Solo Travel | మీరు ఒక్కరే సోలోగా విహారయాత్ర చేసేందుకు ఈ ప్రదేశాలు బెస్ట్!-go alone here are the best countries in the world to enjoy solo traveling ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Go Alone, Here Are The Best Countries In The World To Enjoy Solo Traveling

Solo Travel | మీరు ఒక్కరే సోలోగా విహారయాత్ర చేసేందుకు ఈ ప్రదేశాలు బెస్ట్!

HT Telugu Desk HT Telugu
Jan 05, 2023 09:27 PM IST

Solo Travel: ఈ ఏడాదిలో మీరు సోలోగా ట్రావెల్ చేయడానికి ప్రపంచంలోని అద్భుతమైన గమ్యస్థానాలు ఇక్కడ తెలుసుకోండి

Solo Travel
Solo Travel (Unsplash)

మీరు, మీ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని ఎన్నో సార్లు ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ చాలా సందర్భాలలో ఆ ప్లానింగ్స్ అని వాయిదా పడుతూనే వచ్చి ఉంటాయి. ఎందుకంటే, అందరితో కలిసి విహారయాత్ర ప్లాన్ చేసినపుడు, అన్నీ సక్రమంగా సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా అందులో ఏ ఒక్కరైనా వారి స్వంత పనులు, మరేఇతర కారణాలతో యాత్రను రద్దు చేసుకున్నట్లయితే అది మిగతా వారిపైన ప్రభావం పడుతుంది, మరోసారి అని తప్పించుకుంటారు. పోనీ కుటుంబ సభ్యులతో కలిసి ప్లాన్ చేసుకుందాం అనుకుంటే మన అభిరుచులకు తగినట్లుగా ప్రదేశాలను ఎంచుకోలేము, ప్రైవసీ ఉండదు. ప్రేమికులు వెళ్లాల్సి వస్తే ఖర్చులు ఎవరో ఒక్కరే భరించాల్సి రావచ్చు. భార్యభర్తలు కలిసి వెళ్లాల్సి వచ్చినా పిల్లలతో ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు మీరు ఒక్కరే ఒంటరిగా టూర్ ప్లాన్ చేసుకోవడం చాలా మేలు కదా? నిజానికి సోలోగా ట్రావెల్ చేయడం చాలా బెటర్.

మీరు సోలోగా ట్రావెల్ చేయడానికి ప్రపంచంలో కొన్ని అద్భుతమైన, సురక్షితమైన, అత్యంత స్నేహపూర్వకమైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తే మీరు ఒంటరి అనే భావన అస్సలు కలుగదు, పైగా ఒంటరిగా రావడమే మంచిదైంది అనుకుంటారు. మీ ఇష్టానుసారం ప్రయాణించడాన్ని ఆస్వాదిస్తారు. అలాంటి కొన్ని దేశాల గురించి ఇక్కడ తెలుసుకోండి, నెక్ట్స్ మీ ట్రిప్ సోలోగానే ప్లాన్ చేయండి, మీ విహారయాత్ర విజయవంతంగా సాగుతుంది.

Solo Travel Destinations- ఒంటరిగా విహారయాత్రకు అద్భుతమైన ప్రదేశాలు

ఈ ఏడాదిలో మీరు సోలోగా ట్రావెల్ చేయడానికి ప్రపంచంలోని అద్భుతమైన గమ్యస్థానాలు ఇవిగో చూడండి.

ఆస్ట్రియా

ఆస్ట్రియా మధ్య యూరోప్ లోని ఒక దేశం. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు మిమ్మల్ని ఆకట్టుకుంటారు. మీరు కళలను ఇష్టపడేవారైతే మీరు తప్పక సందర్శించాల్సిన దేశం. ప్రత్యేకించి మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే, ఇది మీ జాబితాలో ఉండాలి. ఇక్కడ ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, సాహస క్రీడలకు కూడా ఈ ప్రదేశం అద్భుతమైనది.

నెదర్లాండ్స్

ఒంటరిగా ప్రయాణించడానికి సులభమైన గమ్యస్థానాలలో నెదర్లాండ్స్ మరొకటి. మీరు మీ హాలిడేను ఏప్రిల్‌ నెలలో షెడ్యూల్ చేస్తే, అందమైన తులిప్ ఫీల్డ్‌లను అన్వేషించవచ్చు, ఆమ్‌స్టర్‌డ్యామ్ గుండా బైక్‌ను నడపవచ్చు, మరెన్నో యాక్టివిటీలు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇది మీ మొదటి సోలో ట్రిప్ అయితే, మీకు హోటల్‌లో ఒంటరిగా ఉండాలనే తలంపు నచ్చకపోతే, ఇక్కడ అనేక హాస్టళ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ్నించో వచ్చి ఈ హాస్టళ్లలో ఉంటూ కొన్ని రోజులు ఉంటారు, ఎవరికి వారు వంట కూడా చేసుకోవచ్చు.

ఐస్లాండ్

ఒంటరి ప్రయాణీకులను సాదరంగా స్వాగతించే మరొక సురక్షితమైనప్రదేశం ఐస్లాండ్. ప్రకృతి రమణీయతను, ఆఫ్ బీట్ ప్రదేశాలను ఆస్వాదించే వారికి ఇది అద్భుతమైన గమ్యస్థానం. ఇక్కడ అగ్నిపర్వతాలు, హిమానీనదాలు, గుహలు, ఉద్యానవనాలు ఎన్నో ఉన్నాయి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ సర్వే ప్రకారం, ఇది ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన దేశం కూడా.

జపాన్

భారతదేశాని కొంచెం దగ్గరగా ఉండే దేశాలలో జపాన్ ఒకటి. ఒంటరిగా ప్రయాణాలు చేసేవారికి జపాన్ చాలా మనోహరమైన ప్రదేశం. ఒక ద్వీపం నుంచి మరొక ద్వీపాన్ని అన్వేషించడం, అత్యంత వేగంగా దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లలో ప్రయాణం, నోరూరించే రుచులను ఆస్వాదించడం వంటి వాటికి జపాన్ ప్రసిద్ధి. జపాన్ మహిళా పర్యాటకులకు కూడా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన గమ్యస్థానాలలో ఒకటిగా ప్రశంసలు కలిగి ఉంది.

న్యూజిలాండ్

మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు స్వేచ్ఛగా బయట తిరుగుతూ అన్ని రకాల వినోదాలు ఆస్వాదించాలనుకుంటే, న్యూజిలాండ్‌ని ఎంచుకోండి. ఈ ప్రదేశంలోని హిల్ స్టేషన్లు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇరుకైన కొండల మధ్య నుంచి పారే నదులు మనోహరంగా అనిపిస్తాయి, ఇక్కడి వర్షారణ్యాలు, తిమింగలాల వీక్షణ వంటివి మీకు మరపురాని అనుభూతులు అందిస్తాయి. న్యూజిలాండ్ కూడా మహిళలకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా మంచి రేటింగ్స్ ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్