Egg Paratha Recipe । ఇది ప్రోటీన్లతో నిండిన బ్రేక్‌ఫాస్ట్.. టేస్ట్‌లోనూ బెస్ట్!
13 October 2022, 8:08 IST
- బ్రేక్‌ఫాస్ట్ లోకి త్వరగా, రుచికరంగా చేసుకోవాలంటే ఎగ్ పరాఠా కూడా ఒక మంచి ఆప్షన్. కేవలం 10- 15 నిమిషాల్లోనే ఈ వంటకం రెడీ అయిపోతుంది. Egg Paratha Recipe ఇక్కడ చూడండి.
Egg paratha
చాలా సందర్బాల్లో ఉదయం పూట అల్పాహారం కోసం ఏం సిద్ధం చేయాలో తోచదు. ఇలాగే సమయం గడిచిపోతూ ఉంటుంది. మీరు అప్పటికప్పుడే చేసుకోగలిగే ఎన్నో రుచికరమైన అల్పాహారాలు చాలానే ఉన్నాయి. ఒకసారి ఎగ్ పరాఠా ప్రయత్నించి చూడండి. ఈ ఎగ్ పరాఠా చాలా తేలికగా రెడీ అయిపోతుంది, ఎంతో రుచికరంగానూ ఉంటుంది.
ఇది ప్రోటీన్ కలిగిన ఆహారం. ఉదయాన్నే ఎగ్ పరాఠా తింటే మీకు మంచి శక్తి లభిస్తుంది. రోజంతా కూడా చురుకుగా పనిచేయగలుగుతారు.
కేవలం 15 నిమిషాల్లోనే రుచికరంగా ఎగ్ పరాఠా ఎలాచేసుకోవాలో ఇక్కడ రెసిపీ అందిస్తున్నాం. రెసిపీలోకి వెళ్లే ముందు, ఈ ఎగ్ పరాఠా చేయటానికి కాలవలిసిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకోండి.
Egg Paratha Recipe కోసం కావలసినవి
- 2 కప్పులు మొత్తం గోధుమ పిండి
- చిటికెడు ఉప్పు
- 1 టేబుల్ స్పూన్ నూనె
- 2 గుడ్లు
- 1 ఉల్లిపాయ
- 1 పచ్చిమిర్చి
- తాజా కొత్తిమీర
- 1/2 స్పూన్ గరం మసాలా
ఎగ్ పరాఠా తయారీ విధానం
- ముందుగా ఒక గిన్నెలో పిండి, ఉప్పు, నూనె వేయండి. ఆపై 1 కప్పు నీటిని కలిపి ఈ మిశ్రమాన్ని మెత్తగా పిండి ముద్దగా చేయండి. పొడిగా ఉంటే మరికొంత నీరు పోసి పిండి ముద్ద మెత్తగా అయ్యేలా చూసుకోండి.
- ఇప్పుడు పిండిముద్దను చిన్నచిన్న బంతులుగా విభజించి, పరాఠా ఆకృతిలో రోల్ చేయండి.
- మరోవైపు ఒక గిన్నెలో గుడ్లను గిలక్కొట్టి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు పెనంపై కొద్దిగా నూనె వేడిచేసి పరాఠాలను కాల్చండి. కత్తిని ఉపయోగించి పరాఠాకు గాట్లు చేయండి. ఆపై గుడ్డు మిశ్రమాన్ని వేయండి. పైనుంచి కొద్దిగా నూనె చిలకరించండి.
- ఇప్పుడు మరోవైపు పరోటాను కాల్చండి, అంచులు క్రిస్పీగా అయ్యేవరకు పరాఠా కాల్చండి.
అంతే, ఎగ్ పరాఠా రెడీ అయినట్లే సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మంచి చాయ్ తాగుతూ ఈ పరోటా రుచిని ఆస్వాదించండి.