తెలుగు న్యూస్  /  Lifestyle  /  Eating Boiled Egg Is Healthy, Here Is Healthier Boiled Egg Bhurji Recipe

Boiled Egg Bhurji Recipe । ఉడికించిన గుడ్లు తింటే ఆరోగ్యం.. రుచికరంగా ఇలా భుర్జీ చేసుకొని తినండి!

HT Telugu Desk HT Telugu

03 May 2023, 19:07 IST

    • Boiled Egg Bhurji Recipe: గుడ్లను ఉడకబెట్టుకొని తినడం ద్వారా పోషకాలు లభిస్తాయి. రుచికరమైన బాయిల్డ్ ఎగ్ భుర్జీ రెసిపీ ఇక్కడ చూడండి.
Boiled Egg Bhurji Recipe
Boiled Egg Bhurji Recipe (Unsplash)

Boiled Egg Bhurji Recipe

Egg Recipes: కోడిగుడ్లతో అనేక రుచికరమైన వంటకాలను చాలా సులభంగా, త్వరగా చేసుకోవచ్చు. ఎగ్ భుర్జీని చాలా మంది ఇష్టపడే వంటకం. గుడ్లను గిలక్కొట్టి ఈ వంటకం తయారు చేస్తారు. అయితే ఇలా కాకుండా మీరు ఎప్పుడైనా ఉడకబెట్టిన గుడ్లతో ఎగ్ భుర్జీ చేశారా? ఇది కూడా చాలా రుచికరంగా ఉంటుంది. అన్నం, రోటీ, పరాఠా, వడాపావ్, బ్రెడ్ ఇలా దేనితోనే తినవచ్చు. ఏ సమయంలోనైనా తినడానికి ఇది గొప్ప వంటకం.

గుడ్లు ప్రోటీన్లకు మంచి మూలం. ఇవి అసంతృప్త కొవ్వులను కూడా కలిగి ఉంటాయి, ఇవి గుండెకు ఆరోగ్యకరం. అంతేకాకుండా విటమిన్ B6, B12, విటమిన్ D వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. గుడ్లను ఉడకబెట్టుకొని తినడం ద్వారా ఈ పోషకాలు లభిస్తాయి. కాబట్టి రుచికరమైన బాయిల్డ్ ఎగ్ భుర్జీ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం, మీరూ ఇలా ప్రయత్నించి చూడండి.

Boiled Egg Bhurji Recipe కోసం కావలసినవి

  • 4 ఉడికించిన గుడ్లు
  • 2 టేబుల్ స్పూన్లు నూనె
  • 1 టేబుల్‌స్పూన్ వెన్న
  • 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయలు
  • 2 టీస్పూన్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి
  • 1 టీస్పూన్ సన్నగా తరిగిన అల్లం
  • 1 టీస్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి
  • 1/2 కప్పు సన్నగా తరిగిన టమోటాలు
  • 1 టీస్పూన్ ఉప్పు
  • 1 టీస్పూన్ ధనియాల పొడి
  • 1/2 టీస్పూన్ పసుపు పొడి
  • 2 టీస్పూన్ గరం మసాలా
  • 1/2 టీస్పూన్ కాశ్మీరీ ఎర్ర మిరప పొడి
  • 1 టీస్పూన్ నిమ్మరసం
  • 2 టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర

బాయిల్డ్ ఎగ్ భుర్జీ తయారీ విధానం

  1. ముందుగా ఉడకబెట్టిన గుడ్లను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి, ఒక పక్కన పెట్టండి.
  2. తర్వాత ఒక కడాయిలో మీడియం మంట మీద నూనె, వెన్నని వేసి వేడి చేయండి.
  3. నూనె వేడి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేయించండి. ఉల్లిపాయలు లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
  4. ఇప్పుడు, టమోటాలు, ఉప్పు వేసి మరో నిమిషం ఉడికించాలి.
  5. ఆ తరువాత, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా, కారం వేసి బాగా కలపండి
  6. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసిన గుడ్లు వేసి మసాలాతో మృదువుగా కలపండి.
  7. చివరగా నిమ్మరసం పిండండి, కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి.

అంతే, బాయిల్డ్ ఎగ్ భుర్జీ రెడీ. వేడివేడిగా వడ్డించండి.