బరువు తగ్గేందుకు కొందరు ప్రత్యేకంగా తమ కోసం డైట్ ప్లాన్ నిర్దేషించుకుంటారు. దాన్నే పాటిస్తూ వెయిట్ లాస్‍లో సక్సెస్ అవుతారు. తులసి నితిన్ అనే డైట్ కోచ్ కూడా ప్రత్యేకమైన డైట్ ప్లాన్ పాటించి బరువు తగ్గారు. ఏకంగా 30 కేజీల వెయిట్ లాస్ అయ్యారు. ఈ విషయాన్ని ఇన్‍స్టాగ్రామ్ ద్వారా ఆమె వెల్లడించారు. ఈ వెయిట్ లాస్ జర్నీలో తాను ప్రతీ రోజు ఏం తిన్నానో వివరంగా షేర్ చేశారు.
బరువు తగ్గాలంటే ఏం తినాలనే సందేహంగా ఉన్న వారు తమ శరీరానికి సరిపడే డైట్ ప్లాన్ కోసం న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించాలని తులసి నితిన్ సూచించారు. పోషకాలు, టేస్ట్, ఫిట్‍నెస్‍ను సమతుల్యం చేసుకోవాలనుకుంటే అలా చేయాలన్నారు. తాను పాటించిన డైట్‍ను చెబుతున్నానని ఆమె షేర్ చేశారు. కొన్ని టిప్స్ చెబుతూనే.. తాను ప్రతీ రోజు ఏం తిన్నానో వెల్లడించారు.
బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారు ఇంట్లో వండినవే తినాలని సూచించారు. “వంటకాల్లో వీలైనంత తక్కువగా నూనె లేదా వెన్నె వేసుకోవాలి. చెక్కర, ఉప్పు ఎంత తగ్గిస్తే ఆరోగ్యానికి అంత మంచిది. ఆహారమంతా ఇంట్లోనే వండుకోవాలి. అనారోగ్యకరమైన వాటి వైపు చూడకుండా ముందుగానే మీల్స్, స్నాక్స్ రెడీ చేసిపెట్టుకోవాలి. మాక్రోన్యూట్రియంట్స్ (ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బ్స్), మైక్రోన్యూటియంట్స్ (విటమిన్లు, మినరల్స్) సహా నీరు ఎక్కువగా తీసుకోడం లక్ష్యంగా పెట్టుకోవాలి” అని తులసి నితిన్ చెప్పారు.
గమనిక: బరువు తగ్గేందుకు తాను పాటించిన డైట్‍ను ఆ మహిళ చెప్పిన విషయాలు ఈ కథనంలో ఇచ్చాం. అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు. అందుకే, బరువు తగ్గాలనుకునే వారు వారి శరీర పరిస్థితి, ఆరోగ్యం, ఫిట్‍నెస్, పరిస్థితులు, ఇష్టాలను బట్టి డైట్, వ్యాయామాలు ప్లాన్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలని నిర్ణయించుకుంటే ఫిట్‍నెస్ నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకుంటే మేలు.