తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Places To Visit In Kerala । కేరళలోని ఈ ప్రదేశాలు.. పర్యాటకులకు స్వర్గధామాలు!

Places to Visit in Kerala । కేరళలోని ఈ ప్రదేశాలు.. పర్యాటకులకు స్వర్గధామాలు!

HT Telugu Desk HT Telugu

23 February 2023, 12:12 IST

google News
    • Best Places to Visit in Kerala: దేవతల సొంత దేశంగా పేరుగాంచిన కేరళలో పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఎక్కువగా పర్యాటకులను ఆకర్షిస్తున్న కొన్ని ప్రదేశాలు ఇక్కడ చూడండి.
Places to Visit in Kerala
Places to Visit in Kerala (Kerala Tourism)

Places to Visit in Kerala

కళ్లకు కనువిందు చేసే ఆకుపచ్చని తోటలు, వాటి నడుమ వయ్యారాలు తిరిగే రహదారులు, నిండైన వృక్షసంపదతో దట్టమైన అభయారణ్యాలు, అరుదైన వన్యప్రాణులు, ఆహ్లాదకరమైన తీర ప్రాంతాలు, ఎటు చూసినా మంత్రముగ్దులను చేసే సుందర దృశ్యాలు వీటన్నింటికీ ఏకైక గమ్యస్థానం కేరళ. దేవతల సొంత దేశంగా పేరుగాంచిన కేరళలో ప్రకృతి రమణీయతకు కొదువ లేదు, చూడదగ్గ పర్యాటక ప్రదేశాలకు లెక్క లేదు. అందుకే ఏ సీజన్‌లో అయినా భారతదేశంలో ఉత్తమ పర్యాటక ప్రదేశంగా కేరళ నిలుస్తుంది.

తాజా నివేదికల ప్రకారం 2022 సంవత్సరంలో కేరళను 1.88 కోట్ల మంది స్వదేశీ పర్యాటకులు సందర్శించారు. ఇది ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డ్. పతనంతిట్ట, వయనాడ్, ఇడుక్కి, అలప్పుజా, మలప్పురం, తిరువనంతపురం మొదలైన జిల్లాలకు పర్యాటకులు ఎక్కువ వచ్చారు.

Best Places to Visit in Kerala- కేరళలోని పర్యాటక ప్రదేశాలు

సోలో ట్రిప్ అయినా, స్నేహితులతో కలిసి వెళ్లాలన్నా, హానీమూన్ కోసం కొత్త జంటలు చేసే రొమాంటిక్ ట్రిప్ అయినా, ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకైనా కేరళలో చూడదగ్గ ప్రదేశాలు అనేకం. పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న కేరళలోని కొన్ని ఉత్తమ పర్యాటక కేంద్రాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

మున్నార్

కేరళలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో మున్నార్ ఒకటి. ఆకర్షణీయమైన టీ ఎస్టేట్‌లు, ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్లు, వన్యప్రాణుల పలకరింపులు, అద్భుతమైన జలపాతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ఈ అందమైన ప్రదేశానికి చాలా మంది హానీమూన్ కోసం లేదా భాగస్వామితో కలిసి ఒక రొమాంటిక్ ప్రయాణం చేయడానికి ఇక్కడకు వస్తారు.

కన్నూర్

భారతదేశంలోని అత్యంత పొడవైన ఆఫ్ బీట్ తీరప్రాంతలలో కన్నూర్ ఒకటి. ఇక్కడి బీచ్ హౌస్‌ సందర్శన జీవితంలో మరిచిపోలేని అనుభూతి. ఇది తొట్టాడ బీచ్‌కు కొద్ది దూరంలో దట్టమైన కొబ్బరి చెట్ల నడుమ ఉన్న శతాబ్దాల నాటి, సాంప్రదాయ కేరళ ఇల్లు. ఈ మనోహరమైన హోమ్‌స్టే కొంత తీరప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశం.

వర్కాల బీచ్‌

కేరళలో ఉన్న వర్కాల బీచ్ సుందరమైన దృశ్యాలకు, ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు స్కూబా డైవింగ్ వంటి నీటి అడుగున చేసే సాహసాలను కూడా ఆస్వాదించవచ్చు. కేరళలోని కోవలం బీచ్ కూడా ఎంతో ప్రత్యేకమైన గమ్యస్థానం. ఈ ప్రదేశం దశాబ్దాలుగా భారతదేశం నలుమూలల నుండే కాక, విదేశాల నుంచి కూడా ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

పెరియార్ టైగర్ రిజర్వ్

పెరియార్ టైగర్ రిజర్వ్ ఒక పెద్ద పులులను పరిచయం చేసే ఒక ఉత్కంఠభరితమైన అటవీప్రాంత్రం. పచ్చదనం, ప్రశాంతతను కోరుకునే వారికి లేదా ప్రకృతితో సన్నిహితంగా ఉండటానికి, అరుదైన వన్యప్రాణులను చూడటానికి ఈ ప్రదేశం సరైనది. ఈ అభయారణ్యంలో పర్యటిస్తున్నప్పుడు, మీరు శక్తివంతమైన ఆసియా ఏనుగులు, బెంగాల్ పులులు, తెల్ల పులులు, పెద్ద పెద్ద ఉడుతలను సులభంగా చూడవచ్చు. మీ వెంటగనక బైనాక్యులర్‌ లేదా హైడైఫినేషన్ కెమెరా ఉంటే మీరు నీలి రెక్కలు గల పారాకీట్, మలబార్ గ్రే హార్న్‌బిల్, నీలగిరి కలప పావురంతో వంటి ఎన్నో రకాల అన్యదేశ పక్షి జాతులను వీక్షించవచ్చు.

పొన్ముడి

తిరువనంతపురం నుండి కేవలం 55 కిలోమీటర్ల దూరంలో ఉండే పొన్ముడి మరొక అద్భుతమైన ప్రాకృతిక ప్రదేశం. దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉండే ఎత్తైన కొండలు, పచ్చని పచ్చిక బయళ్లు, జలపాతాలు, అన్ని రకాల ప్రత్యేకమైన వృక్షజాలం, జంతుజాలానికి ఈ ప్రదేశం నిలయం. ఈ ప్రాంతాన్ని ఎక్కడి నుంచి చూసినా పర్వతాల అద్భుతమైన వీక్షణలు అందిస్తుంది. ప్రశాంతమైన స్థానిక గ్రామాల సంస్కృతి, విస్తారమైన తేయాకు తోట అన్నీ ఇక్కడ ఉన్నాయి.

ఛార్ ధామ్ యాత్ర చేయాలనుకుంటున్నారా? ముఖ్యమైన తేదీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలు ఈ లింక్ ద్వారా తెలుసుకోండి.

తదుపరి వ్యాసం