Binaural Music Beats | హాయిగా నిద్రపోవాలంటే ఇలాంటి ప్రశాంతమైన మ్యూజిక్ వినండి!
బైనారల్ మ్యూజిక్ బీట్స్ వినడం ద్వారా హాయిగా నిద్రపోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు? ఇంతకీ ఈ మ్యూజిక్ ఏంటి? మ్యూజిక్ థెరపీతో కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.
రోజంతా పనిచేసి అలసిపోయిన తర్వాత మనకు మంచి నిద్ర అవసరం. ప్రశాంతంగా నిద్రపోవడానికి కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్రరాకపోవచ్చు. కానీ సంగీతానికి ఆ శక్తి ఉంది. మీరు ఎలాంటి వాతావరణాన్నైనా ఆహ్లాదకరంగా మార్చాలనుకుంటే సంగీతం ఒక్కటే సాధనం. ఇది మీ మానసిక స్థితిని మార్చగలదు, మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మనం గమనించకపోవచ్చు కానీ సంగీతం మన మనస్సుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మధురమైన సంగీతం మీ మెదడులో ఎండార్ఫిన్‌లను విడుదల చేయడమే దీనికి కారణం.
స్లో టెంపోతో సాగే శ్రావ్యమైన ఇన్స్ ట్రుమెంటల్ మ్యూజిక్ ద్వారా మీ అలసట దూరం అవుతుంది. మీ ఒత్తిడి, ఆందోళన తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటారు. దీంతో మీరు హాయిగా నిద్రపోవచ్చు.
అంతేకాదు మ్యూజిక్ థెరపీతో నొప్పులు, బాధల నుంచి కూడా ఉమశమనం లభిస్తుంది. ఎంతగా అంటే ప్రసవ నొప్పిని (ప్రసవ నొప్పిపై సంగీత ప్రభావం) తట్టుకోవడంలో ఇది మీకు సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతేనా? వెన్నెముఖ సర్జరీ చేయించునే రోజులకు సర్జరీకి ముందురోజు మంచి మ్యూజిక్ వినాలని సిఫారసు చేస్తారు. సర్జరీ అనంతర నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ మ్యూజిక్ థెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ సిండ్రోమ్ (PTSD) బాధపడుతున్న వారికి, మానసిక ఆరోగ్యం మెరుగుపరచటానికి మ్యూజిక్ థెరపీ సహాయపడుతుంది.
బైనారల్ సంగీతంతో సుఖమయ నిద్ర
చాలా మంది నిద్రలేమితో బాధపడేవారు బైనారల్ మ్యూజిక్ (Binaural Beats) వినడం ద్వారా గొప్ప ఉపశమనం పొందుతుబుతున్నట్లు చెబుతున్నారు. మనం ఏదైనా అద్భుత దృశ్యాన్ని చూసినపుడు ఇది నిజమా, భ్రమ అనే అనుభూతి కలుగుతుంది. అలాగే బైనారల్ సంగీతంపై మెదడుపై ఇలాంటి ప్రభావాన్నే చూపుతుంది. బైనరల్ సంగీతం అనేది ఒక ఆడియో భ్రమ. ఇది విభిన్న పౌనఃపున్యాలు (Frequencies) కలిగిన రెండు ధ్వని తరంగాలు కలిసి ఒక కొత్త ఫ్రీక్వెన్సీలో విలీనం అవుతాయి. దీంతో ఇలాంటి మ్యూజిక్ వింటున్న వారికి వివిధ దిశల నుండి ధ్వని కారణంగా ప్రత్యక్ష ప్రదర్శన చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ తరహా సంగీతం ధ్యానం చేసిన అనుభూతిని, మనసుకు తేలికత్వాన్ని కలిగిస్తుంది.
ఈ బైనారల్ సంగీతంలో భాగంగా పక్షుల కిలకిలరావాలు, జలపాతాలు, మృదుగా వీచే పిల్లగాలులు మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. తద్వారా మనసుకు ప్రశాంతత చేకూరి ఏదో ఊహాలోకంలోకి వెళ్లినట్లు, మైకం కమ్మినట్లుగా అవుతుంది. మెల్లిగా నిద్రలోకి జారుకుంటారు.
యూట్యూబ్ లో మీకు ఎన్నో రకాల బైనారల్ మ్యూజిక్ ఆడియో వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అందులో మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకొని అప్పుడప్పుడూ వింటూ ఉండండి.
Music for good sleep
సంగీతం మనల్ని రిఫ్రెష్ చేయడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది మీకు ఒత్తిడి, కోపం, నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్