Sambar Upma: రవ్వ ఉప్మా తినీ తినీ బోర్ కొట్టిందా..? ఇలా సాంబారు ఉప్మా ట్రై చేసి చూడండి కచ్చితంగా నచ్చుతుంది
23 December 2024, 6:30 IST
- Sambar Upma: రవ్వ ఉప్మా ఎప్పుడూ చేసుకునేదే. చాలా మందికి ఇది బోర్ కొట్టేసి ఉంటుంది. ఈ సారి కొత్తగా పిల్లలు బాగా ఇష్టంగా తినే సాంబారు ఉప్మా ట్రై చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఇది నచ్చుతుంది. సాంబారు ఉప్మా రెసిపీని ఇక్కడ తెలుసుకోవచ్చు.
రవ్వ ఉప్మా తినీ తినీ బోర్ కొట్టిందా..? ఇలా సాంబారు ఉప్మా ట్రై చేసి చూడండి
ఈజీ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీలలో ఉప్మా అన్నింటి కన్నా ముందుంటుంది. కానీ ఇది చాలా మందికి నచ్చదు. రవ్వ ఉప్మా తినీ తినీ బోర్ కొట్టిన వారు గోధమపిండితో ఇలా సాంబారు ఉప్మాను ఓ సారి ట్రై చేయండి.ఈ ఉప్మా చాలా ఈజీగా తొందరగా అవడమే కాదు.. హెల్తీగా, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. పిల్లలైతే ఇంకా ఇంకా తినాలనుకుంటారు. ఆలస్యం చేయకుండా సాంబారు ఉప్మాకు కావాల్సిన పదార్థాలేంటో.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..
సాంబారు ఉప్మాకు కావాల్సిన పదార్థాలు:
గోధుమ రవ్వ - ఒక కప్పు
నీరు- మూడు కప్పులు
నూనె- నాలుగు టీ స్పూన్లు
నెయ్యి- రెండు టీ స్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడినంత
శనగపప్పు- ఒక టీ స్పూన్
మినపపప్పు- ఒక టీ స్పూన్
ఆవాలు- అర టీ స్పూన్
జీలకర్ర- అర టీ స్పూన్
పోపు దినుసులు- తాళింపుకు సరిపడా
ఇంగువ- పావు టీ స్పూన్(ఇష్టపడని వారు స్కిప్ చేయచ్చు)
పచ్చిమిరపకాయలు- మూడు పచ్చిమిరపకాయలు
ఉల్లిపాయ- ఒకటి
బఠాణీ- పావు కప్పు
క్యారెట్ ముక్కలు- రెండు టీ స్పూన్లు
క్యాప్సికమ్ ముక్కలు- రెండు టీ స్పూన్లు
బంగాళాదుంప- ఒకటి
టమాటాలు-మూడు
పసుపు- పావు టీ స్పూన్
కారం- ఒక టీ స్పూన్
సాంబారు పొడి- ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర- గార్నిష్ కోసం మీకు నచ్చినంత
సాంబారు ఉప్మా తయారీ విధానం:
- ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకుని మీడియం ఫ్లేములో మూడు నాలుగు నిమిషాల పాటు వేయించండి. రవ్వ రంగుమారిన తర్వాత తీసి పక్కక్కు పెట్టుకోండి.
- చల్లారిన తర్వాత వేయించుకున్న రవ్వను శుభ్రంగా నీటితో కడగండి.
- ఇప్పుడు కుక్కర్లో ఒక మూడు కప్పుల వాటర్ తీసుకుని ముందుగా వేయించుకున్న రవ్వను దాంట్లో వేసి కలపండి.
- ఇందులోనే ఒక టీస్పూన్ ఆయిల్, అర టీ స్పూన్ ఉప్పు వేసి ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా రవ్వను ఉడికించాలి.
- కుక్కర్లో కాకుండా నార్మల్ గా కూడా రవ్వను ఉడికించుకోవచ్చు.
- ఇప్పుడు వేరొక పాన్ లోకి రెండు మూడు టీస్పూన్ల ఆయిల్ ని, అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి.
- అవి కాస్త వేడయ్యాక అందులో ఒక శెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వంటి పోపు దినుసులు వేసి ఫ్రై చేయండి.
- ఇందులో పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేయండి. ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్లు స్కిప్ చేసేయచ్చు.
- తరువాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి.
- ఇప్పుడు దీంట్లోనే బఠాణీ వేసి వేయించుకోండి.
- తరువాత క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బంగాళదుంప ముక్కులు వేసి వేయించండి.
- ఇప్పుడు టమాటాలను మిక్సీలో గ్రైండ్ చేసి దీంట్లో వేసి వేయించాలి.
- టమాటాలు వేగిన తర్వాత పసుపు, కారం, రుచికి సరిపడ ఉప్పు వేసి కలపండి.
- ఇందులోనే ఒక పావు కప్పు నీళ్లను వేసి ఏడెనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి.
- నీళ్లు కాస్త మరిగిన తర్వత దాంట్లో ముందుగా ఉడికించి పక్కక్క పెట్టుకున్న రవ్వను తీసుకుని బాగా మిక్స్ చేయండి.
- ఆ తర్వాత ఇందులో సాంబార్ పొడి వేయండి.
- ఆ తర్వాత గిన్నె లేదా కుక్కర్ మీద మూత ఉంచి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించండి.
- చివరిగా ఒక టీ స్పూన్ నెయ్యిని, అలాగే తరిగిన కొత్తిమీరని వేసి కలపి స్టవ్ ఆఫ్ చేయండి.
అంతే టేస్టీ టేస్టీ సాంబార్ ఉప్మా రెడీ అయినట్టే సర్వ్ చేసుకుని తినేయచ్చు.