Peanut Butter Smoothie Recipe : పీనట్ బటర్ స్మూతీ.. ఇది ఈజీ & హెల్తీ రెసిపీ
Peanut Butter Smoothie Recipe : ఆరోగ్యం, ఫిట్నెస్ మీద శ్రద్ధ చూపించే చాలామంది పీనట్ బటర్ని తమ డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే మీరు ఈ పీనట్బటర్తో ఓ అందమైన, టేస్టీ స్మూతీని తయారు చేసుకోవచ్చు తెలుసా? పైగా దాని రుచి మీ బ్రేక్‌ఫాస్ట్‌ని హైలైట్ చేస్తుంది. మరి దానిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.
Peanut Butter Smoothie Recipe : పీనట్ బటర్ రుచికరమైన క్రీమ్ అని చెప్పవచ్చు. దీనిని బ్రెడ్స్‌తో లేదా ఎనర్జీ డ్రింక్స్‌తో కలిపి తీసుకుంటాము. ఎందుకంటే ఇది మాంసకృతులతో నిండి ఉంటుంది కాబట్టి. అయితే దీనిని ఉపయోగించి.. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం.. ఆరోగ్యకరమైన, టేస్టీ స్మూతీని తయారు చేసుకోవచ్చు. ఇది మీ ఉదయాన్ని టేస్టీగా, ఆరోగ్యంగా మార్చేస్తుంది. పైగా దీనిని చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు.. ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. కేవలం మూడు పదార్థాలతో పీనట్ బటర్ స్మూతీని తయారు చేసుకోవచ్చు. మరి దీనిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* అరటి పండు - 1
* పాలు - 1 కప్పు
* పీనట్ బటర్ - 3 టేబుల్ స్పూన్లు
పీనట్ బటర్ స్మూతీ తయారీ విధానం
మిక్సీ జార్ తీసుకుని.. దానిలో అరటిపండును.. ముక్కలుచేసి వేయాలి. దానిలో పాలు, పీనట్ బటర్ వేసి బాగా బ్లెండ్ చేయాలి. స్మూతీగా తయారయ్యే వరకు దానిని మిక్సీ చేయండి. దీనిని గ్లాసులో పోసుకుని.. ఐస్‌తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రిజ్‌లో కొంచెం సేపు ఉంచి అప్పుడు తాగవచ్చు. మరింత టేస్టీగా మార్చుకోవాలనుకుంటే డ్రైఫ్రూట్ని కూడా వేసుకోవచ్చు. అంతే సింపుల్, హెల్తీ స్మూతీ రెడీ అయిపోంది.
సంబంధిత కథనం