ప్రతీ వ్యక్తి అవసరం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

నిద్రలేమి పరిస్థితులు అధిగమించటానికి సరైన నిద్ర ప్రణాళికను పాటించాలి. ప్రతిరోజూ రాత్రి నిద్రించటానికి ఒక నిర్ధిష్ట సమయం అంటూ ఉండాలి. అలాగే ఎన్ని గంటలు నిద్ర అవసరమో కూడా తెలిసి ఉండాలి. వయసును బట్టి వ్యక్తులకు నిద్రించే సమయం ఎంత ఉండాలి, రోజుకి కనీసం ఎన్ని గంటలు నిద్ర ఉండాలి అనేది నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఏ వయసు వారు, ఏ సమయానికి నిద్రపోవాలో తెలియజేస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

నిద్రించడానికి సరైన సమయం ఏది?

  • Best Time To Go to Sleep : శిశువులు రాత్రి 7:00 నుండి 8:00 గంటల మధ్య నిద్రపోవాలి.
  • 4 నుండి 11 నెలల పిల్లలకు సాయంత్రం 7:00 నుండి 9:00 గంటల మధ్య.
  • 12 నుండి 35 నెలల పిల్లలు 8:00 నుండి 9:00 గంటల మధ్య.
  • అదే సమయంలో, పాఠశాలకు వెళ్లే పిల్లలు రాత్రి 8:00 నుండి 9:00 గంటలలోపు పడుకోవాలి.
  • టీనేజర్లు రాత్రి 9:00 నుండి 10:00 గంటల మధ్య పడుకోవడానికి ప్రయత్నించాలి.
  • పెద్దలు రాత్రి 10:00 నుండి 11:00 గంటల లోపు నిద్రపోవడానికి ప్రయత్నించాలి.

ఒక వ్యక్తి ఏ వయస్సులో ఎన్ని గంటలు నిద్రించాలి?

  • Hours of Sleep Required by Age: 0 నుండి 3 నెలలు - చిన్న నిద్రలతో సహా రోజుకు 14 నుండి 17 గంటల పాటు నిద్రపోవడం అవసరం.
  • 4 నుండి 11 నెలల వరకు - చిన్న నిద్రలతో సహా. 12 నుండి 15 గంటల నిద్రపోవాలి.
  • 12 నుండి 35 నెలలు- 11 నుండి 14 గంటల పాటు నిద్రపోవాలి.
  • 3 నుండి 5 సంవత్సరాలు - రోజూ దాదాపు 10 నుండి 13 గంటల పాటు నిద్రపోవాలి.
  • 6 నుండి 13 సంవత్సరాలు - రోజూ దాదాపు 9 నుండి 11 గంటల పాటు నిద్రపోవాలి.
  • 14 నుండి 17 సంవత్సరాలు - రోజుకు 8 నుండి 10 గంటలు.
  • 18 నుండి 25 సంవత్సరాలు - రోజుకు 7 నుండి 9 గంటలు.
  • 26 నుండి 64 సంవత్సరాలు - రోజుకు 7 నుండి 9 గంటలు.
  • 65 మరియు అంతకంటే ఎక్కువ - రోజుకు 7 నుండి 9 గంటలు.

ఇక్కడ ఇచ్చిన సమాచారం మేరకు మీ వయసు ప్రకారంగా మీరు ఏ సమయంలో నిద్రపోవాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలో మీరే నిర్ణయించుకోండి.Sleeping Tips

తదుపరి వ్యాసం