వేసవిలో బరువు తగ్గేందుకు తోడ్పడే 5 రకాల కూరగాయలు ఇవి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Apr 15, 2024
Hindustan Times Telugu
బరువు తగ్గాలనుకునే వారు సీజన్‍ను బట్టి వారి ఆహారంలో కూరగాయలను తీసుకోవాలి. వేసవిలో వాటర్ కంటెంట్ ఉండే కూరగాయాలను డైట్‍లో తప్పకతీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు వేసవిలో తీసుకోవాల్సిన 5 రకాల కూరగాయాలు ఇవే.
Photo: Pexels
సొరకాయలో వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే ఈ కూరగాయను తింటే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
Photo: Pexels
కీరదోసల్లో 96శాతం వాటర్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే వెయిట్ లాస్‍కు తోడ్పడుతుంది. అలాగే, వేసవిలో హైడ్రేటెడ్‍గా ఉండేందుకు ప్రతీ రోజు కీరదోస తినడం చాలా మంచిది.
Photo: Pexels
టమాటాల్లో విటమిన్ సీ, వాటర్ కంటెంట్ సహా చాలా పోషకాలు ఉంటాయి. టమాటాలు తినడం వల్ల బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.
Photo: Pexels
ఫైబర్ ఎక్కువగా ఉండే క్యాబేజీ, బ్రకోలీ, పాలకూర లాంటి గ్రీన్ వెజిటబుల్‍లను ప్రతీ రోజు డైట్‍లో తీసుకుంటే మేలు. ఇవి తినడం వల్ల శరీరానికి చాలా పోషకాలు అందడంతో పాటు బరువు తగ్గేందుకు ఉపకరిస్తాయి.
Photo: Pexels
క్యాప్సికం కూడా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఇది జీవక్రియను మెరుగుపరిచి కొవ్వును తగ్గించగలదు.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి