Natural Energy Drink | ఈ జ్యూస్‌లు సహజమైన ఎనర్జీ బూస్టర్లు!
(1 / 7)
కూరగాయల రసాలు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి, అవి శరీరం నుండి విషాన్ని తొలగించి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కొన్ని జ్యూస్‌లు రోగనిరోధక శక్తిని పెంచి, బరువును అదుపులో ఉంచుతాయి. ఆకలి తీర్చుతాయి, శక్తిని అందిస్తాయి.(Unsplash)
(2 / 7)
కూరగాయల రసంలోని మూలకాలు రక్తం ఆక్సిజన్ మోసే సామర్థ్యాన్ని పెంచుతాయి, శక్తి స్థాయిలను మెరుగుపరుస్తాయి.(Unsplash)
(3 / 7)
కాశీఫలం/పొట్లకాయ రసంలో కాల్షియం, జింక్, ఫాస్పరస్, థయామిన్, రైబోఫ్లేవిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అలసట నుండి ఉపశమనం కలిగించి మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది.(Unsplash)
(4 / 7)
ప్రతిరోజూ ఉదయాన్నే టొమాటో, క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తాగితే మంచి శక్తి లభిస్తుంది. ఈ కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి టాక్సిన్స్ ను బయటకు, శరీరంలో శక్తిని నిలిపి ఉంచుతాయి. (Unsplash)
(5 / 7)
సోరకాయ రసం తాగితే విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం వంటి పోషకాలు అందుతాయి, జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, శక్తిని అందిస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.( Unsplash)
(6 / 7)
క్యారెట్లు కూడా చాలా పోషకాలను కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. క్యారెట్ జ్యూస్ తాగితే రోజంతా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.(Unsplash)
ఇతర గ్యాలరీలు