తెలుగు న్యూస్  /  Lifestyle  /  Cold Shower Or Warm Bath Ayurveda Expert On What Is Better For You In Winter Season

Winter bath: చన్నీళ్లా వేడి నీళ్లా వింటర్‌‌లో ఏది మేలు? ఆయుర్వేద నిపుణుల సలహా ఇదే

HT Telugu Desk HT Telugu

17 January 2023, 16:02 IST

    • Winter bath: చలికాలంలో చన్నీటి స్నానం చేయాలని కొందరు, వేడి నీటి స్నానం చేయాలని మరికొందరు చెబుతారు. ఆయుర్వేద నిపుణుల సలహా ఒకసారి చూడండి.
వింటర్‌లో చన్నీటి స్నానం మేలు చేస్తుందా? వేడి నీటి స్నానమా?
వింటర్‌లో చన్నీటి స్నానం మేలు చేస్తుందా? వేడి నీటి స్నానమా? (Freepik)

వింటర్‌లో చన్నీటి స్నానం మేలు చేస్తుందా? వేడి నీటి స్నానమా?

చన్నీళ్లయినా, వేడి నీళ్లయినా స్నానం చేయడం ఏ సీజన్‌లోనైనా మంచి ప్రయోజనాలను ఇస్తుంది. శారీరకంగా, మానసికంగా ఉల్లాసాన్ని ఇస్తుంది. అయితే స్నానం వేడి నీరుతో చేయాలా? చన్నీరుతో చేయాలా అన్న ప్రశ్నకు నిపుణుల నుంచి కూడా మిశ్రమ స్పందన లభిస్తోంది. చన్నీటితో ఉన్న లాభాలను ఒకరు, వేడి నీటితో ఉన్న లాభాలను మరొకరు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Raw Onions: రోజుకో పచ్చి ఉల్లిపాయ తింటే చాలు ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం

Chinta Chiguru Pulihora: చింతచిగురు పులిహోర ఇలా చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు

Dal water: పప్పు నీళ్లు ప్రతిరోజూ ఇలా తాగితే ఎన్నో ప్రయోజనాలు, పిల్లలకు తాగిస్తే మరీ మంచిది

Cardamom Warm Water Benefits : యాలకుల వేడి నీరు తాగితే మీకు చెప్పలేనన్నీ ప్రయోజనాలు దక్కుతాయి

వింటర్ సీజన్‌లో చన్నీటి స్నానం అనేక ప్రయోజనాలను ఇస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీరిలో తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉంటాయని, మెటబాలిక్ రేటు బాగుంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చన్నీటి స్నానం శరీరంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. మీరు మరింత యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. చర్మం పొడి బారకుండా, వెంట్రుకలు పొడి బారకుండా కాపాడుతుంది. అయితే వేడి నీటి స్నానం మంచిదని చెప్పే వారు మీకు బాగా నిద్ర పడుతుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని, కండరాలు, కీళ్ల నొప్పులకు ఉపశమనంగా ఉంటుందని సూచిస్తున్నారు.

వింటర్‌లో చన్నీటి స్నానం మంచిదన్న వాదనలను ఒక ఆయుర్వేద నిపుణురాలు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో అంగీకరించలేదు. చన్నీటి స్నానం వాతాన్ని పెంచుతాయని, శరీరంలో నొప్పులను పెంచుతాయని డాక్టర్ రేఖా రాధామొని చెప్పారు. చన్నీటితో స్నానం చేస్తే శరీరం ఉష్ణోగ్రతలు కాపాడుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుందని చెప్పారు.

వింటర్‌లో చన్నీటితో సమస్య ఏంటి?

‘చన్నీటితో వాతం పెరుగుతుంది. అంటే నొప్పులు, కండరాలు స్టిఫ్‌గా మారడం, పొడి బారడం, మెటబాలిజం తగ్గడం, జీర్ణక్రియ మందగించడం, హార్మోన్లలో అసమతుల్యత వంటి సమస్యలు ఎదురవుతాయి. వెచ్చని నీటితో స్నానం చేస్తే వాత దోషం తగ్గుతుంది. అయితే ఒకవేళ చన్నీటితోనే స్నానం చేసే అలవాటు ఉన్నవారు దానిని కొనసాగించవచ్చు. అంటే అదే అలవాటు ఉన్న వారికి మేలు చేస్తుంది. శరీరంలో ఎలాంటి సమస్య ఏర్పడదు..’ అని వివరించారు.

సరైన ఆయుర్వేద విధానం ఏంటి?

‘చన్నీటి స్నానం ఆయుర్వేద అభ్యాసం ఏమీ కాదు. మన శరీరంలోని అంతర్గత వాతావరణం వెచ్చగా ఉంటుంది. జీర్ణక్రియకు, రక్త ప్రసరణకు, ఇతర అన్ని మెటబాలిజం ప్రక్రియలకు శరీరం వెచ్చదనం కోరుకుంటుంది. మీరు చల్లని నీటిలో మునిగితే వాతం పెరుగుతుంది. చర్మం పొడి బారుతుంది. ఉష్ణోగ్రతను నిలుపుకోవడానికి శరీరం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. చలికాలంలో బయట చల్లగా ఉంటుంది. ఈ సమయంలో ఒంట్లో అంతర్గత వాతావరణం వెచ్చగా ఉండేందుకు శరీరం కష్టపడుతుంది. మీరు చన్నీటిలో మునిగితే ఇంకా కష్టపడాల్సి వస్తుంది. శరీరాన్ని మీరు బాగా కష్టపెట్టదలుచుకున్నారా? లేదు కదా.. మీ బాడీ చెప్పినట్టు వినండి. మీ శరీరానికి వెచ్చదనం అవసరం..’ అని ఆయుర్వేద నిపుణులు చెప్పారు.

వింటర్‌లో ఏది మేలు చేస్తుందన్న ప్రశ్నకు సమాధానం నిక్కచ్చిగా ఉండదు. ఒకరికి ఒక విధానం బాగా పనిచేస్తే మరొకరికి ఇంకొక విధానం బాగా పనిచేస్తుండొచ్చు. అందువల్ల మీరు ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నట్టయితే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మేలు.

టాపిక్