Weight loss with Apple Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ జ్యూస్ తాగితే ఎన్ని బెనిఫిట్సో..
15 November 2022, 7:18 IST
- Apple Juice Benefits : బరువు తగ్గాలన్నా.. చలికాలంలో ఇబ్బంది పెట్టే ఆస్తమాను తగ్గించుకోవాలన్నా.. మీరు యాపిల్ జ్యూస్ తాగాల్సిందే. ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆపిల్ జ్యూస్ తాగితే.. మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
యాపిల్ జ్యూస్ బెనిఫిట్స్
Drinking Apple Juice Empty Stomach for Weight Loss : రోజుకో యాపిల్ వైద్యులను దూరంగా ఉంచుతుందనేది మన అందరికీ తెలుసు. పైగా అది చాలా వరకు నిజం కూడా. ప్రతిరోజూ ఉదయాన్నే యాపిల్ తినడం లేదా యాపిల్ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ జ్యూస్ తాగడం వల్ల.. మనం తిన్నప్పుడు పొందే బెనిఫిట్స్ కంటే.. ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. ఇంతకీ ఖాళీ కడుపుతో యాపిల్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెరుగైన కంటి చూపు కోసం..
యాపిల్‌లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే వారు.. యాపిల్ జ్యూస్ తాగడం వల్ల తమ కళ్లను రక్షించుకోవచ్చు.
బరువు తగ్గడం
బరువు తగ్గాలనుకునేవారికి యాపిల్ జ్యూస్ మంచి ఎంపిక. మీరు ఆ అదనపు బరువును కోల్పోవాలని కోరుకుంటే.. ఖాళీ కడుపుతో యాపిల్ జ్యూస్ తాగడం మంచిది. దీని వల్ల మీరు ఉత్తమ ఫలితాలు చూడవచ్చు. యాపిల్ జ్యూస్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది. పైగా మీకు ఎక్కువ సమయం ఆకలి కూడా వేయదు.
కంట్రోల్ ఆస్తమా
చలికాలంలో ఇబ్బంది పెట్టే సమస్య ఆస్తమా. దానిని తగ్గించుకోవాలనుకుంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ జ్యూస్ తీసుకోండి. యాపిల్ జ్యూస్‌లో ఉండే పోషకాలు ఆస్తమాకు చాలా మేలు చేస్తాయి. ఆస్తమా రాకుండా ఉండాలన్నా.. ఆస్తమా నుంచి బయటపడాలన్నా.. రోజూ ఉదయాన్నే యాపిల్ జ్యూస్ తాగవచ్చు.
కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది
పెరుగుతున్న కొలెస్ట్రాల్ నేటి కాలంలో ప్రతి వ్యక్తికి ఆందోళన కలిగిస్తుంద. మనం అనుసరించే జీవనశైలే దీనికి కారణం. మీకున్న బిజీ షెడ్యూల్‌లలో.. మీ రోజువారీ ఆహారంపై శ్రద్ధ వహించడం చాలా కష్టం. అందుకే ఖాళీ కడుపుతో ఉదయాన్నే యాపిల్ జ్యూస్ తీసుకోండి. ఇది మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంతో పాటు.. కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది.