Capsicum Gravy : క్యాప్సికమ్ గ్రేవీ ఇలా చేశారంటే.. వదలకుండా తింటారు
Capsicum Gravy Recipe : క్యాప్సికమ్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనితో కర్రీ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ గ్రేవీ రెసిపీని ఇంట్లోనే తయారుచేసుకోండి. లొట్టలేసుకుంటూ తింటారు.
ఇంట్లో ఎప్పుడూ ఒకే రకమైన కర్రీలు ఉంటే బోర్ కొడుతుంది కదా. అందుకే అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్లు కూడా ఖుషీ అయిపోతారు. డిఫరెంట్‌గా రెసిపీలు తయారు చేయండి. ఆనందంగా తింటారు. చపాతీ, రైస్ లోకి క్యాప్సికమ్ గ్రేవీని ప్రిపేర్ చేయండి. చపాతీలోకి ఎప్పుడూ కూర్మ చేసే బదులుగా క్యాప్సికమ్ గ్రేవీని చేస్తే ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అన్నంలోకి కూడా దీనిని తినొచ్చు. ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ. క్యాప్సికమ్ గ్రేవీ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా?
క్యాప్సికమ్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు
నూనె - 2 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ - 4 (చతురస్రాకారంలో కట్ చేయాలి), జీలకర్ర - 1/2 టీస్పూన్, బిర్యానీ ఆకులు - 2, పెద్ద ఉల్లిపాయ - 2 (సన్నగా తరిగినవి), ఎండు మిర్చి-2, అల్లం అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్, టొమాటోలు - 2 (సన్నగా తరిగినవి), శనగ పిండి - 1 టేబుల్ స్పూన్, కారం - 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్, పసుపు పొడి - 1 చిటికెడు, గరం మసాలా - 1/2 tsp, ఉప్పు - అవసరమైనంత పరిమాణం, పెరుగు - 3 టేబుల్ స్పూన్లు, నీరు - కావలసిన పరిమాణం, కసూరి మేతి - కొద్దిగా
క్యాప్సికమ్ గ్రేవీ తయారీ విధానం
మెుదట ఓవెన్‌లో బాణలి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసి 2 నిమిషాలు వేయించి ప్లేట్‌లోకి తీసుకుని ఉంచుకోవాలి.
తర్వాత అదే బాణలిలో మిగిలిన నూనెలో జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసి తాలింపు వేయాలి.
ఇప్పుడు అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తర్వాత టొమాటోలు వేసి మెత్తగా వేయించాలి.
టొమాటోలు ఉడికే ముందు మరో ఓవెన్‌లో బాణలి వేడి చేసి అందులో శనగ పిండి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
టమాటాలు బాగా వేగిన తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు, వేయించిన శెనగపిండి వేసి బాగా కలుపుకోవాలి.
గ్రేవీకి కావల్సినంత నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుతూ 2 నిమిషాలు మరిగించాలి.
తర్వాత వేయించిన మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి 5 నిముషాలు బాగా మరిగించుకోవాలి.
పైన కసూరి మెంతిని వేసుకుని.. తిప్పితే రుచికరమైన క్యాప్సికమ్ గ్రేవీ రెడీ.