తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eveium నుంచి ఆకర్షణీయమైన మూడు ఎలక్ట్రిక్ స్కూటర్‌లు విడుదల, Czar లుక్ అదిరింది!

Eveium నుంచి ఆకర్షణీయమైన మూడు ఎలక్ట్రిక్ స్కూటర్‌లు విడుదల, Czar లుక్ అదిరింది!

HT Telugu Desk HT Telugu

19 July 2022, 17:26 IST

    • Eveium అనే EV బ్రాండ్ నుంచి ఆకర్షణీయమైన మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో విడుదలయ్యాయి. వీటి ధరలు రూ, 1.44 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. వీటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.
Eveium Czar
Eveium Czar

Eveium Czar

ఎలీజియం ఆటోమోటివ్స్‌కు చెందిన EV బ్రాండ్ Eveium తాజాగా Cosmo, Comet అలాగే Czar అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద వీటి ధరలు వరుసగా రూ. 1.44 లక్షలు, రూ. 1.92 లక్షలు అలాగే రూ. 2.16 లక్షలుగా ఉన్నాయి. ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. EVeium డీలర్‌షిప్‌లలో రూ. 999 టోకెన్ ధర చెల్లించి ఈ సరికొత్త ఇ-స్కూటర్‌లను బుక్ చేసుకోవచ్చు.

మూడింటిలో బేసిక్ మోడల్ అయినటువంటి Cosmo ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిశీలిస్తే, ఇది 2000W మోటార్‌తో వస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 65 kmph వేగంతో 80 km రేంజ్‌ని అందిస్తుంది. స్కూటర్ లోని 30Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ 4 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. Cosmo మోడల్ బ్రైట్ బ్లాక్, చెర్రీ రెడ్, లెమన్ ఎల్లో, వైట్, బ్లూ, గ్రే అనే ఐదు రంగులలో లభిస్తుంది.

<p>Eveium Cosmo</p>

Eveium కామెట్ అనేది మిడ్-రేంజ్ మోడల్. ఇందులో 3000 W మోటార్‌ను అమర్చారు. ఇది 50Ah బ్యాటరీతో శక్తి పొందుతుంది. కంపెనీ ప్రకారం ఈ స్కూటర్ గరిష్టంగా 85 kmph వేగంతో సుమారు 150 కిమీ పరిధిని అందిస్తుంది. దీని బ్యాటరీని కూడా 4 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. Comet మోడల్ షైనీ బ్లాక్, మాట్ బ్లాక్, వైన్ రెడ్, రాయల్ బ్లూ, లైట్ బ్రౌన్, వైట్ వంటి ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

<p>Eveium Comet</p>

ఇక టాప్-స్పెక్ మోడల్ అయినటువంటి Czarలో శక్తివంతమైన 4000 W మోటార్‌ను అమర్చారు. ఇది 42Ah బ్యాటరీతో శక్తి పొందుతుంది

ఈ మోడల్ కూడా కామెట్ మోడల్ మాదిరిగానే 85 kmph గరిష్ట వేగంతో 150 కిమీ పరిధిని అందిస్తుంది. అయితే ఇది వేగవంతమైన పికప్ కలిగి ఉండవచ్చు. దీని బ్యాటరీని కూడా 4 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. Czar స్కూటర్ గ్లాసీ బ్లాక్, మ్యాట్ నలుపు, గ్లాసీ రెడ్, లైట్ బ్లూ, మింట్ గ్రీ, ఇంకా వైట్ వంటి ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఈ మూడు స్కూటర్ మోడళ్లలో ఎకో, నార్మల్ అలాగే స్పోర్ట్ వంటి మూడు డ్రైవ్ మోడ్‌లు ఉంటాయి. అయితే Comet , Czar మోడళ్లలో అదనంగా రివర్స్ మోడ్‌ కూడా ఉంది.

మిగతా అంశాలను పరిశీలిస్తే Cosmo, Comet , Czarలలో కీలెస్ స్టార్ట్, యాంటీ-థెఫ్ట్ ఫీచర్, LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్, మొబైల్ కనెక్టివిటీ, ఫైండ్ మై వెహికల్ ఫీచర్, రియల్ టైమ్ ట్రాకింగ్, ఓవర్-స్పీడ్ అలర్ట్, జియోఫెన్సింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాపిక్