తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bubbles Urine Reasons : మీరు మూత్రం పోస్తుంటే నురగ ఎక్కువగా వస్తుందా? కారణాలేంటి?

Bubbles Urine Reasons : మీరు మూత్రం పోస్తుంటే నురగ ఎక్కువగా వస్తుందా? కారణాలేంటి?

Anand Sai HT Telugu

20 February 2024, 12:30 IST

google News
    • Bubbles Urine Reasons In Telugu : కొందరికి మూత్రంలో నురగ ఎక్కువగా స్తూ ఉంటుంది. దీనితో ఆందోళన చెందుతారు. ఇలా వచ్చేందుకు కారణాలేంటి?
మూత్రంలో ఎక్కువ నురగ వస్తే సమస్యలు
మూత్రంలో ఎక్కువ నురగ వస్తే సమస్యలు (Unsplash)

మూత్రంలో ఎక్కువ నురగ వస్తే సమస్యలు

మూత్ర విసర్జన సమయంలో మూత్రం రంగు, వాసన గురించి మరింత అవగాహన కలిగి ఉండాలి. మూత్రం రంగు స్వచ్ఛమైన నీరులా ఉంటే, మీ ఆరోగ్యం కూడా బాగుంటుందని సూచిస్తుంది. అదే యూరిన్ కలర్ డార్క్ గా, స్మెల్లీగా, బుడగలు వస్తుంటే కొన్ని అనారోగ్య సమస్యలున్నాయని అర్థం చేసుకోవాలి.

మనం మూత్ర విసర్జన చేసినప్పుడు, మూత్రం పోయడానికి ఎక్కువ శక్తిని ఉపయోగిస్తే నురుగ రావడం సహజం. డిటర్జెంట్లపై మూత్ర విసర్జన చేయడం లేదా అధిక శక్తిని ఉపయోగించడం వలన నురుగ వస్తుంది. అదే రొటీన్ మూత్ర విసర్జనలో నురగలు వస్తుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. నురగకు కారణమయ్యే ఆరోగ్య సమస్యలన్నీ ఇక్కడ ఉన్నాయి.

నీరు తక్కువ తాగుతున్నారేమో

నిర్జలీకరణం మూత్రం పెద్ద మొత్తంలో ప్రోటీన్లు, రసాయనాలను విడుదల చేస్తుంది. కాబట్టి మీరు తరచుగా నీరు తాగాలి. డీహైడ్రేషన్‌కు గురైతే మూత్రంలో నురగలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు మహిళలకు గర్భధారణ సమయంలో ఈ రకమైన మూత్రవిసర్జన సాధారణం. గర్భధారణ సమయంలో కిడ్నీలు ఎక్కువగా పనిచేస్తాయి.

ఒత్తిడితో కూడా సమస్యే

ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతుంది. ఆ సందర్భంలో మూత్రం నురుగుగా ఉంటుంది. మధుమేహం మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. నురుగ మూత్రానికి కారణమవుతుంది. మూత్రపిండాలకు అధిక చక్కెర రక్తం మూత్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

కిడ్నీ సమస్యలు ఉన్నాయా?

మూత్రంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటే ఆ పరిస్థితిని ప్రొటీనురియా అంటారు. కిడ్నీలు ప్రొటీన్లను సరిగ్గా ఫిల్టర్ చేయనప్పుడు ఈ సమస్య వస్తుంది. వైద్యుడిని సంప్రదించాలి. యూటీఐ బ్యాక్టీరియా మూత్ర నాళంలోకి ప్రవేశించినప్పుడు నురుగుతో కూడిన మూత్రం వస్తుంది. నురుగతో కూడిన మూత్రం హృదయ సంబంధ సమస్యలకు సంకేతం. మూత్రంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి.

మూత్రం సాధారణ రంగులో కాకుండా మరో రంగులో వస్తుంటే అది అంతర్లీనంగా ఉన్న వ్యాధులను సూచించవచ్చు. కొన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లు మూత్రాన్ని మిల్కీ వైట్‌గా మార్చగలవు. మలబద్ధకం ఉన్న స్త్రీలలో ఊదారంగు మూత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది.

మూత్రం రంగు సమస్యలు

క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు మూత్రం రంగులో మార్పు జరుగుతుంది. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, నారింజ రంగు, ముదురు గోధుమరంగు మొదలైనవి మూత్రానికి సంబంధించి అసాధారణమైన రంగులు. అయితే మూత్ర పరీక్ష ద్వారా వీటిపై మరింత క్లారిటీ వస్తుంది.

మూత్రం లేత పసుపు రంగులో ఉంటే వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి. తగినంత నీరు తాగుతున్నారు, హైడ్రేటెడ్ గా ఉంటున్నారు అని ఇది చెబుతుంది. ముదురు పసుపు రంగు మూత్రం వస్తుంటే, అది వ్యక్తి డీహైడ్రేషన్‌కు గురైనట్లు అర్థం చేసుకోవాలి. ఎక్కువ నీరు తాగాలి. రోజుకు సుమారుగా 6-8 గ్లాసుల నీటిని తాగితే మంచిది.

లేత నారింజ రంగు మూత్రం అంటే ఒక వ్యక్తి కొద్దిగా నిర్జలీకరణానికి గురయ్యాడని సూచిస్తుంది. వారు మరిన్ని ఆరోగ్యకరమైన ద్రవాలను తీసుకోవాలి.

తదుపరి వ్యాసం