తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Tips : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఈ టిప్స్ పాటిస్తే కోటీశ్వరులవుతారు!

Chanakya Tips : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఈ టిప్స్ పాటిస్తే కోటీశ్వరులవుతారు!

HT Telugu Desk HT Telugu

16 May 2023, 12:51 IST

    • Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో సామాజిక సంక్షేమానికి సంబంధించి.. అనేక విధానాలను అందించాడు. ఈ విధానాలను అర్థం చేసుకుని.. జీవితంలో అనుసరించే వ్యక్తులకు చాలా బాధలు దూరమవుతాయని చెబుతారు. ఈ కాలంలోనూ.. చాణక్య విధానాలు బాగా ప్రాచుర్యం పొందాయి.
చాణక్య నీతి
చాణక్య నీతి

చాణక్య నీతి

చాణక్యుడు భారతదేశంలోని ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు. చాణక్యుడు మంచి రాజకీయ నిపుణుడు మాత్రమే కాకుండా ఆర్థిక శాస్త్రం, దౌత్యం, సామాజిక విషయాలలో కూడా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. తన సూత్రాలలో సామాజిక సంక్షేమానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. వాటిని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి ప్రయోజనాలు పొందవచ్చు. ఈ సూత్రాలలో కొన్ని విషయాలను పేర్కొన్నాడు. వీటిని ఎవరైనా అనుసరిస్తే వారు జీవితంలో చాలా త్వరగా కోటీశ్వరుడు అవుతాడని చాణక్యుడు చెప్పాడు.

ఒక వ్యక్తి తన జీవితంలో ఏ జ్ఞానాన్ని సంపాదించినా లేదా నేర్చుకున్నా, అందులో ఎక్కువ భాగం అతని గురువుకు చెందుతుంది. గురువు నుండి ఏదైనా అధ్యయనం చేయడానికి లేదా నేర్చుకోవడానికి సిగ్గుపడకూడదని నమ్మాడు. ఎలాంటి సిగ్గు లేకుండా చదువుకునే వాడు మంచి విద్యార్థి అని, జీవితంలో ధనవంతుడు అవుతాడని చాణక్యుడు చెప్పాడు.

మీరు జీవితంలో త్వరగా విజయం సాధించాలనుకుంటే, మీ పనిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయండి. ఏదైనా పని ప్రారంభించే ముందు దానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవాలని చాణక్యుడు చెప్పాడు. ఇది పనిని విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలను కూడా పెంచుతుంది. దీనిద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది.

ఒక వ్యక్తి తనను, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి సంపాదిస్తాడని చాణక్యుడు చెప్పాడు. భోజనం చేసేటప్పుడు సిగ్గుపడకూడదని చాణక్యుడు వివరించాడు. విదేశాలకు వెళ్లేటప్పుడు చాలా మందికి ఆహారం విషయంలో విచిత్రమైన సిగ్గు ఉంటుంది. అందువల్ల, వారు ఎక్కువ ఆహారం కూడా తినరు. చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి ఆకలితో ఉన్న సమయంలో ఆహారాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు. ఆకలితో ఉంటే ఆలోచన సరిగా ఉండదు.

చాలా మంది వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడానికి లేదా ఆర్థిక సహాయం కోసం డబ్బు ఇస్తారు. కానీ మనిషి రుణం తీర్చుకోవడంలో కొంతమంది విఫలమవుతారు. అటువంటి పరిస్థితిలో, అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి అడగడానికి సిగ్గుపడకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అప్పులు అడగడానికి కొంతమంది సిగ్గుపడతారు. దీంతో జీవితంలో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలలో ఇరుక్కుపోతారు. రుపాయి రుపాయి పోగేస్తేనే.. ధనవంతులవుతారు. అనవసరంగా ఇతరులకు వదిలిపెట్టకూడదు.